గ్రామీణ జీవనంలో కీలక భూమిక పోషిస్తున్న పశుసంతతికి చిక్కులు వచ్చిపడుతున్నాయి. వాటికి ఆరోగ్య రక్షణకని ఎంపికచేసిన ‘పశుమిత్ర’లు ఇంకా శిక్షణ పూర్తిచేసుకోక పోవడంతో పలుచోట్ల వైద్యసేవలు అందడం లేదు. ఇతర జిల్లాల్లో పూర్తయిన ఈ ప్రక్రియ ఇక్కడ యంత్రాంగం చొరవచూపని కారణంగా లక్ష్యం దిశగా అడుగులు వేయడం లేదు. శిక్షణ ఇచ్చినా వారికి చెల్లింపుల విషయంలో రైతులనుంచే వసూళ్లు చేసుకోవాలన్న నిబంధనలు ఆర్థికంగా అన్నదాతలకు భారంగా మారనుంది. ఇప్పటికే మొక్కుబడి తంతుగా మారిన పశువైద్యం ఇప్పుడు మరింత అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
మహబూబ్‌నగర్(వ్యవసాయం)న్యూస్‌లైన్: గ్రా మీణ ప్రాంతాల్లో పశువులకు, పెంపకం దారుల వద్ద ఉండే జీవాలకు సేవలందించేందుకు ఉద్దేశిం చిన ‘ ‘పశుమిత్ర’ పథకం జిల్లాలో గందరగోళ స్థితిలో పడింది. ఇందుకు కావల్సిన అభ్యర్థుల ఎంపిక పూర్తయినా వారికి శిక్షణ ఇవ్వక పోవడం తో పశుసంతతికి సేవలందడం లేదు. ముఖ్యంగా పశువైద్యశాలలు అందుబాటులో లేని గ్రామాల్లో వీరి సేవలు వినియోగించు కోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి నెలలు గడుస్తున్నా శిక్షణపై జిల్లా అధికారులు ఇప్పటికి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఎంపికైన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అడ్డుకున్న భారీ వర్షాలు...
రెండు నెలల కింద జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ శిక్షణ కార్యక్రమానికి కొంత ఆటంకం కలిగింది. ఆ పరిస్థితులనుంచి తేరుకొన్నప్పటికీ ఇంకా అధికారులు శిక్షణ ఏర్పాట్లపై దష్టి పెట్టకపోవడంై విమర్శలకు తావిస్తోంది. మరోవైపు పశుమిత్రలకు ఎలాంటి ఆర్థికబతి కల్పించకుండా నేరుగా రైతుల నుండే సేవలు అందించినందుకు కొంత మొత్తం తీసుకోవాలని ప్రభుత్వం చెప్పడాన్ని కూడా రైతులు వ్యతిరేకిస్తున్నారు. జిల్లాలో 342 పశువైద్యశాలలుండగా సిబ్బందిలేని చోట్ల,తక్కువ సిబ్బంది ఉన్న 51 పశువైద్యాశాలలకు గుర్తించి అభ్యర్థులను తీసుకున్నారు.ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ శిక్షణ కార్యక్రమం 4నెలలపాటు కొనసాగనుంది.మొదటి మూడు నెలలు వారికి పశువైద్యం అందించే విధానం,రోగ లక్షణాలు గుర్తించడం,పశువులకు చికిత్స,వ్యాధినిరోధక టీకాలు ఇవ్వడం వంటి వాటిపై అవగాహణ కల్పిస్తారు.ఇది పూర్తై తరువాత నెలపాటు పశువైద్యశాలలో నేరుగా చికిత్సలను చేయడం ప్రాక్టికల్‌గా నేర్పిస్తారు.ఇలా నాలుగు నెలలు శిక్షణ కాలం పూర్తై తరువాత అభ్యర్థులకు సర్టిఫికేట్లను ఇస్తారు.అనంతరం ఆయా పశువైద్యాశాలలో వారు వైద్యాసేవలు అందించాల్సి ఉంటుంది.
స్థానిక అభ్యర్థులకు మొండిచెయ్యి...
జిల్లాలో గుర్తించిన 51 పశువైద్యాశాలలో పశుమిత్ర కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సమాచారం అందించడంలో విఫలమైయ్యారు.దీంతో స్థానికులు ఇందుకు ముందుకు రాలేక పోయారు. అధికారులు తమ అనుకూల అభ్యర్థులకు అవకాశం కల్పించడం కోసం ప్రణాళిక ప్రకారమే ఇలా ఎంపిక సమాచారం గోప్యంగా ఉంచారన్న వాదనలూ ఉన్నాయి . ఇతర మండలాల అభ్యర్థులను నియమిస్తే వారు స్థానికంగా అందుబాటులో లేకపోతే ప్రభుత్వ లక్ష్యం నీరుగారి పోయే అవకాశం ఉంది.ఉదాహరణకు భూత్పూర్ మండల కేంద్రంలోని పశువైద్యాశాలలో నియామకానికి అక్కడి అభ్యర్థి ముందుకు రాకపోవడంతో హన్వడ మండల అభ్యర్థికి అవకాశం ఇచ్చినట్లు అక్కడి డాక్టర్ తెలిపారు.ఇలా చాలా చోట్ల ఇతర ప్రాంతాల వారిని తీసుకున్నట్లు సమాచారం.వీరికి ఎలాంటి ఆర్థికభతి ఇవ్వమని చెప్పడంతో దీన్నే ప్రధాన ఆధారంగా చేసుకొని బతికేవారూ తక్కువ ఉంటారని ఇది సరైన పద్ధతి కాదని కొందర వాదన.ఇలా ఉద్యోగ భద్రత,ఆర్థిక వెసులుబాటు కల్పించకుండా ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా ఫలితం ఉండే అవకాశాలు కనిపించవని ప్రజాసంఘాల నాయకులు విమర్శిస్తున్నారు.
సేవలకు సొమ్ము బెడద?
శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసిన పశుమిత్రలు గుర్తించిన పశువైద్యశాలలో నియమితులైనా వారికి సంబంధిత కేంద్రం ద్వారా ఎలాంటి జీత భత్యాలు రావు. దీంతో రోజువారిగా వైద్యాసేవల కోసం స్థానిక వైద్యాశాలలకు వచ్చే రైతులు,పెంపకందారుల నుండి వారు వసూళ్లు చేసుకోవాల్సిందే. దీంతో పశుసేవలు ఎలా ఉన్న రైతుల జేబులకు మాత్రం చిల్లులు పడనున్నాయి.దీంతో ప్రజాసంఘాలు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.ఇప్పటికే పెట్టుబడులు పెరిగి ఆశించిన పంటలు చేతికి రాక తికమక పడుతున్న తమను ఇంకా ఇబ్బందులకు గురి చేసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మండిపడుతున్నారు.ప్రభుత్వం నేరుగా సిబ్బందిని నియామించాలని రైతులు కోరుతున్నారు.
పశుమిత్రలు రైతుల నుండే డబ్బులు తీసుకుంటారు : పశుసంవర్ధక జేడి వెంకటరమణ
పశుమిత్రలు వారందించే సేవలను బట్టి పశువైద్యాశాలకు వచ్చే రైతుల నుండి ఒకోక్కరి దగ్గర రూ.50 ఆపైనా తీసుకుంటారు.జిల్లాలో సిబ్బంది కొరతను దష్టిలో పెట్టుకొని నియమించడం జరుగుతుంది.శిక్షణ కాలంలో 4నెలలకు కలిపి ఒక్కోక్క పశుమిత్ర అభ్యర్థికి రూ.8వేలు ఖర్చు చేస్తాం.అనంతరం ఉద్యోగ నిర్వహణలో వారికి ఎలాంటి చెల్లింపులు ఉండవు.
ఎంపిక ఓకే...శిక్షణ లేకే..!
Published Tue, Dec 24 2013 3:11 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
Advertisement