టీడీపీలో షాడో నేతలు
సాలూరు:టీడీపీలో షాడో నేతలు ఎక్కువైపోయూర ని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర అన్నా రు. అమాయకులైన గిరి జనులను అడ్డం పెట్టుకుని కొందరు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించా రు. గురువారం ఆయన ఇక్కడి విలేకరులతో మా ట్లాడారు. గిరిజనులపై ప్రేమ ఉంటే అసలైన గిరి జనులను కాకుండా దొంగ సర్టిఫికేట్ ఉన్న వారిని ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయించారని మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్‌ను ఉద్దేశించి పరోక్షంగా విమర్శిం చారు. అలాగే ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవుల్లో నిరక్షరాస్యు లైన గిరిజనులను ఎందుకు ఎన్నుకున్నారో అందరికీ తెలిసిందేనన్నారు.
చదువుకున్న గిరిజనులను పోటీ చేయించకుండా, అమాయ కులైన, నిరక్షరాస్యులైన గిరిజనులను అడ్డం పెట్టుకుని రాజ్యాంగేతర శక్తులుగా పదవులు వెలగబెట్టాలన్న ఆలోచన కాదా ?అని ప్రశ్నించారు. రాజ్యాంగేతర శక్తిగా గత ప్రభుత్వంలో చిన్నశ్రీను వ్యవహరించారని, ఇప్పటి ప్రభుత్వంలో మాజీ ఎమ్మె ల్యే భంజ్‌దేవ్ అలా వ్యవహరిస్తున్నారని ఆరోపిం చారు. ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవులు టీడీపీ వారివే అయినా, మెజార్టీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ లు తమ పార్టీవారేనని గుర్తుంచుకోవాలన్నారు. అలాగే సాలూరు ఎంపీడీఓ శ్రీరంగ టీడీపీ ఏజెంట్‌గా వ్యవహరించారని, అందువల్లే ఆమెపై కలెక్టర్, ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు.