ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. వాలంటీర్ల వ్యవస్థ సత్తా చాటింది. పొద్దు పొడవకముందే ప్రారంభమైన పింఛన్ల పంపిణీ మధ్యాహ్నంకల్లా పూర్తయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో పింఛన్ల పంపిణీపై పటిష్టమైన యంత్రాగం ఏర్పాటు చేసి,13 జిల్లాల్లోని 58.99లక్షల మంది లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. మరోవైపు పింఛన్లు పంపిణీలో జాప్యం చేసిన గ్రామ వలంటీర్లపై రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే వారిని విధుల నుంచి తొలగించాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక పట్టణాల రూపురేఖలు మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రొక్లెయినర్‌తో మురుగు కాలువ పనులు చేస్తుండగా గోడ కూలి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోగా ఆమె తమ్ముడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం చోటు చేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Comments
Please login to add a commentAdd a comment