రోడ్డెక్కిన రైతు
గుంటూరు, న్యూస్‌లైన్ :సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా రైతులు రోడ్డెక్కారు. ఎక్కడికక్కడ ట్రాక్టర్లపై భారీగా తరలివచ్చి రోడ్లపై ప్రదర్శన చేశారు. ఉత్సాహవంతులైన యువకులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీలు చేపట్టారు. రైతులతోపాటు రహదారులపైకి తరలివచ్చిన వైఎస్సార్ సీపీ శ్రేణులు రాష్ట్ర విభజనపై తమ వైఖరులు మార్చుకోని కాంగ్రెస్,టీడీపీ, కేంద్రం తీరును తప్పుపట్టారు. పెద్ద ఎత్తున నిరసన తెలి యజేశారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని పసంహరించుకోని పక్షంలో సీమాంధ్రలోని రైతుల పరిస్థితి దారుణంగా మారనుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ర్ట ప్రజలు సుభిక్షంగా ఉండాలని పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టే నిరసన కార్యక్రమాలకు ప్రజల మద్దతు భారీగా లభిస్తుందన్నారు. చిలకలూరిపేటలోని ప్రధాన కూడలిలో రైతులు నిర్వహించిన ట్రాక్టర్ల ప్రదర్శనలో ఆయన పాల్గొని మాట్లాడారు.మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ట్రాక్టర్లపై భారీ ప్రదర్శన చేశారు. సత్తెనపల్లిలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో, మంగళగిరి నియోజకవర్గలో సమన్వయకర్త ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆధ్వర్యంలో పట్టణ కూడలి ప్రాంతంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
రైతులు భారీగా తరలి వచ్చి నిరసన తెలిపారు.
బాపట్ల నియోజకవర్గంలో సమన్వయకర్త కోన రఘుపతి, నరసరావుపేట నియోజకవర్గంలో సమన్వయకర్త డాక్టరు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన చేశారు. గురజాల నియోజకవర్గంలో సమన్వయకర్త జంగా కృష్ణమూర్తి, పెదకూరపాడు నియోజకవర్గంలో సమన్వయకర్త నూతలపాటి హనుమయ్యల ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తె నాలి నియోజకవర్గంలో గళ్లా చందు, వేమూరు నియోజకవర్గంలో సమన్వయకర్త డాక్టర్ మేరుగ నాగార్జునల ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో ప్రదర్శన జరిగింది. వినుకొండ నియోజకవర్గంలో డాక్టరు నన్నపనేని సుధ ఆధ్వర్యంలో ట్రాక్టర్ల ప్రదర్శన చేశారు. తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తలు కొల్లిపర రాజేంద్రప్రసాద్, ఈపూరి అనూఫ్, మందపాటి శేషగిరిరావు ఆధ్వర్యంలో ట్రాక్టర్ల ప్రదర్శన సాగింది. రైతులు భారీగా పాల్గొన్ని మద్దతు తెలిపారు.
గుంటూరు నగరంలో...
గుంటూరు నగరంలో పార్టీ యువజన విభాగం నగర కన్వీనర్, తూర్పు సమన్వయకర్త ఎండీ నసీర్‌అహ్మద్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాలతో ప్రదర్శన నిర్వహించారు. పార్టీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, తూర్పు సమన్వయకర్త షేక్ షౌకత్, ట్రేడ్‌యూనియన్ నగర కన్వీనర్ గులాం రసూల్‌లు డప్పులు వాయించారు.