సచివాలయంలో పోటాపోటీ నిరసన ర్యాలీలు | Seemandhra, Telangana Employees Rallies in Andhra Pradesh Secretariat | Sakshi
Sakshi News home page

సచివాలయంలో పోటాపోటీ నిరసన ర్యాలీలు

Published Wed, Aug 28 2013 2:14 PM | Last Updated on Fri, Sep 1 2017 10:12 PM

Seemandhra, Telangana Employees Rallies in Andhra Pradesh Secretariat

సచివాలయంలో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల పోటాపోటీగా నిరసన ర్యాలీలు చేశారు. ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనుమతి లేకున్నా సీమాంధ్ర ఉద్యోగులు ర్యాలీ చేపట్టారు. తమను అడ్డుకున్న పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో సీమాంధ్ర ఉద్యోగులు జే బ్లాక్‌ వద్ద బైటాయించారు.

రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన నాటి నుంచి సచివాలయంతో పాటు హైదరాబాద్లోని  ప్రధాన ప్రభుత్వ కార్యాలయాల్లో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు ప్రతిరోజు నిరసనలు, ఆందోళనలకు దిగుతున్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ఉద్యోగులు, తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ ఉద్యోగులు ప్రదర్శనలు చేపడుతున్నారు. దీంతో సచివాలయంలో నిరసన ప్రదర్శనలపై ప్రభుత్వం నిషేధం విధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement