సీమాంధ్రలో ఉద్యమం ప్రజలే నిర్వహిస్తున్నారని రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్ తెలిపారు.
సీమాంధ్రలో ఉద్యమం ప్రజలే నిర్వహిస్తున్నారని రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్ తెలిపారు. ప్రజల నాయకత్వంలో తాము పనిచేస్తున్నామని ఆయన చెప్పారు. తమ ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తాము ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. తమ ఒత్తిడి వల్లే విభజన అంశంపై చర్చించేందుకు ఏకే ఆంటోని ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటైందని తెలిపారు.
సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణ విడిచి వెళ్లాలంటూ కేసీఆర్ చేసిన వివాదస్పద వాఖ్యలపై శైలజానాథ్ అంతకుముందు మండిపడ్డారు. కేసీఆర్ బెదిరించే దోరణిలో మాట్లాడుతున్నారని చెప్పారు. ఎవరి దయాదాక్షిణ్యాలతో తమ ఉద్యోగులు హైదరాబాద్లో బతకాల్సిన పని లేదని అన్నారు. హైదరాబాద్ కేసీఆర్ జాగీరేమీ కాదని చెప్పారు. రాజ్యంగం ప్రకారం ఎక్కడైనా ఉండే హక్కు తమకుందని తెలిపారు.