డాడీ.. ఓ సెల్ఫీ ప్లీజ్!
నగరంలో గురువారం నిర్వహించిన ప్రత్యేక హోదా పాదయాత్రతో అలసిపోయిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. ఆయన కుమార్తె సాయిలీల వచ్చి సెల్ఫీ డాడీ అనడంతో రిలాక్స్ అయ్యారు.
ఫొటోకు పోజిచ్చారు. సాయిలీల ప్రస్తుతం హైదరాబాద్‌లో జర్నలిజం డిగ్రీ చేస్తోంది. దసరా సెలవులకు వచ్చిన ఆమె ఎర్రదండు ఉద్యమాల్లో నేను సైతం అంటూ పాల్గొంటోంది. - సాక్షి, విజయవాడ