పల్లె పండుగ | sankranti celebrations in srikakulam | Sakshi
Sakshi News home page

పల్లె పండుగ

Published Tue, Jan 14 2014 2:01 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM

sankranti celebrations  in srikakulam

శ్రీకాకుళం కల్చరల్, న్యూస్‌లైన్:గతంలో పల్లెలకే పరిమితమైన సంక్రాం తి పండుగ ఇప్పుడు పట్టణమొచ్చింది. గ్రామీణ ప్రాంతాల సంప్రదాయాలనే పట్టణ ప్రజలూ కొనసాగిస్తున్నారు.  హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నలఫీట్లు పట్టణ ప్రజలను అలరిస్తు న్నాయి.  భోగి పండుగలో పాల్గొనేందుకు యువత ఉత్సాహం చూపుతున్నారు. పట్టణాల్లో పల్ల్లె పండుగ వాతావరణం ఉట్టి పడుతోంది. పిండివంటలు, ముత్యాల ముగ్గుల్లో మహిళలు బిజీ అయ్యూరు. హిందూ సంస్కృతి సంప్రదాయూలను కొనసాగి స్తున్నారు. చదువు, ఉద్యోగాలు, వ్యాపారాల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారితో పట్టణాలు కళకళలాడుతున్నారుు. పట్టణంలోని పలు కూడళ్లలో పిచ్చాపాటి మాటలు, ఆత్మీయ పలకరింపులు, కష్టసుఖాలు చెప్పుకుంటూ కాలంతెలియకుండా గడిపేస్తున్నారు. బంతిపూల పూల తోరణాలతో ఇళ్లవాకిళ్లను అలంకరిస్తున్నారు. మరోపక్క చిన్నారులు గాలిపటాలు ఎగురవేస్తూ సంతోషంగా గడుపుతున్నారు. కార్పొరేట్ కళాశాలలు, స్కూళ్లలో అన్ని పండుగలను సంప్రదాయ బద్ధంగా నిర్వహిస్తున్నారు.
 
 భోగీ మంటల్లో  ఉత్సాహంగా...
 సంక్రాంతి పండగ  భోగితో ప్రారంభమవుతుంది. ఈ పండుగను పట్టణ ప్రాంతాల్లోని పలు కూడళ్ల వద్ద ఆర్భాటంగా నిర్వహిస్తారు. యువకులు భోగి మంటలు వేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. మంటలోల రాగికాని, ఆవుపేడతో చేసిన పిడకలు వేసి ఇంటిల్లిపాదీ స్నానం చేయడం ఆనవారుుతీ. ఇంట్లో చిన్నారులు ఉంటే వారిని కూర్చోబెట్టి రేగుపళ్లు, చిల్లరనాణేలను కలిపి తలమీద పోసి పెద్దలు ఆశీర్వదిస్తారు. ముత్తరుుదవులను ఇంటికి పిలిచి పసుపు ముఖానికి రాసి పేరంటాలుగా కొలుస్తారు.
 
 ముగ్గులు వేయడంలో
  యవతుల బిజీ
 సంప్రదాయ ముగ్గులు వేయడంలో యువతులు పోటీ పడుతున్నారు. ఇళ్ల ముంగిట వివిధ రంగులతో ముగ్గులు వేసి ఆక ర్షిస్తున్నారు. ముగ్గులో కనిపించే పద్మం మహాలక్ష్మికి ప్రతీక. శుభానికి సంకేతం స్వస్తిక్. దీనిని వినాయకుని రూపంగా భావిస్తారు. సూర్య భగవానునికి గుర్తుగా రథం ఆకారంలో ముగ్గు వేస్తున్నారు. పలు చోట్ల నిర్వహించే ముగ్గుల పోటీల్లో కూడా యువతులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. హరిదాసు బొమ్మలు వేయడం, కుండతో పొంగలి ప్రసాదం, చెరకు వంటి బొమ్మలు వేసి మన సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా రంగవల్లికలను దిద్దుతున్నారు. యువతులు మన సంప్రదాయాలకు గుర్తుగా లంగావాణీ లు ధరించి జడగంటలు, తల పై పాపిడిపిందె, జడలో చామంతి పువ్వతో తెలు గింటి ఆడపచులా ముస్తాబులకు ప్రాధాన్యమిస్తున్నారు.
 
 రెడీ మేడ్ పిండివంటలు
 పల్లెల్లో ప్రతి ఇంటిలోనూ పిండివంటల ఘమఘమలు ఊరించినట్టే పట్టణాల్లో రెడీ మేడ్ పిండివంటలు ఊరిస్తున్నాయి. అరిసెలు, పొంగడాలు తయూరు చేస్తూ స్వీట్లను దుకాణాల్లో కొనుగోలుచేసి పిల్లలకు పంచి పెడుతున్నారు.
 
 బొమ్మల కొలువులు
 భోగిరోజు జరిగే మరో ఉత్సవం బొమ్మల కొలువు. సంక్రాంతి, దసరా తదితర పండగల సమయంలో చిన్నపిల్లలను ఆకర్షించేందుకు బొమ్మల కొలువులు నిర్వహిస్తున్నారు. ఏడాది పొడవునా సేకరించిన బొమ్మలను జాగ్రత్తగా భద్రపరిచి దసరా, సంక్రాంతి సమయాలలో బొమ్మల కొలువులు పెడుతున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement