సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగుల ఆందోళన సరికాదని సచివాలయ తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేంద్రరావు అన్నారు. తక్షణమే సీమాంధ్ర ఉద్యోగులు తమ ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ డిమాండ్లపై కాక ఉద్యోగుల సమస్యలపై నిరసన తెలిపితే తమకు అభ్యంతరం లేదని అన్నారు.
ఉద్యోగ సంబంధిత సమస్యలపై చర్చించేందుకు సోమవారం సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలు విరమించాలని సూచించారు. 8 తెలంగాణ ఉద్యోగ సంఘాలతో సచివాలయ టి.ఉద్యోగుల సమన్వయ కమిటీ ఏర్పాటుచేశామని, సోమవారం తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని నరేంద్రరావు తెలిపారు.
'సీమాంధ్ర ఉద్యోగుల ఆందోళన సరికాదు'
Published Thu, Aug 8 2013 5:41 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement
Advertisement