న్యూఢిల్లీ: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై కేంద్ర మంత్రి మండలి నోట్ సిద్ధమైనట్లు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చేసి వ్యాఖ్యలు సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపిలలో కలకలం రేపాయి. రేపటి కేంద్ర మంత్రి మండలి సమావేశంలో తెలంగాణ అంశం
అనధికారంగా చర్చించే అవకాశం ఉందని తెలియడంతో వారందరూ రాజీనామాలు చేయడానికి సిద్ధపడ్డారు. వారందరూ కలిసి ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. కావూరి సాంబశివరావు, పురంధేశ్వరి, జెడి శీలం, పల్లం రాజు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి రాజీనామా లేఖలపై సంతకాలు కూడా చేశారు. ఈ రాత్రి 9 గంటలకు వారు పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ను కలిసి రాజీనామా పత్రాలు అందజేస్తారు. దిగ్విజయ్ సింగ్ ద్వారా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాజీనామా పత్రాలు పంపాలని భావిస్తున్నారు.
ఈ నెల 24న లోక్సభ స్పీకర్ మీరా కుమార్ను కూడా కలవాలని వారు నిర్ణయించుకున్నారు.