Minister Sailjanath
-
ప్రజలను మభ్య పెట్టలేం: శైలజానాథ్
ప్రజలే నాయకులుగా సమైక్యాంధ్ర ఉద్యమం కొనసాగుతోందని మంత్రి శైలజానాథ్ తెలిపారు. ఇకనైనా రాష్ట్ర విభజన నిర్ణయం వెనక్కు తీసుకోవాలని కోరారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చూసైనా చంద్రబాబు పునరాలోచించుకోవాలి విజ్ఞప్తి చేశారు. ఓట్ల రాజకీయాలను పక్కనపెట్టి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అన్ని పార్టీలు కృషి చేయాలన్నారు. గాదె వెంకటరెడ్డితో కలిసి సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని శైలజానాథ్ తెలిపారు. ప్రజలను మభ్య పెట్టే పరిస్థితులు ఇప్పుడు లేవన్నారు. మహోగ్రంగా సాగుతున్న సమైక్య ఉద్యమానికి మద్దతు పలకడమే తప్పా మభ్యపెట్టలేమన్నారు. ప్రజల ఆకాంక్షను గుర్తించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరారు. సమైక్యాంధ్ర కోసం తాము మాత్రమే చిత్తశుధ్దితో ప్రయత్నిస్తున్నామని మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి తెలిపారు. రాష్ట్ర విభజన కాంగ్రెస్ నిర్ణయమని, యూపీఏ ప్రభుత్వ నిర్ణయం కాదని స్పష్టం చేశారు. విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని తమ పార్టీపై ఒత్తిడి తెస్తూనేవుంటామన్నారు. -
మంత్రి శైలజానాథ్‌కు చేదు అనుభవం.
-
మంత్రి శైలజానాథ్‌కు చేదు అనుభవం
-
మంత్రి శైలజానాథ్‌కు చేదు అనుభవం
సమైక్యాంధ్ర ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఎస్.శైలజానాథ్‌కు చేదు అనుభవం ఎదురయింది. అనంతపురంలో సమైక్య ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన శైలజానాథ్‌కు వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. శైలజానాథ్ గోబ్యాక్ అంటూ సమైక్యవాదులు ఆందోళనకు దిగారు. ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా కొనసాగించడం మినహా మరే ప్రతిపాదనను అంగీకరించేది లేదని ఆయన ముందునుంచి చెబుతూ వస్తున్నారు. మరోవైపు సమైక్య ఉద్యమాలు అనంతపురం జిల్లాలో 28వ కోజుకు చేరాయి. అనంతపురంలో ఉద్యోగ సంఘాల 48 గంటల బంద్ కొనసాగుతోంది. మంత్రి శైలజానాథ్ కార్యక్రమాలను బహిష్కరించాలని ఉద్యోగసంఘాల జేఏసీ కన్వీనర్ హేమసాగర్ పిలుపునిచ్చారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఎస్కేయూలో సీమాంధ్ర విశ్వవిద్యాలయాల జేఏసీ నేతలు సమావేశమయ్యారు. -
అన్ని అవకాశాలను వాడుకుంటాం: శైలజానాథ్
రాష్ట్రం ఐక్యంగా ఉండాలను కోరుకుంటున్నామని రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్ పునరుద్ఘాటించారు. ప్రజల ప్రతినిధులుగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు. ఆదివారం సీఎల్పీ కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగువారిని ఐక్యంగా ఉంచడానికి అన్ని అవకాశాలను వాడుకుంటామని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో తమ ప్రాంత ఎంపీలతో అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. సీమాంధ్ర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రేపు ఢిల్లీ వెళ్తున్నట్టు చెప్పారు. ఎల్లుండి జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర విభజనపై సంప్రదింపులు ముగిశాయన్న హైకమాండ్ ఇప్పుడు ఆంటోని కమిటీ వేసిందన్నారు. అలాగే రాష్ట్ర విభజనపై పార్టీ నిర్ణయం తీసుకున్నా కేంద్రం నిర్ణయం తీసుకోదని భావిస్తున్నట్టు చెప్పారు. సీమాంధ్రలో ప్రజాభిష్టాన్ని పార్టీలు పసిగట్టలేకపోయాయని అన్నారు. చంద్రబాబు బతకడానికి రాజకీయాలే మార్గమనుకుంటున్నారని అందుకే సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని శైలజానాథ్ దుయ్యబట్టారు. రాష్ట్ర విభజనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింత స్పష్టత ఇవ్వాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. మంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఉండడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. సీఎం కిరణ్ కూడా క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్త అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయం నుంచే అధికార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
ప్రజలదే సీమాంధ్రలో ఉద్యమం: శైలజానాథ్
సీమాంధ్రలో ఉద్యమం ప్రజలే నిర్వహిస్తున్నారని రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్ తెలిపారు. ప్రజల నాయకత్వంలో తాము పనిచేస్తున్నామని ఆయన చెప్పారు. తమ ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తాము ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. తమ ఒత్తిడి వల్లే విభజన అంశంపై చర్చించేందుకు ఏకే ఆంటోని ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటైందని తెలిపారు. సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణ విడిచి వెళ్లాలంటూ కేసీఆర్ చేసిన వివాదస్పద వాఖ్యలపై శైలజానాథ్ అంతకుముందు మండిపడ్డారు. కేసీఆర్ బెదిరించే దోరణిలో మాట్లాడుతున్నారని చెప్పారు. ఎవరి దయాదాక్షిణ్యాలతో తమ ఉద్యోగులు హైదరాబాద్‌లో బతకాల్సిన పని లేదని అన్నారు. హైదరాబాద్ కేసీఆర్ జాగీరేమీ కాదని చెప్పారు. రాజ్యంగం ప్రకారం ఎక్కడైనా ఉండే హక్కు తమకుందని తెలిపారు.