సాక్షి, నిజామాబాద్:
సీమాంధ్రలో కూడా 90 శాతం ప్రజలు తెలంగాణ ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నారని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ అన్నారు. విషప్రచారంతో అక్కడి ప్రజ లను మభ్యపెడుతున్నారని విమర్శిం చారు. గురువారం ఆయన నిజామాబాద్ ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. 29న హైదరాబాద్ నిజాం కాలేజీ మైదానంలో జరగనున్న సకల జన భేరికి వేల సంఖ్యలో తెలంగాణవాదులు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా పోస్టర్లను ఆవిష్కరించారు. సీమాంధ్ర సీఎంలా వ్యవహరి స్తున్న కిరణ్‌కుమారెడ్డికి తెలంగాణ ప్రజల మనోభావాలు ఏమాత్రం పట్టడం లేదన్నా రు. ప్రత్యేక రాష్ట్రం కోసం వెయ్యి మంది విద్యార్థుల ప్రాణత్యాగాలు గుర్తుకురావ డం లేదని విమర్శించారు. ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ సాధించుకుంటామన్నారు. తెలంగాణపై ప్రజాభిప్రాయ సేకరణ అంటూ సీమాంధ్రులు జిమ్మిక్కులు చేయాలని చూస్తున్నారని, ఎన్నికలే ప్రజాభిప్రాయానికి నిదర్శనమన్నారు. తెలంగాణ కోసం రాజీనామాలు చేసినవారి స్థానాల్లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ వ్యతిరేకులకు డిపాజిట్లు కూడా దక్కలేదనే విషయం గుర్తుంచుకోవాలని శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు.తెలంగాణ ఉద్యమం కడుపు మండిన ఉద్యమమని, అణిచివేతలు, నిర్భందాల నుంచి పుట్టిందని అన్నారు. విలేకరుల సమావేశంలో జిల్లా జేఏసీ చైర్మన్ గోపాల్‌శర్మ, కన్వీనర్ గైని గంగారాం, టీజీ ఓ అధ్యక్షుడు బాబూరాం, వివిధ తెలంగాణ ఉద్యోగుల సంఘాల నాయకులు మధుసూదన్, శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు.
సీమాంధ్ర ప్రజలూ సానుకూలమే
Published Fri, Sep 27 2013 4:15 AM | Last Updated on Fri, Sep 1 2017 11:04 PM
Advertisement