కామారెడ్డిటౌన్, న్యూస్‌లైన్ : కామారెడ్డి ఆర్‌అండ్‌బీ అతిథి గృహం లోని పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయిం చడంతో అరగంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. హరిజనవాడలోని 194 పోలింగ్ కేంద్రంలో మధ్యాహ్నం 12.10 గంటలకు జహీరాబాద్ పార్లమెంట్‌కు సంబంధించిన ఈవీఎం పనిచేయలేదు. దీంతో ఈవీఎం మార్చారు. అదికూడా పనిచేయకపోవడంతో మరొకటి ఏర్పాటు చేశారు. గంటన్నర పాటు పోలింగ్‌కు అంతరాయం కలిగింది. గొల్లవాడలోనూ ఈవీఎం మొరాయించడంతో అరగంట పాటు పోలింగ్ నిలిచిపోయింది.
కామారెడ్డి రూరల్ : దేవునిపల్లిలోని 161 పోలింగ్ బూత్, ఇస్రోజివాడీలోని 148 లో ఈవీఎంలు పనిచేయకపోవడంతో గంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. అడ్లూర్ డ్రైవర్స్ కాలనీలో అరగంట ఆలస్యమైంది. ఇదే గ్రామంలోని 150వ పోలింగ్ బూత్‌లో ఉదయం 10 గంటల సమయంలో ఈవీఎం మొరాయించింది.
మాచారెడ్డి : మద్దికుంటలోని పోలింగ్ బూత్‌లో ఈవీఎంలు పనిచేయకపోవడంతో గంటపాటు పోలింగ్ నిలిచిపోయింది.
భిక్కనూరు : ఆరెపల్లిలో ఈవీఎం మొరాయించింది. పొందుర్తిలో 50 ఓట్టు పోలైన అనంతరం ఈవీఎం మొరాయించడంతో పోలింగ్ ఆగిపోయింది. రెండు గంటల తర్వాత పోలింగ్ ప్రారంభమైంది. జంగంపల్లి, తిప్పాపూర్, తలమడ్ల, భిక్కనూరు ఎస్సీ కాలనీ పోలింగ్ బూతుల్లోనూ ఈవీఎంలు మొరాయించాయి.
ఎల్లారెడ్డి నియోజకవర్గం
ఎల్లారెడ్డి టౌన్ : ఎల్లారెడ్డిలోని 203, 204, 208 పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఈవీఎంలు మొరాయించడంతో అధికారులు వాటిని మార్చారు.
సదాశివనగర్, మర్కల్, కన్నాపూర్, రామారెడ్డి, గిద్ద, పద్మాజీవాడి పోలింగ్ బూతుల్లో సుమారు అరగంట పాటు ఈవీఎంలు పనిచేయలేదు.
గాంధారి, గండివేట, గౌరారం, గుజ్జల్‌లలో సైతం అరగంటపాటు ఈవీఎంలు మొరాయించాయి.
తాడ్వాయి మండలంలోని కొండాపూర్, దేమికలాన్, కన్కల్‌లలో కూడా అరగంట పాటు ఈవీఎంలు పనిచేయలేదు.
లింగంపేట మండలంలోని భవానిపేట, లింగంపేట, నాగిరెడ్డిపేట మండలంలోని నాగిరెడ్డిపేట, తాండూర్‌లలోనూ ఇదే పరిస్థితి.
బాల్కొండ నియోజకవర్గం
కమ్మర్‌పల్లి : మండల కేంద్రంలోని 112వ పోలింగ్ కేంద్రం, ఉప్లూర్‌లోని 109వ బూత్‌లో ఎమ్మెల్యే స్థానానికి సంబంధించిన ఈవీఎంలు, కోనసముందర్‌లోని 127 వ బూత్‌లో ఎంపీ అభ్యర్థికి సంబంధించిన ఈవీఎం మొరాయించడంతో గంటపాటు పోలింగ్ నిలిచిపోయింది.
భీమ్‌గల్ : మోర్తాడ్ మండలం వడ్యాట్‌లోని పోలింగ్ బూత్ నెంబర్ 97లో, కమ్మర్‌పల్లి మండలం బషీరాబాద్‌లోని పోలింగ్ బూత్ నెంబర్ 126లో, భీమ్‌గల్ పట్టణంలోని హైస్కూల్‌లో గల పోలింగ్ బూత్ నెంబర్ 170లో, ఎంపీపీ చాంబర్‌లోని పోలింగ్ బూత్ నెంబర్ 148లో, ఎంఈఓ కార్యాలయంలోని 154 పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలు మొరాయించాయి. వెంటనే వాటి స్థానంలో వేరే ఈవీఎంలను అమర్చారు.
జుక్కల్ నియోజకవర్గం
నిజాంసాగర్ : సింగితంలోని 209 పోలింగ్ కేంద్రంలో అసెంబ్లీ ఈవీఎం మధ్యాహ్నం 1.15 గంటల నుంచి 3.15 గంటల వరకు ఈవీఎంలు పనిచేయలేదు. బిచ్కుంద మండలంలోని పుల్కల్, వాజిద్‌నగర్, రాజాపూర్ గ్రామాల్లోని ఈవీఎంలూ కొద్ది సేపు పనిచేయలేదు. బిచ్కుంద, మద్నూర్-22, మారేపల్లి పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ సమయానికి ఈవీఎంలు మొరాయించాయి. దీంతో 45 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది.
బోధన్ నియోజకవర్గం
ఎడపల్లి : ఏఆర్పీ గ్రామంలోని 209వ పోలింగ్ బూత్‌లో ఈవీఎం మొరాయించడంతో గంటన్నర పాటు పోలింగ్‌కు అంతరాయం కలిగింది.
రెంజల్ : రెంజల్‌లోని 135వ బూత్‌లో ఈవీఎం పనిచేయకపోవడంతో అరగంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఈ బూత్‌లో మధ్యాహ్నం ఓటింగ్ మిషన్ మొరాయించడంతో వేరే ఈవీఎం అమర్చారు. కందకుర్తిలోని 120వ బూత్‌లోనూ గంటపాటు పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. వీరన్నగుట్టలోని 140వ బూత్‌లోనూ ఇదే పరిస్థితి.
బాన్సువాడ నియోజకవర్గం
బీర్కూర్ : నెమ్లిలో ఈవీఎం మొరాయించడంతో 45 నిమిషాలు పోలింగ్ నిలిచిపోయింది. బీర్కూర్‌లోని 123వ బూత్‌తో పాటు బరంగేడ్గి, బైరాపూర్ గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. నస్రుల్లాబాద్‌లో ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈవీఎం మొరాయించడంతో సుమారు అర గంట పాటు పోలింగ్‌కు అంతరాయం కలిగింది.
రూరల్ నియోజకవర్గం
డిచ్‌పల్లి : డిచ్‌పల్లి మండలం ఇందల్వాయి, ధర్మారం(బి), రాంపూర్, మల్లాపూర్, జక్రాన్‌పల్లి మండలం కేశ్‌పల్లి, మునిపల్లి, బ్రాహ్మణపల్లి, చింతలూరు, ధర్పల్లి మండలంలోని అంసాన్‌పల్లి, నల్లవెల్లి, ధర్పల్లి గ్రామాల్లో ఈవీఎంలు కొద్దిసేపు మొరాయించాయి.
మొరాయించిన ఈవీఎంలు.. పోలింగ్‌కు అంతరాయం
Published Thu, May 1 2014 3:14 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement