విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: ఇటీవల సమైక్యాంధ్ర కోసం సమ్మె, పెరి గిన డీజిల్ ధరల నేపథ్యంలో ప్రయాణికులు భయపడినట్లే జరిగింది. రవాణా చార్జీలపెంపు నిర్ణయాన్ని ఆర్టీసీ సోమవారం ప్రకటించింది. పెంచిన చార్జీలు మంగళవారం అర్ధరాత్రి నుం చి అమలులోకి వస్తాయి. ఈ నిర్ణయంతో నష్టా ల బాటలో నడుస్తున్న వియజనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని ఆర్టీసీ నార్త్ ఈస్ట్‌కోస్ట్(నెక్) రీజియన్‌కు 10 శాతం మేరకు ఆదాయవృద్ధి లభించి కొంత ఊరట కలిగినట్లయింది.
సర్వీసుల వారీగా పెంచిన చార్జీలను సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ ఏకే.ఖాన్ హైదరాబాద్‌లో ప్రకటించారు. సామాన్య ప్రయాణికులు అధికంగా ప్రయాణించే ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ సర్వీసులపై మోత వేశారు. సంస్థ నిర్వహిస్తున్న అన్ని సర్వీసులలోనూ కనీస ప్రయాణ చార్జీలను పెంచలేదు. ప్రతి కిలోమీటర్‌కూ 4 నుంచి 11 పైసల వరకూ పెంచుతూ వచ్చారు. ప్రస్తుతం కిలోమీటర్‌కి 55 పైసలున్న ఆర్డినరీ సర్వీసులో 59 పైసలు, 72 పైసలున్న ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో 79 పైసలు పెంచారు. అదే విధంగా డీలక్స్ సర్వీసులో 80 నుంచి 89 పైస లు, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 94 నుంచి 105 పైసల వరకూ కిలోమీటర్ ప్రయాణానికి పెంచారు.
అదనపు భారానికి ఊరడింపు నెక్ పరిధిలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లా ల్లో తాజాగా 837 బస్సులు సర్వీసుల్లో ఉన్నా యి. ఇవి రోజుకు సుమారు 3 లక్షల 50 వేల కిలోమీటర్ల దూరం తిరుగుతూ ప్రజలకు సేవలందిస్తున్నాయి. ఈ రవాణా కోసం రోజుకు సరాసరి 66 వేల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తున్నారు. పలుమార్లు పెంచిన డీజిల్ ధరల తరువాత రోజుకు సుమారు రూ 4 లక్షలు అదనపు భారం పడిందని లెక్కలు చెబుతున్నాయి. అయితే తాజాగా పెరిగిన చార్జీల వల్ల 12.5 శాతం ఆదాయ వృద్ధితో రోజుకు రూ 5 లక్షల వరకూ నష్టాన్ని నెక్ రీజియన్ పూడ్చుకోగలుగుతోంది.
జిల్లాల వారీగా పరిశీలిస్తే నెక్ రీజియన్ పరిధిలోని విజయనగరం జిల్లాలో విజయనగరం, పార్వతీపురం, ఎస్.కోట, సాలూరు డిపోలలో రోజుకు సుమారు రూ. 1.75లక్షల వరకూ నష్టం భరించాల్సి వస్తోంది. పెంచిన చార్జీలతో సుమారు రూ. 2.50 లక్షల వరకూ ఆదాయం పెరగడంతో నష్టాన్ని అధిగమించవచ్చని అంచనా వేస్తున్నారు. అదే విధంగా శ్రీకాకుళం జిల్లా పరిధిలో శ్రీకాకుళం-1, శ్రీకాకుళం-2, పాలకొండ, పలాస, టెక్కలి డిపోలున్నాయి. వీటి ద్వారా రోజుకు సుమారు రూ 2.75 లక్షల వరకూ ఇంతవరకు నష్టం వస్తున్నట్లు తెలుస్తోంది. పెంచిన చార్జీలతో సుమారు రూ 3.50లక్షల ఆదాయ వృద్ధితో నష్టాన్ని అధిగమించి కొంత లాభాల్లోకి చేరుకునే అవకాశం ఉందని అధికారుల అంచనా.
విద్యార్థుల రాయితీ పాసుల చార్జీలు
యథాతథం
విద్యార్థులకు సంస్థ అందించే రాయితీ పాసుల చార్జీలలో మార్పు ఉండదని ప్రకటించారు. ఇంతవరకు కిలోమీటర్లకు చెల్లించిన చార్జీలే వర్తిస్తాయి. దూరప్రాంతాలకు ముందస్తుగా మంగళవారం సాయంత్రంలోపు రిజర్వేషన్ చేసుకున్న టిక్కెట్లకు పాత చార్జీలే వర్తిస్తాయి.
చార్జీల భారం
జిల్లా కేంద్రం నుంచి వివిధ ప్రధాన పట్టణాలకు వెళ్లే సర్వీసుల చార్జీలు పాతవి, కొత్తవి ఇలా ఉన్నాయి.
బాదుడు
Published Tue, Nov 5 2013 2:56 AM | Last Updated on Thu, May 24 2018 1:29 PM
Advertisement