
ఆధారే .. ఆధారం!
తిరుమల వేంకటేశ్వర స్వామివారి దర్శనం ఇకపై శాస్త్రీయంగా నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానం సంకల్పిం చింది.
ఇక శాస్త్రీయంగా శ్రీవారి దర్శన టికెట్ల కేటాయింపు
భక్తుల ఆధార్‌కార్డుతో లింకు
తిరుమల: తిరుమల వేంకటేశ్వర స్వామివారి దర్శనం ఇకపై శాస్త్రీయంగా నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానం సంకల్పిం చింది. టికెట్ల కేటాయింపుల్లో అక్రమాలను అరి కట్టడం, ఆలయంతోపాటు భక్తుల సెక్యూరిటీ, ఎక్కువసార్లు రాకుండా నియంత్రించడం, అం దరికీ దర్శనభాగ్యం కల్పించడం ధ్యేయంగా చర్యలు తీసుకోనున్నారు. ముందుగానే రిజర్వ్ చేసుకుని కేటాయించిన సమయంలోనే స్వామివారిని దర్శంచుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
స్వామివారి దర్శనానికి వచ్చేవారందరికీ ఆధార్‌కార్డు వర్తింప చేసి సమగ్రడేటాను సేకరించాలని టీటీడీ భావిస్తోంది. తిరుమల, తిరుపతిలో ఉండే స్థానికుల్లో ఐదు వేల మందికి ప్రతినెలా మొదటి మంగళవారం శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. దర్శనానికి ఒక సారి వచ్చినవారు తిరిగి మూడు నెలలులోపు రాకు ండా ఆధార్ నంబర్‌తో గుర్తించి నియంత్రించేం దుకు ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ ఆధార్‌కార్డు వర్తింప చేయాలని నిర్ణయించామని టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు తెలిపారు.
ఆధార్‌కార్డు సేకరణ వెనుక అసలు కథ స్వామి దర్శనంలో కోటా పద్ధతి దాగుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. స్థానికులకు అమలు చేసే కోటా దర్శన విధానమే భవిష్యత్‌లో యాత్రికులకు వర్తింప చేయాలని టీటీడీ భావిస్తోందని సమాచారం. దీనివల్ల ముఖ్యంగా టికెట్ల కేటాయింపు, లడ్డూల విక్రయాల్లో దళారులను అరికట్టడం, వీఐపీలతోపాటు ఇతరులు ఎక్కువసార్లు రాకుండా నియంత్రించడం వీలవుతుందన్న ఆలోచనలో ఉన్నారు.
రద్దీ ఆధారంగా భక్తులను ఇష్టమొచ్చినట్టుగా దర్శన క్యూల్లోకి అనుమతించడం వల్ల ఆలయంలో తోపులాటలు చోటు చేసుకుంటున్నాయి. దీనిని నివారించేందుకు రూ. 300 టికెట్ల దర్శనానికి అమలు చేసే టైంస్లాట్‌ను అన్ని రకాల దర్శనాలకు వర్తింపజేయాలని అధికారులు సంకల్పించారు.