
సాక్షి, అమరావతి : నూతనంగా సమావేశం కానున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రొటెం స్పీకర్‌గా విజయనగరం జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు నియమితులవుతారని విశ్వసనీయ సమాచారం. శంబంగి బొబ్బిలి శాసనసభా నియోజకవర్గం నుంచి ఇప్పటికి 4సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ఈ ఎన్నికల్లో ఆయన మాజీ మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావును ఓడించారు. ప్రొటెం స్పీకర్‌గా నియమితులైతే శంబంగి శాసనసభ సమావేశాల తొలి రోజున కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తరువాత శాసనసభ స్పీకర్ ఎన్నికను కూడా నిర్వహించాల్సి ఉంటుంది. కొత్తగా ఎన్నికైన స్పీకర్‌కు పదవీ బాధ్యతలు అప్పగించిన తరువాత ఆయన పదవీకాలం ముగుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment