ఏపీ, టీ రాష్ట్ర ప్రభుత్వాలకు కమిషనర్ లేఖ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రెండు వేర్వేరు విజిలెన్స్ కమిషన్లను ఏర్పాటు చేయాలని పేర్కొంటూ ఏపీ విజిలెన్స్ కమిషనర్ ఎస్వీ ప్రసాద్ ఆయూ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశారు. ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రంలోని కమిషనే యథాతథంగా కొనసాగుతోంది. దీంతో కమిషనరే రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇటీవల వేర్వేరుగా లేఖలను పంపారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ రాష్ట్రానికి ప్రత్యేక విజిలెన్స్ కమిషన్ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం స్పందన కనిపించలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కొత్తగా విజిలెన్స్ కమిషన్‌ను ఏర్పాటు చేసుకుంటే ప్రస్తుతం ఉన్న ఉమ్మడి రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ అవశేషాంధ్ర ప్రదేశ్ కమిషన్‌గా కొనసాగే అవకాశం ఉంది.
ఏపీ కొత్తగా విజిలెన్స్ కమిషన్ కోసం చర్యలు తీసుకోవలసిన అవసరం ఉండదు.ఉమ్మడి రాష్ట్ర కమిషన్లో ఉన్న ఉద్యోగుల్లో ఎక్కువమంది తెలంగాణ వారే . తెలంగాణ ప్రభుత్వం కొత్త కమిషన్‌ను ఏర్పాటుచేసి తమ ఉద్యోగులను యథాతథంగా తీసుకుంటుందా? కొత్త వారిని నియమించుకుంటుందా? అన్నది తేలాల్సి ఉంది.
విజిలెన్స్ కమిషన్‌ను విభజించండి
Published Tue, Sep 23 2014 12:18 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 PM
Advertisement
Advertisement