సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం చేపట్టిన ప్రధాన పాలసీలు, ప్రాజెక్టులను సమీక్షించేందుకు ఐదుగురు మంత్రులు, ఒక సీనియర్ ఐఏఎస్ అధికారితో కేబినెట్ సబ్ కమిటీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేశారు. బాక్సైట్ తవ్వకాలు నిలిపివేయడం గిరిజనుల్లో ఆత్మవిశ్వాసం పెంచిందని, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గిరిజనలు జీవిత కాలం గుర్తు చేసుకుంటారని అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని కొనసాగించేది లేదని, అందుకే లోతుగా విచారణ చేస్తున్నామని బొత్స సత్యనారాయణ అన్నారు. ముందు అవినీతి కూపం నుండి బయటపడిన తరువాత నిర్మాణాలపై దృష్టి పెడతామని తెలిపారు. ఎంపీలు నామా నాగేశ్వరరావు, నేతకాని వెంకటేష్, బండ ప్రకాష్, ఎమ్మెల్యే బాల్క సుమన్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. తెలంగాణలోని రహదారుల అభివృద్ధి, రీజినల్ రింగ్ రోడ్డు అంశాన్ని కేంద్ర మంత్రికి గుర్తు చేశామని తెలిపారు.
మరిన్ని ప్రధాన వార్తలకు కింది వీడియోను వీక్షించండి..
Comments
Please login to add a commentAdd a comment