బీడు భూములుగా పంటపొలాలు
► ఇసుకరీచ్‌లతో ఇంకిపోయిన భూగర్భ జలాలు
► ఆందోళ నలో స్వర్ణవుుఖి నది పరివాహక రైతులు
► ఖరీఫ్ సాగుకు క్రాప్‌హాలిడే
శ్రీకాళహస్తి మండలంలోని సుమారు 14 గ్రామాల రైతులు స్వర్ణముఖి నదిని నమ్ముకుని వ్యవసాయం చేసుకుంటున్నారు. నదిలో పది నుంచి 20 అడు గుల వరకు బావులు తవ్వుకుని వచ్చే నీటితో పంటలు పండించుకుంటు న్నారు. ఈ ఏడాది ప్రభుత్వం నదిలో ఇసుక రీచులను ఏర్పాటు చేసింది. దీంతో ఇష్టానుసారం ఇసుకను తరలించడంతో భూగర్భ జలాలు ఇంకిపో యాయి. తద్వారా రైతులు తవ్వుకున్న బావులు ఎండిపో యాయి. ఈ క్రమంలో పంటలు పండించుకునే వీలు లేక రైతన్నలు ఖరీఫ్‌కు క్రాఫ్ హాలిడే ప్రకటించి భూములను బీడుగా పెట్టారు.
శ్రీకాళహస్తి రూరల్:మండలంలో ఎగువవీధి, తొండవునాడు, వెంకటాపురం, సుబ్బానాయుుడుకండ్రిగ, రావులింగాపురం, పుల్లారెడ్డికండ్రిగ, అవ్ముపాళెం, చుక్కలనిడిగల్లు, వేడాం, రావూపురం, అబ్బాబట్లపల్లి, మిట్టకండ్రిగ గ్రావూల సమీపంలో స్వర్ణవుుఖి నది ప్రవహిస్తోంది. ఈ గ్రావూల రైతులు స్వర్ణవుుఖి నదిలో బావులు తవ్వి సిమెంట్ ఒరలు ఏర్పాటు చేసుకుని అందులోని నీటితో పంటలు సాగుచేసుకుంటున్నారు. స్తున్నారు. గతంలో ఈ ప్రాంతాల నుంచి ఇసుక తరలింపును రైతులు అడ్డుకునే వారు. ఇప్పుడు ఇసుక రవాణాకు ప్రభుత్వమే పచ్చజెండా ఊపింది. దీనికితోడు ఇక్కడి ఇసుకకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో వుంచి డివూండ్ ఉండడంతో అధికార పార్టీ నాయుకులు ప్రభుత్వ పనుల పేరుతో అనువుతులు తీసుకుని సుదూర ప్రాంతాల్లో డంపింగ్ చేసి అక్కడి నుంచి ఇసుకను పొరుగు రాష్ట్రాలకు తరలిస్తూ రూ.లక్షలు సొవుు్మ చేసుకుంటున్నారు.
కళావిహీనంగా స్వర్ణముఖి
ఇసుక మొత్తం తరలిపోవడంతో స్వరముఖి కళావిహీనంగా తయూరైంది. దీనివల్ల భూగర్భ జలాలు అడుగంటి పోరుు వ్యవసాయుం చేయలేని పరిస్థితి నెలకొందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాపారానికి ప్రభుత్వం ఇప్పటికైనా స్వస్తి చెప్పకపోతే ఆత్మహత్యలే శరణ్యవుని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇసుక రవాణాపై చర్యలు తీసుకోండి
ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయుం వల్ల నదిలో ఇసుకను మొత్తం తీసుకెళ్లారు. భూగర్భ జలాలు అడుగంటిపోయూరుు. ఖరీఫ్ సాగు లేకపోరుునా ఇబ్బంది లేదు. కనీసం రబీలో కూడా పంటలు సాగుచేసుకోలేని దుస్థతి ఏర్పడుతోంది. రైతులు పడుతున్న అవస్థలు ప్రభుత్వం అర్థం చేసుకుని ఇసుక రవాణాను అరికట్టాలి. - చంద్రారెడ్డి, రైతు, అమ్మాపాళెం
ఎడారిని తలపించనున్న స్వర్ణముఖి
గతంలో స్వర్ణవుుఖినది నిండుగా ఇసుకతో కళకలలాడేది. అక్రవు ఇసుక రవాణాదారుల పుణ్యవూ అంటూ, ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయుం వల్ల స్వర్ణవుుఖినది ఎడారిలా తయూరై కళాహీనంగా వూరింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి స్వర్ణవుుఖినదిలో ఇసుకను కాపాడాలి. మునిరత్నం, సర్పంచి, వేడాం