సీమాంధ్ర కాంగ్రెస్ నేతలది ద్వంద్వ వైఖరి | Seemandhra Congress leaders double standards over state bifurcation, says ambati rambabu | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర కాంగ్రెస్ నేతలది ద్వంద్వ వైఖరి

Published Mon, Aug 26 2013 2:17 PM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM

Seemandhra Congress leaders double standards over state bifurcation, says ambati rambabu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. సోమవారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు విభజన నిర్ణయానికి ముందు ఒక మాట, తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారని ఆయన గుర్తు చేశారు.

రాష్ట్ర విభజన నిర్ణయానికి ముందు ఏం చేశారని ఆయన  సీమాంధ్ర కాంగ్రెస్ నేతలను ఈ సందర్భంగా ప్రశ్నించారు. రాష్ట్ర విభజనపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది కాబట్టి అధిష్టాన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు డ్రామాలు ఆడుతున్నారని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement