r and b guest house
-
కొత్తగా 41 ఇన్స్పెక్షన్ హౌస్‌లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 41 చోట్ల ఇన్స్పెక్షన్ హౌస్‌లు నిర్మించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. నిర్మాణ బాధ్యతను ఆర్ అండ్ బీ అధికారులు చేపట్టారు. వీటికి ఇప్పటికే ప్రతిపాదనలను సిద్ధం చేశారు. వీటిని త్వరలోనే ఆర్థిక శాఖకు పంపి.. ఆమోదం లభించగానే నిర్మాణ పనులు మొదలుకానున్నాయి. రాష్ట్రంలోని పాత జిల్లాల్లోనే ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌లున్నాయి. పలుచోట్ల ఇవి శిథిలావస్థకు చేరగా.. మరికొన్ని కొత్తగా నిర్మించాల్సి ఉంది. కొత్త జిల్లాల నేపథ్యంలో నియోజకవర్గానికి ఒక ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్ నిర్మించాలంటూ ఎమ్మెల్యేల నుంచి విజ్ఞప్తులు పెరిగిపోయాయి. దీంతో ప్రభుత్వం ఇన్స్పెక్షన్ హౌస్‌ల పేరిట కొత్త గెస్ట్ హౌస్‌లను నిర్మించేందుకు నిర్ణయించింది. ఒక్కో భవనానికి రూ.1.50 కోట్ల అంచనాతో రూ.72 కోట్ల వ్యయంతో ఈ భవనాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎక్కడెక్కడ నిర్మాణం? ఆర్ అండ్ బీ అతిథిగృహాలు లేని చోట ఈ హౌస్‌లను నిర్మించనున్నారు. ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూ రు, మంథని, పెద్దపల్లి, ముస్తాబాద్, భూపాలపల్లి, కూసుమంచి, రామాయంపేట, బిచ్కుంద, భీంగల్, బచ్చన్నపేట, పాలకుర్తి, వర్ధన్నపేట, ములుగు, మన్నూరు, జహీరాబాద్, బోథ్, ఇచ్చోడ, నేరెడి గొండ, బాసర, నిర్మల్, మన్యంకొండ, నెక్కొండ, ఉట్నూరు, తుర్కపల్లి, మేడ్చల్, ఘట్కేసర్, డిచ్పల్లి, కొడంగల్, కోహెడ, శంకర్పల్లి, నవాబ్‌పేట, చేవెళ్ల, పరకాల, హుజూరాబాద్, జమ్మికుంట, రామగుండం, భద్రాచలం, నెల్లికుదురు, యాదాద్రిలో నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అత్యాధునిక సదుపాయాలతో అత్యాధునిక సదుపాయాలతో కొత్త ఇన్స్పెక్షన్ హౌస్‌లు నిర్మించనున్నట్లు సమాచారం. దీని కోసం అధునాతన మోడళ్లను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. మారుమూల నియోజకవర్గాల్లో సభ లు, సమావేశాలు, విశ్రాంతికి తగినన్ని భవనాలు లేవు. వీటి నిర్మాణంతో ఆ లోటు తీరిపోనుందని అధికారులు అంటున్నారు. ఆర్థికశాఖ ఆమోదించగానే కొత్త భవనాలకు సంబంధించిన ప్లాన్లు ఖరారు చేసి, టెండర్లు ఆహ్వానించేందుకు ఆర్ అండ్ బీ అధికారులు సమాయత్తమవుతున్నారు. -
జనావాసాల్లోకి దేవాంగపిల్లి
రాపూరు: స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహం వద్ద ఆదివారం దేవాంగపిల్లి తిరుగుతుండగా ప్రజలు దానిని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. దానిని రాపూరు చిట్వేలి మార్గమధ్యంలోని అడవుల్లో వదిలినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. రాపూరులో ఆర్అండ్బీ అతిథిగృహం వద్ద దేవాంగపిల్లి తిరుగుతుండగా స్థానికులు అటవీశాఖాధికారులకు సమాచారం అందించారు. -
పుష్కర తొక్కిసలాటపై నేడు బహిరంగ విచారణ
పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఆధారాల పరిశీలన ఆధారాలు సమర్పించని ప్రభుత్వ శాఖలు నెలాఖరుతో ముగియనున్న కమిషన్ కడువు రాజమహేంద్రవరం: గోదావరి పుష్కరాల సందర్భంగా గతేడాది జూలై 14వ తేదీన జరిగిన తొక్కిసలాటపై విచారణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీవై సోమయాజులు ఏక సభ్య కమిషన్ మంగళవారం మరోసారి బహిరంగ విచారణ చేపట్టనుంది. పుష్కర తొక్కిసలాటలో 29 మృతి చెందగా 52 మంది వరకూ గాయాల పాలైన సంగతి తెలిసిందే. ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసినప్పుడు ఆరు నెలల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ గడువు గత మార్చి 29తో ముగియగా మరో మూడు నెలలు గడువు పెంచుతూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. ఈ పెంచిన గడువు కూడా ఈ నెల 29తో ముగిసిపోతోంది. ఇప్పటి వరకూ ఏ ఒక్క ప్రభుత్వ అధికారిని ఈ విషయంలో విచారించలేదు. ప్రభుత్వం తరఫున కలెక్టర్‌ను విచారించాలని ఆఫిడవిట్ దాఖలు చేసిన న్యాయవాదులు, ప్రజా సంఘాల నాయకులు పట్టుబడుతున్నారు. అయితే ఆధారాలు చూపిస్తే విచారించేందుకు అవకాశం ఉందో? లేదో ? పరిశీలిస్తామని గతంలో జస్టిస్ సోమయజులు స్పష్టం చేశారు. ఆ నేపథ్యంలో మంగళవారం న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తదితరులు సమర్పించిన వీడియో క్లిపింగ్‌లు, ఇతర ఆధారాలను రాజమహేంద్రవరం ఆర్ అండ్ బీ అతిథి గృహంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సోమయాజులు పరిశీలిస్తారు. ఈ ఆధారాలను ఆయన పరిశీలించిన తరువాతైనా ఈ కేసులో రెండు రకాలుగా నివేదికలు ఇచ్చిన కలెక్టర్‌ను విచారిస్తారా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా నిలిచింది. -
పరిశ్రమల అభివృద్ధికి వసతుల కల్పన
రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి నారాయణ నెల్లూరు(రెవెన్యూ) : జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి పూర్తి స్థాయిలో వసతులు కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని రాష్ట్ర పురపాల శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. నూతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్‌పై పారిశ్రామికవేత్తలతో శనివారం నిర్వహించిన వర్క్‌షాపులో మంత్రి మాట్లాడారు. పరిశ్రమలు అభివృద్ధి చెందితే యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. సింగపూర్, జపాన్ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు జిల్లాలో పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వస్తున్నారన్నారు. దగదర్తిలో ఎయిర్‌పోర్టు నిర్మాణం త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఏపీఐఐసీ చైర్మన్ కృష్ణయ్య మాట్లాడుతూ శ్రీహరికోటను అనుసంధానం చేసుకుని పరిశ్రమలు వృద్ధి చేస్తామని తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఏఎండీ. ఇంతియాజ్, కృష్ణపట్నంపోర్టు సీఈవో అనిల్‌కుమార్, నగర మేయర్ అజీజ్, మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ ప్రారంభం నెల్లూరు(రెవెన్యూ) :కృష్ణపట్నం పోర్టు సీఎస్ఆర్ నిధులతో ఆధునికీకరించిన ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌ను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ శనివారం ప్రారంభించారు. రూ.32 లక్షలతో మహాకవి తిక్కన పార్క్ అభివృద్ధికి మంత్రి, శంకుస్థాపన చేశారు. నారాయణ మాట్లాడుతూ కృష్ణపట్నం పోర్టు సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందన్నారు. రూ.58 లక్షల ఖర్చుతో ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్ ఆధునికీకరించారని చెప్పారు. రూ 1.10 కోట్లతో బోర్లు వేసేందుకు రెండు వాహనాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అభివృద్ధి పనులకు కృష్ణపట్నం పోర్టు రూ.2 కోట్ల నిధులు ఖర్చు చేస్తుందని తెలిపారు. నెల్లూరు ఎంపీ మేకపాటీ రాజమోహన్‌రెడ్డి, సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్, కలెక్టర్ ఎం జానకి, జాయింట్ కలెక్టర్ ఏఎండీ. ఇంతియాజ్, పోర్టు సీఈవో అనిల్‌కుమార్,బలరామిరెడ్డి పాల్గొన్నారు. -
మొరాయించిన ఈవీఎంలు.. పోలింగ్‌కు అంతరాయం
కామారెడ్డిటౌన్, న్యూస్‌లైన్ : కామారెడ్డి ఆర్అండ్బీ అతిథి గృహం లోని పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయిం చడంతో అరగంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. హరిజనవాడలోని 194 పోలింగ్ కేంద్రంలో మధ్యాహ్నం 12.10 గంటలకు జహీరాబాద్ పార్లమెంట్‌కు సంబంధించిన ఈవీఎం పనిచేయలేదు. దీంతో ఈవీఎం మార్చారు. అదికూడా పనిచేయకపోవడంతో మరొకటి ఏర్పాటు చేశారు. గంటన్నర పాటు పోలింగ్‌కు అంతరాయం కలిగింది. గొల్లవాడలోనూ ఈవీఎం మొరాయించడంతో అరగంట పాటు పోలింగ్ నిలిచిపోయింది. కామారెడ్డి రూరల్ : దేవునిపల్లిలోని 161 పోలింగ్ బూత్, ఇస్రోజివాడీలోని 148 లో ఈవీఎంలు పనిచేయకపోవడంతో గంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. అడ్లూర్ డ్రైవర్స్ కాలనీలో అరగంట ఆలస్యమైంది. ఇదే గ్రామంలోని 150వ పోలింగ్ బూత్‌లో ఉదయం 10 గంటల సమయంలో ఈవీఎం మొరాయించింది. మాచారెడ్డి : మద్దికుంటలోని పోలింగ్ బూత్‌లో ఈవీఎంలు పనిచేయకపోవడంతో గంటపాటు పోలింగ్ నిలిచిపోయింది. భిక్కనూరు : ఆరెపల్లిలో ఈవీఎం మొరాయించింది. పొందుర్తిలో 50 ఓట్టు పోలైన అనంతరం ఈవీఎం మొరాయించడంతో పోలింగ్ ఆగిపోయింది. రెండు గంటల తర్వాత పోలింగ్ ప్రారంభమైంది. జంగంపల్లి, తిప్పాపూర్, తలమడ్ల, భిక్కనూరు ఎస్సీ కాలనీ పోలింగ్ బూతుల్లోనూ ఈవీఎంలు మొరాయించాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎల్లారెడ్డి టౌన్ : ఎల్లారెడ్డిలోని 203, 204, 208 పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఈవీఎంలు మొరాయించడంతో అధికారులు వాటిని మార్చారు. సదాశివనగర్, మర్కల్, కన్నాపూర్, రామారెడ్డి, గిద్ద, పద్మాజీవాడి పోలింగ్ బూతుల్లో సుమారు అరగంట పాటు ఈవీఎంలు పనిచేయలేదు. గాంధారి, గండివేట, గౌరారం, గుజ్జల్లలో సైతం అరగంటపాటు ఈవీఎంలు మొరాయించాయి. తాడ్వాయి మండలంలోని కొండాపూర్, దేమికలాన్, కన్కల్లలో కూడా అరగంట పాటు ఈవీఎంలు పనిచేయలేదు. లింగంపేట మండలంలోని భవానిపేట, లింగంపేట, నాగిరెడ్డిపేట మండలంలోని నాగిరెడ్డిపేట, తాండూర్లలోనూ ఇదే పరిస్థితి. బాల్కొండ నియోజకవర్గం కమ్మర్పల్లి : మండల కేంద్రంలోని 112వ పోలింగ్ కేంద్రం, ఉప్లూర్‌లోని 109వ బూత్‌లో ఎమ్మెల్యే స్థానానికి సంబంధించిన ఈవీఎంలు, కోనసముందర్లోని 127 వ బూత్‌లో ఎంపీ అభ్యర్థికి సంబంధించిన ఈవీఎం మొరాయించడంతో గంటపాటు పోలింగ్ నిలిచిపోయింది. భీమ్‌గల్ : మోర్తాడ్ మండలం వడ్యాట్లోని పోలింగ్ బూత్ నెంబర్ 97లో, కమ్మర్పల్లి మండలం బషీరాబాద్‌లోని పోలింగ్ బూత్ నెంబర్ 126లో, భీమ్‌గల్ పట్టణంలోని హైస్కూల్లో గల పోలింగ్ బూత్ నెంబర్ 170లో, ఎంపీపీ చాంబర్‌లోని పోలింగ్ బూత్ నెంబర్ 148లో, ఎంఈఓ కార్యాలయంలోని 154 పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలు మొరాయించాయి. వెంటనే వాటి స్థానంలో వేరే ఈవీఎంలను అమర్చారు. జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ : సింగితంలోని 209 పోలింగ్ కేంద్రంలో అసెంబ్లీ ఈవీఎం మధ్యాహ్నం 1.15 గంటల నుంచి 3.15 గంటల వరకు ఈవీఎంలు పనిచేయలేదు. బిచ్కుంద మండలంలోని పుల్కల్, వాజిద్నగర్, రాజాపూర్ గ్రామాల్లోని ఈవీఎంలూ కొద్ది సేపు పనిచేయలేదు. బిచ్కుంద, మద్నూర్-22, మారేపల్లి పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ సమయానికి ఈవీఎంలు మొరాయించాయి. దీంతో 45 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. బోధన్ నియోజకవర్గం ఎడపల్లి : ఏఆర్పీ గ్రామంలోని 209వ పోలింగ్ బూత్‌లో ఈవీఎం మొరాయించడంతో గంటన్నర పాటు పోలింగ్‌కు అంతరాయం కలిగింది. రెంజల్ : రెంజల్‌లోని 135వ బూత్‌లో ఈవీఎం పనిచేయకపోవడంతో అరగంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఈ బూత్‌లో మధ్యాహ్నం ఓటింగ్ మిషన్ మొరాయించడంతో వేరే ఈవీఎం అమర్చారు. కందకుర్తిలోని 120వ బూత్లోనూ గంటపాటు పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. వీరన్నగుట్టలోని 140వ బూత్లోనూ ఇదే పరిస్థితి. బాన్సువాడ నియోజకవర్గం బీర్కూర్ : నెమ్లిలో ఈవీఎం మొరాయించడంతో 45 నిమిషాలు పోలింగ్ నిలిచిపోయింది. బీర్కూర్‌లోని 123వ బూత్‌తో పాటు బరంగేడ్గి, బైరాపూర్ గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. నస్రుల్లాబాద్‌లో ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈవీఎం మొరాయించడంతో సుమారు అర గంట పాటు పోలింగ్‌కు అంతరాయం కలిగింది. రూరల్ నియోజకవర్గం డిచ్పల్లి : డిచ్పల్లి మండలం ఇందల్వాయి, ధర్మారం(బి), రాంపూర్, మల్లాపూర్, జక్రాన్‌పల్లి మండలం కేశ్‌పల్లి, మునిపల్లి, బ్రాహ్మణపల్లి, చింతలూరు, ధర్పల్లి మండలంలోని అంసాన్పల్లి, నల్లవెల్లి, ధర్పల్లి గ్రామాల్లో ఈవీఎంలు కొద్దిసేపు మొరాయించాయి. -
సీమాంధ్ర ప్రజలూ సానుకూలమే
సాక్షి, నిజామాబాద్: సీమాంధ్రలో కూడా 90 శాతం ప్రజలు తెలంగాణ ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నారని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ అన్నారు. విషప్రచారంతో అక్కడి ప్రజ లను మభ్యపెడుతున్నారని విమర్శిం చారు. గురువారం ఆయన నిజామాబాద్ ఆర్అండ్బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. 29న హైదరాబాద్ నిజాం కాలేజీ మైదానంలో జరగనున్న సకల జన భేరికి వేల సంఖ్యలో తెలంగాణవాదులు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పోస్టర్లను ఆవిష్కరించారు. సీమాంధ్ర సీఎంలా వ్యవహరి స్తున్న కిరణ్‌కుమారెడ్డికి తెలంగాణ ప్రజల మనోభావాలు ఏమాత్రం పట్టడం లేదన్నా రు. ప్రత్యేక రాష్ట్రం కోసం వెయ్యి మంది విద్యార్థుల ప్రాణత్యాగాలు గుర్తుకురావ డం లేదని విమర్శించారు. ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ సాధించుకుంటామన్నారు. తెలంగాణపై ప్రజాభిప్రాయ సేకరణ అంటూ సీమాంధ్రులు జిమ్మిక్కులు చేయాలని చూస్తున్నారని, ఎన్నికలే ప్రజాభిప్రాయానికి నిదర్శనమన్నారు. తెలంగాణ కోసం రాజీనామాలు చేసినవారి స్థానాల్లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ వ్యతిరేకులకు డిపాజిట్లు కూడా దక్కలేదనే విషయం గుర్తుంచుకోవాలని శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు.తెలంగాణ ఉద్యమం కడుపు మండిన ఉద్యమమని, అణిచివేతలు, నిర్భందాల నుంచి పుట్టిందని అన్నారు. విలేకరుల సమావేశంలో జిల్లా జేఏసీ చైర్మన్ గోపాల్‌శర్మ, కన్వీనర్ గైని గంగారాం, టీజీ ఓ అధ్యక్షుడు బాబూరాం, వివిధ తెలంగాణ ఉద్యోగుల సంఘాల నాయకులు మధుసూదన్, శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు.