రాజకీయ కుట్రతోనే రాష్ట్ర విభజన
Published Fri, Aug 9 2013 2:32 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన నిర్ణయం రాజకీయ కుట్రతో జరిగిందని, దీనిని ఉపసంహరించుకోకుంటే ఢిల్లీ నేతలకు బుద్ధి చెబుతామని సమైక్యాంధ్ర ఉద్యమకారులు హెచ్చరించారు. రాష్ట్రాన్ని విడదీయడం తగదంటూ పలు సంఘాల ప్రతినిధులు, యువత, విద్యార్థులు, రైతులు, కార్మికులు, వ్యాపారులు ఇలా అన్నివర్గాల వారు జిల్లా వ్యాప్తంగా గురువారం ర్యాలీలు, మానవహారాలు, రాస్తారోకోలు, ధర్నాలు చేశారు. సోనియాగాంధీ, కేసీఆర్‌ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. వారికి కర్మకాండలు నిర్వహించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంద్ర ఎమ్మెల్యేలు, మంత్రులు రాజీనామా చేయూలని డిమాండ్ చేశారు.
= జిల్లా కేంద్రం శ్రీకాకుళంలో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో జెడ్పీ కార్యాల యం ఎదురుగా, పొట్టిశ్రీరాములు కూడలి వద్ద మానవహారాలు నిర్వహించారు. అక్కడే పలువురు శిరోముండనం చేరుుంచుకున్నారు. ఈ కార్యక్రమంలో వేదిక ప్రతినిధులు హనుమంతు సాయిరాం, కిల్లారి నారాయణరావు, శోభారాణి, సాగర్, బాలకృష్ణ, ఎ.అప్పారావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ప్రధానరోడ్డుపై వంటావార్పు నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పొన్నాడ వెంకటరమణతోపాటు సుమారు 1500 మంది పాల్గొన్నా రు. విద్యుత్ ఉద్యోగుల ఆధ్వర్యంలో మోటార్‌బైక్ ర్యాలీ నిర్వహించారు. రాజకీయ కుట్రతోనే రాష్ట్ర విభజనకు పాల్పడ్డారని శ్రీకాకుళం బ్రాహ్మణ సంఘం సభ్యులు ధ్వజమెతారు.
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సుఖశాంతులతో కళకళలాడాలని, సమైక్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పట్టణంలోని వైఎస్సార్ కూడలి వద్ద వారు హోమం నిర్వహించారు. అనంతరం బ్రాహ్మణ సంఘం, పలు పార్టీల నేతలు వైఎస్సార్ కూడలి నుంచి ర్యాలీగా డే అండ్ నైట్ కూడలి వద్దకు చేరుకున్నారు. అక్కడ మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు గుమ్మా నాగరాజు, తెన్నేటి విక్రమశర్మ, శ్రీధర్‌శర్మ, కిరణ్‌శర్మ, ప్రభాకరశర్మ, తెన్నేటి అనిల్‌కుమార్, గంటా శ్రీనివాసశర్మ, ఎస్.రామ్మూర్తి, వైఎస్‌ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియ, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బొడ్డేపల్లి పద్మజ, పార్టీ నేతలు అంధవరపు సూరిబాబు, ఎన్ని ధనుంజయ్, కోరాడ రమేష్, సిరాజుద్దీన్, టీడీపీ నేతలు కింజరాపు రామ్మోహననాయుడు, గుండ అప్పలసూర్యనారాయణ, మాదారపు వెంకటేష్, వివిధ సంఘాల ప్రతినిధులు జామి భీమశంకర్, ప్రొఫెసర్ డి.విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.
= ఎచ్చెర్లలోని అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గుంట తులసీరావు ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలవారు కలసి చర్చావేదిక నిర్వహించారు. సమైక్యాంధ్ర ఉద్యమ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. అన్ని రాజకీయ పార్టీలు సమన్వయంతో జేఏసీ గా ఏర్పడి పార్టీలకు అతీతంగా ఉద్యమించాలని తీర్మానం చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి తమ్మినేని సీతారాం, వైఎస్‌ఆర్‌సీపీ నేతలు వరుదు కళ్యాణి, దుప్పల రవీంద్ర, బొడ్డేపల్లి పద్మజ, అంధవరపు సూరిబాబు, కేవీవీ సత్యనారాయణ, టీడీపీ నేతలు కింజరాపు రామ్మోహనరావు, చౌదరి బాబ్జి, లోక్‌సత్తా నేత కొత్తకోట పోలినాయుడు తదితరులు పాల్గొన్నారు.
= రాజాంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఐకేపీ స్వయంశక్తి మహిళా సంఘాల సభ్యులు అంబేద్కర్ కూడలి వద్ద ర్యాలీ నిర్వహించారు. సంతకవిటి మండలంలో సోనియాగాంధీ, కేసీఆర్‌ల చిత్రపటాలకు చెప్పులదండ వేసి ఊరేగించా రు. గుళ్లసీతారాంపురంలో కొంతమంది సమైక్యవాదులు శిరోముండనం చేయించుకున్నారు. రోడ్డుమీద గ్రామస్థులు, యువత వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం రాజాంలో బంద్‌నిర్వహించనున్నారు.
= నరసన్నపేటలో జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కూరగాయల వర్తక సంఘం, నాయూబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ లు, మానవహారాలు నిర్వహించారు. అనంత రం సోనియా, కేసీఆర్‌ల దిష్టిబొమ్మలను దహనం చేశారు.
= పాలకొండలో అన్ని కళాశాలల విద్యార్థులు కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. సమైక్య నినాదాలతో డివిజన్ కేంద్రం హోరెత్తింది. పోలీస్‌స్టేషన్ జంక్షన్‌లో న్యాయవాదులు, రాజకీయపక్షాల నేతలు రాస్తారోకో నిర్వహించి ట్రాఫిక్‌ను స్తంభింప చేశారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో డప్పులతో ర్యాలీ నిర్వహించారు. భామినిలో సమైక్యాంధ్ర పరిరక్షణ కమిటీ ప్రతినిధులు, విద్యార్థులు సోనియాగాంధీ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. రిలే నిరాహారదీక్షలు కొనసాగాయి. శుక్రవారం నుంచి నిరసన కార్యక్రమాలు ఉద్ధృతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. వీరఘట్టం మండలం వండువ సెంటర్‌లో విద్యార్థు లు, గ్రామస్తులు సోనియాగాంధీ, కేసీఆర్ దిష్టిబొమ్మలను చెప్పులతో కొట్టి దహనం చేశారు. వీరఘట్టం మేజర్ పంచాయతీలో టీడీపీ ఆధ్వర్యంలో బంద్‌ను నిర్వహించి వంటా, వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధి హామీ సిబ్బంది, రెవెన్యూ, అంగన్‌వాడీ, స్వయంశక్తి సంఘాలు సంయుక్తంగా ర్యాలీ నిర్వహిం చాయి. సీతంపేటలో స్వయంశక్తి సంఘాల మహిళలు ర్యాలీ చేశారు.
= పాతపట్నంలో జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు చేశారు. ఈ దీక్షకు వైఎస్సార్ సీపీ నాయకుడు కలమట వెంకటరమణ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు సమైక్య ఉద్యమానికి కనీసం మద్దతు తెలపకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం భావ్యం కాదన్నారు. అనంతరం మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కనిపించడం లేదని, ఆచూకీ తెలపాలని కోరుతూ పాతపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
= ఆమదాలవలసలో నేతాజీ యువజన సంఘం, ఐకేపీ ఉద్యోగులు ర్యాలీలు జరపగా తిమ్మాపురం వద్ద గ్రామస్తులు రోడ్డును దిగ్బం ధించారు. సరుబుజ్జిలి మండలం షళంత్రిలో రోడ్డుపై వంటావార్పు చేసి భోజనాలు చేశారు.
= టెక్కలి మండలం తలగాం గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించారు. టెక్కలి పట్టణంలో పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు ర్యాలీ లు నిర్వహించి మానవహారాలు చేపట్టారు.
= ఇచ్ఛాపురంలో జాతీయ రహదారిపై ఐకేపీ మహిళలు రాస్తారోకో నిర్వహించారు. సోంపేట మండలంలోని కొర్లాం వద్ద జాతీయ రహదారిపై స్వయంశక్తి సంఘాలు రాస్తారోకో నిర్వహించారుు. దీంతో వాహనాలు కిలోమీటరు మేర నిలిచిపోయూరుు.
= పలాసలో సమైక్యవాదులు కదం తొక్కారు. వైఎస్సార్ సీపీ, టీడీపీ నేతలు, ప్రెస్‌క్లబ్ సభ్యులు, విద్యార్థులు, డ్వాక్రా మహిళలు సమైక్యాంధ్ర నినాదాన్ని బలంగా వినిపించారు. ఐకేపీ మహిళలు ర్యాలీ నిర్వహించారు. వైఎస్సా ర్ విగ్రహం నుంచి విద్యార్థులు ర్యాలీ నిర్వహించి కాశీబుగ్గ బస్టాండ్ వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. అనంతరం సోనియా దిష్టిబొమ్మకు చెప్పుల దండవేసి తాడుతో ఉరివేశారు. ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వైఎస్సార్ సీపీ సమన్వయకర్త కణితి విశ్వనాథం, పలాస-కాశీబుగ్గ మున్సిపల్ కమిషనర్ టి.నాగేంద్రకుమార్, పలాస పీఏసీఎస్ అధ్యక్షుడు దువ్వాడ శ్రీధర్, మాజీ కౌన్సిలర్ దువ్వాడ శ్రీకాంత్, దువ్వాడ జీవితేశ్వరరావు, పాలవలస వైకుంఠరావు, వైశ్యరాజు రాజు, కె.పి.నాయుడు, చౌదిరి, విజయ్, హనుమంతు మనోహర్, బమ్మిడి కృష్టారావు, కూన మోహనరావు, తమ్మినాన సుధాకర్, బమ్మిడి మోహనరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement