‘సాక్షి’ జర్నలిస్టులపై దాడికి నిరసనగా ఏపీలో ధర్నాలు
సాక్షి నెట్‌వర్క్: విజయవాడలో ‘సాక్షి’ జర్నలిస్టులపై ఎమ్మెల్యే జలీల్‌ఖాన్, ఆయన అనుచరుల దాడి, రాజధాని భూములపై వార్తలు రాసిన ‘సాక్షి’ విలేకరులపై కేసులు, వేధింపులనునిరసిస్తూ ఏపీ వ్యాప్తంగా ఏపీయూడబ్ల్యూజే (ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్) ఆధ్వర్యంలో జర్నలిస్టులు కదంతొక్కారు. ర్యాలీలు, ధర్నాలు నిర్వహిం చారు. ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌పై చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టులపై పోలీసుల వేధింపులను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలని నినాదాలు చేశారు.
అంబేడ్కర్, గాంధీ విగ్రహాలకు పాలాభిషేకం చేసి, వినతి పత్రాలు సమర్పించారు. జర్నలిస్టులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను హరిస్తే ఉద్యమిస్తామని ఇండియన్ జర్నలిస్ట్స్ యూని యన్(ఐజేయూ) ఉపాధ్యక్షుడు అంబటి ఆంజ నేయులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ‘సాక్షి’ ఫొటో, వీడియోగ్రాఫర్‌లపై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. సోమవారం ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అర్బన్ యూనిట్ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన నిరసన ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు.