పెందుర్తి: పవిత్ర గంగానదీ తీరం సమీపంలోని కాశీ (వారణాసి)లో నూతనంగా నిర్మించిన శారదాపీఠం శాఖను విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామీ చేతుల మీదుగా ఆదివారం ప్రారంభించారు. ముందుగా గంగానదీ స్నానమాచ రించి కాశీ విశ్వేశ్వరుడు, విశాలాక్షి, అన్న పూర్ణాదేవి దేవాలయాలను సందర్శించి దేవతామూర్తులను దర్శించుకున్నారు. అనంతరం శారదాపీఠం శాఖలోకి పీఠం మర్యాదలతో స్వామీజీని ప్రతినిధులు, వేదపండితులు ఆహ్వానించారు. శాస్త్రోక్తం గా పీఠం భవనాన్ని ప్రారంభించారు.
స్వామీజీ అనుగ్రహభాషణ చేస్తూ కాశీ క్షేత్రంలో నివసించే దండి స్వాములకు వారానికికోసారి యతిభిక్ష (అన్నదానం) ఏర్పాటు చేయాలని పీఠం ప్రతినిధులకు సూచించారు. దత్త జయంతి సందర్భంగా పీఠంలో అన్నదాన కార్య క్రమాన్ని స్వామీజీ చేతుల మీదుగా ప్రారంభించారు. దండిస్వాములకు భిక్ష పెట్టి దక్షిణలు అందజేశారు. కార్యక్రమం లో ఉత్తర పీఠాధిపతి బాలస్వామి, ధర్మాధికారి జి.కామేశ్వరశర్మ, ఆస్థాన పండితుడు కృష్ణశర్మ, శారదాపీఠం ట్రస్టీ రొబ్బి శ్రీనివాస్, కాశీ శారదాపీఠం శాఖ భవనం మేనేజర్ పి.కిశోర్‌కుమార్, ఆంధ్రా ఆశ్రమం మేనేజింగ్ ట్రస్టీ వి.వి.సుందర శాస్త్రి, వి.వి సీతారాం, ప్రముఖ న్యాయ వాది వై.నీలలోహిత్, కరివేణ సత్రం మేనేజర్ శ్రీనివాస్, సాధుసంతులు పాల్గొన్నారు.
కాశీలో శారదాపీఠం శాఖ ప్రారంభం
Published Mon, Dec 4 2017 1:44 AM | Last Updated on Mon, Dec 4 2017 1:44 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment