సమైక్యం కోసం.. ప్రాణ త్యాగానికైనా సిద్ధం | samaikyandhra movement Visalandhra Leaders Strike | Sakshi
Sakshi News home page

సమైక్యం కోసం.. ప్రాణ త్యాగానికైనా సిద్ధం

Published Wed, Feb 12 2014 2:29 AM | Last Updated on Sat, Sep 2 2017 3:35 AM

samaikyandhra movement Visalandhra Leaders  Strike

 రాష్ట్ర విభజన బిల్లును రాష్ట్రపతి ఆమోదించ డాన్ని నిరసిస్తూ.. .జిల్లా వ్యాప్తంగా సమైక్య వాదులు ఆందోళనలు చేపట్టారు. ఎన్‌జీఓలతో పాటు టీడీపీ, విశాలాంధ్ర మహాసభ నాయకులు యూపీఏ ప్రభుత్వం, కేంద్రమంత్రుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. బిల్లును అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.
 
 విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అవసరమై తే.. ప్రాణత్యాగానికైనా సిద్ధమేనని విశాలాంధ్ర మహాసభ నాయకులు స్పష్టం చేశారు. అన్నదమ్ముల్లా కలిసి ఉన్న తెలుగు వారి మధ్య చిచ్చుపెడితే ఊరుకునేది లేదని హెచ్చరించా రు. విభజన బిల్లుకు సహకరిస్తున్న సీమాంధ్ర రాజకీయ నాయకులను తరిమికొడతామని స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం వి శాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో మయూరి జంక్షన్ నుంచి ఆర్‌టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ మానవహారంగా ఏర్పడి యూపీఏ, కేసీఆర్ దిష్టిబొమ్మలతో పాటు సీమాంధ్ర కేంద్రమంత్రుల ఫొటోలతో శవ పేటిగ తయూరు చేసి, దహనం చేశారు.
 
 ఈ సందర్భంగా విశాలాంధ్ర మహా సభ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. చక్రవర్తి మాట్లాడు తూ సమైక్య ఉద్యమం అంతం కాదని, ఇది కేవలం ఆరంభమేనని చెప్పారు. సమైక్య రా ష్ట్రాన్ని సాధించుకునేందుకు అవసరమైతే ప్రా ణత్యాగాలైనా చేస్తామని స్పష్టం చేశారు. రా జ్యాంగానికి వ్యతిరేకంగా, సమైక్యస్ఫూర్తికి వి రుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని యూపీఏ ప్రభుత్వం ఖూనీ చేసిందన్నారు. పార్లమెంట్‌లో బి ల్లు ప్రవేశపెట్టిన క్షణంలో అందరూ ఏకమై రాజకీయాలకు అతీతంగా వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు. విశాలాంధ్ర మహాసభ జిల్లా అధ్యక్షుడు మామిడి అప్పలనాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్‌జీఓ నే తలు ప్రభూజి, గంటా వెంకటరావు, మద్దిల సోంబాబు, అనిల్, భరత్, పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement