
సాక్షి, అమరావతి: కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. కర్ణాటక ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కంకణం కట్టుకుందని మండిపడ్డారు. జేడీఎస్- కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తోందని ఆరోపించారు. కర్ణాటక ప్రభుత్వంలో పలు ఎమ్మెల్యేలు వరుస రాజీనామాలు చేస్తున్న నేపథ్యంలో అసమ్మతి ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల చట్టం అమలు చేయాలన్నారు. అసమ్మతి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. బీజేపీ విలువలను తుంగలో తుక్కి అప్రజాస్వామిక విధానాలను పాటిస్తోందని ఎద్దేవా చేశారు. బీజేపీ విధానాలపై తాము పోరాడుతామని శైలజ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment