బాబు సమైక్యవాదా... తెలంగాణవాదా? | Samaikyavada more ... Bandh? | Sakshi
Sakshi News home page

బాబు సమైక్యవాదా... తెలంగాణవాదా?

Published Thu, Nov 28 2013 5:10 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

Samaikyavada more ... Bandh?

 =ప్రజా సమస్యలు పట్టని మాజీ సీఎం
 =కుప్పం ప్రజలనే మోసం చేస్తున్నారు
 =వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి విమర్శ

 
కుప్పం, న్యూస్‌లైన్: తొమ్మిదేళ్లు వుుఖ్యవుంత్రిగా, వురో తొమ్మిదేళ్లు ప్రతిపక్షనేతగా ఉన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఏనాడైనా ప్రజల గురించి పట్టించుకున్నారా ? అని వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా నియోజకవర్గ కన్వీనర్ నారాయణస్వామి ప్రశ్నించారు. ప్రజాసమస్యల గురించి ఆయన ఏనాడూ పట్టించుకోలేదని చెప్పారు. బీసీలు అధికంగా ఉన్న కుప్పం ప్రాంతంలో వారిని నమ్మించి మోసం చేస్తూ పబ్బం గడిపేస్తున్నారని వివుర్శించారు.

ఈ నెల 30న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుప్పంలో ప్రారంభించనున్న సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర ఏర్పాట్లలో భాగంగా బుధవారం ఇక్కడి వాణి మహల్‌లో  ఆ పార్టీ జిల్లా కార్యకర్తల సమావేశం జరిగింది. పార్టీ కుప్పం నియోజకవర్గ సవున్వయుకర్గ సుబ్రవుణ్యంరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో నారాయణస్వామి మాట్లాడుతూ బాబు సమైక్యవాదా... లేక తెలంగాణ వాదో స్పష్టం చేయూలని డిమాండ్ చేశారు. జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడం ఆయనకు అలవాటుగా మారిందని చెప్పారు.

శంఖారావం సభను విజయవంతం చేయాలని పిలుపుని చ్చారు. పార్టీ రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి వూట్లాడుతూ రాష్ట్ర విభజనతో భావితరాల భవిష్యత్తు నాశవువుతుందని తెలిసినా చంద్రబాబుకు పట్టడం లేదని ధ్వజమెత్తారు.  సుబ్రవుణ్యంరెడ్డి వూట్లాడుతూ సమైక్య శంఖారావాన్ని కుప్పం నుంచి ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి వూట్లాడుతూ 25 సంవత్సరాలుగా శాసన సభ్యుడిగా ఉన్న చంద్రబాబు వల్ల కుప్పంలో పాపాలు పెరిగాయుని, వాటిని తుడిచిపెట్టేందుకు జగన్‌మోహన్‌రెడ్డి ఇక్కడి నుంచే యాత్ర ప్రారంభిస్తారని తెలిపారు.

కుప్పాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. రాజకీయు శక్తిగా వస్తున్న జగన్‌ను ఎవరూ అడ్డుకోలేరని తెలిపారు. కుప్పంలో అడ్డుకుంటే బాబును మిగిలిన ఏ ప్రాంతంలోనూ తిరగనివ్వవుని ఆయన హెచ్చరించారు. ఇప్పుడు బాబు చేస్తున్న రాజకీయూలకు కుప్పం ప్రజలు సమాధానం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. కుప్పం ప్రాంతంలో 25 వేల రేషన్ కార్డులు, 10 వేల పింఛన్లు ఇచ్చిన ఘనత వైఎస్.రాజశేఖరరెడ్డికే దక్కుతుందన్నారు. 1999లో ఉచిత విద్యుత్ విషయాన్ని కుప్పంలో జరిగిన సభలోనే మొదటిసారిగా ప్రకటించారని ఆయన గుర్తుచేశారు.

2004లో అధికారంలోకి వచ్చిన వెంటనే  ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకం చేశారని తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో రెండు లక్షల మంది జనాభా ఉంటే అందరూ సమైక్యాంధ్రను కోరుకుంటున్నారని, వారి ఓట్లతో గెలుపొందిన బాబు మాత్రమే ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని అన్నారు. పార్టీ పలవునేరు నియోజకవర్గ సవున్వయుకర్త అవురనాథరెడ్డి వూట్లాడుతూ రాష్ట్ర విభజనకు మూలం చంద్రబాబేనన్నారు.

కుప్పం ప్రాంతంలో వెరుు్య బ్యాలెట్లను ఉంచి సమైక్యాంధ్ర, విభజనపై ఓటింగ్ పెడితే 999 వుంది సమైక్యాంధ్రకే మొగ్గుచూపుతారని తెలిపారు. పార్టీ తంబళ్లపల్లె నియోజకవర్గ సవున్వయుకర్త ప్రవీణ్‌కువూర్‌రెడ్డి వూట్లాడుతూ చంద్రబాబు తెలుగుజాతిని విడదీసి ద్రోహుడయ్యారని విరుచుకుపడ్డారు. 2014 తర్వాత టీడీపీ కనుమరుగుకావడం ఖాయమన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కుప్పంలో  అభివృద్ధి చేసి సత్తాచాటుకుంటామన్నారు.

ఎమ్మె ల్సీ తిప్పారెడ్డి వూట్లాడుతూ తెలుగుజాతిని సోనియూ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టిన ఏకైక వ్యక్తి చంద్రబాబు అన్నారు. పార్టీ పీలేరు సవున్వయుకర్త చింతల రావుచంద్రారెడ్డి వూట్లాడుతూ అందరి చూపూ సమైక్య శంఖారావం సభ వైపే ఉందన్నారు. పార్టీ సత్యవేడు, మదనపల్లె ని యోజకవర్గాల సమన్వయకర్తలు ఆదివుూలం, షమీమ్ అస్లాం, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయుత్రిదేవీ, అధికార ప్రతినిధి తలపులపల్లె బాబురెడ్డి పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement