పూసపాటిరేగ: వాతావరణంలో మార్పుల కారణంగా సముద్రంలో వీస్తున్న గాలులకు విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలంలోని చింతపల్లిలో బుధవారం తెల్లవారుజామున సముద్రం 30 అడుగుల మేర ముందుకు వచ్చింది. దీంతో తీరం వద్ద ఉన్న వలలు సముద్రంలో కొట్టుకు పోయి సుమారు రూ.3లక్షల వరకు నష్ట పోయినట్లు మత్స్యకారులు తెలిపారు. తీరం అంచున ఉన్న పడవల కిందకు సముద్రం నీరు చేరడంతో వారు ఆందోళనకు గురయ్యారు. అధికారుల హెచ్చరికలతో కొందరు మత్స్యకారులు వేటకు వెళ్లలేదు.