
మూడవ దశ వైయస్‌ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలులో ప్రారంభించారు. ఇదిలాఉండగా, పోలీస్ శాఖకు చెందిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఫలితాలు మంగళవారం విడుదల అయ్యాయి. మరోవైపు చర్లపల్లిలో శాటిలైట్ రైల్వే స్టేషన్ నిర్మాణానికి కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఇక, చైనాలో కొవిడ్-19 బారిన పడి మరణించిన వారి సంఖ్య 1800 దాటింది. ఇకపోతే, ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఢిఫెన్స్ స్టడీస్ అండ్ ఎనాలిసిస్ (ఐడీఎస్ఏ)కి గోవా దివంగత సీఎం, కేంద్ర మాజీ రక్షణమంత్రి మనోహర్ పారికర్ పేరు పెడుతూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంగళవారం చోటు చేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Comments
Please login to add a commentAdd a comment