
తాడేపల్లిలో వైఎస్ జగన్ నివాసం వద్ద పోలీసుల గస్తీ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నివాసం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. తాడేపల్లిలోని నివాసాన్ని, చుట్టుపక్కల ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తాడేపల్లి ప్రాంతంలో పూర్తిగా ఆంక్షలు పెట్టారు. కాసేపట్లో వైఎస్ జగన్‌తో ఉన్నతాధికారుల సమావేశం కానున్నారు. రాష్ట్ర పరిస్థితులను ఆయన వివరించనున్నారు.
జగన్‌కు తాత్కాలిక కాన్వాయ్
ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్న వైఎస్ జగన్‌కు ప్రభుత్వం తాత్కాలిక కాన్వాయ్ కేటాయించింది. ఏపీ 18పీ 3418 నంబరుతో ఆరు కొత్త వాహనాలు సమకూర్చింది.
జగన్‌కు ఆశీర్వచనం
టీటీడీ పురోహితులు శుక్రవారం వైఎస్ జగన్ నివాసానికి వచ్చి ఆయనకు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. తిరుమల శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కూడా వీరితో పాటు ఉన్నారు.
జగన్ నివాసం వద్ద సందడి
వైఎస్ జగన్‌ను కలిసేందుకు వస్తున్న అధికారులు, ప్రజా ప్రతినిధులతో ఆయన నివాసం సందడి మారింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు వైఎస్ జగన్ కలిసేందుకు ఆయన నివాసానికి వస్తున్నారు. వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment