sharada peetam
-
విశాఖ: రాజశ్యామల అమ్మవారికి సీఎం జగన్ పూజలు
CM Jagan Vizag Tour Updates విశాఖలో సీఎం జగన్ శారదా పీఠం వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్ శారదా పీఠంలో రాజశ్యామల యాగం పూర్ణాహుతి మన్యుసుక్త హోమం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి రాజశ్యామల అమ్మవారికి సీఎం జగన్ ప్రత్యేక పూజలు ►రాజ్యశ్యామల అమ్మవారి యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీ శారద స్వరూప రాజ్యశ్యామల అమ్మవారి ఉత్సవ విగ్రహాలను దర్శించుకున్న సీఎం జగన్మోహన్రెడ్డి రాజ శ్యామల అమ్మవారి దీక్ష పీఠం వద్ద పూజలో పాల్గొన్న సీఎం జగన్ శ్రీ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి తో కలిసి రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుంటున్న సీఎం జగన్మోహన్ రెడ్డి వన దుర్గ అమ్మవారిని దర్శించుకున్న సీఎం జగన్ ► శారదాపీఠం వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్ ► శారదా పీఠంలో రాజశ్యామల యాగం పూర్ణాహుతి ►పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ శారదా పీఠంలో సీఎం జగన్‌కు సాదర స్వాగతం ► శారదాపీఠంలో ఉత్తరాధికారి స్వాత్మానందం సరస్వతి... పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతిలను కలిసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి శారదా పీఠంలో సీఎం జగన్ శారదాపీఠం చేరుకున్న సీఎం జగన్మోహన్రెడ్డి స్వాగతం పలికిన మంత్రులు బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్,. వెస్ట్ ఇంచార్జ్ ఆడారి ఆనంద్ కుమార్ విశాఖ విమానాశ్రయం నుంచి శారదా పీఠానికి బయలుదేరిన సీఎం జగన్మోహన్ రెడ్డి వేపగుంట జంక్షన్ దాటిన సీఎం కాన్వాయ్ కాసేపట్లో శారదా పీఠానికి చేరుకుని వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొననున్న సీఎం జగన్ విశాఖ చేరుకున్న సీఎం జగన్ ►కాసేపట్లో రోడ్డు మార్గం గుండా చినముషిడివాలోని శ్రీశారదా పీఠానికి.. ►పీఠం వారికోత్సవ వేడుకల్లో పాల్గొననున్న సీఎం జగన్ ►అమ్మవారిని దర్శించుకోనున్న సీఎం జగన్ ►పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీతో కలిసి పీఠంలోని దేవతామూర్తులకు సీఎం జగన్ ప్రత్యేక పూజలు ►రాజశ్యామల యాగం పూర్ణాహుతిలో పాల్గొననున్న సీఎం జగన్ ►దాదాపు గంట పాటు పీఠంలోని పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం జగన్ -
శారదాపీఠంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
-
స్వామీజీల పీఠాలకు భూములు ఇస్తే తప్పేంటి?: మంత్రి వెల్లంపల్లి
-
గ్యాస్ లీక్ దురదృష్టకరం: స్వామి స్వరూపానందేంద్ర
సాక్షి, విశాఖపట్నం: విష వాయువు లీకైన ఘటన దురదృష్టకరమని విశాఖ శారదా పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనలోని బాధితులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. భగవంతుడి ఆశీస్సులతో పరిస్థితి సద్దుమణగాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా విష వాయువు ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు విశాఖ శారదాపీఠం, వానప్రస్థం వృద్దాశ్రమం చేయూత అందిస్తాయని తెలిపారు. (గ్యాస్ లీక్.. కారణం అదే!) పదివేల మందికి వానప్రస్థం వృద్దాశ్రమంలో మధ్యాహ్న భోజనం అందించటం కోసం ఆహారం పంపిణీకి నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. ఈ బాధ్యతలను శరదాపీఠం ట్రస్టీ రొబ్బి శ్రీనివాస్‌కు అప్పగించినట్లు స్వామి స్వరూపానందేంద్ర తెలిపారు. (లీకైన గ్యాస్ చాలా ప్రమాదకరం: నిపుణులు) -
అంగరంగ వైభవంగా శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాలు
-
తల్లి ఒడి.. బడి... గుడి ఆధ్యాత్మికతకు ఆలవాలం
సమస్యల పరిష్కారానికి ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం లేదు. జీవాత్మను పరమాత్మలో లయం చేసుకోవటం ద్వారానే బతుకు సార్థకం అవుతుంది. భగవంతుని మీద భారం వేసి, తాను చేయాల్సిన కర్తవ్యాన్ని నెరవేర్చటం ప్రధానం. అందుచేత భగవంతుడ్ని సరళమైన రీతిలో సేవించుకోవటమే కలియుగంలో పరిష్కార మార్గం‘ అని అన్నారు స్వాత్మానందేంద్ర సరస్వతి. ఏదైనా పీఠానికి ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించిన వారు దేశంలోని వివిధ ప్రాంతాల్ని పర్యటించి రావటం ఆనవాయితీ. కంచిపీఠం, శృంగేరీ పీఠం వంటి వాటిలో ఈ సాంప్రదాయం గోచరిస్తుంది. అదే స్ఫూర్తితో స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి కూడా ఇప్పుడు తెలుగు నాట వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాల్లో పర్యటించారు. అనేక శైవ, వైష్ణవ క్షేత్రాల్ని సందర్శించారు. వివిధ ప్రాంతాల్లో భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ప్రస్తుతం భాగ్యనగర పర్యటనలో ఉన్న స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతిని సాక్షి పలకరించింది. ఏకత్వంలో భిన్నత్వం గోచరించటమే భారత సమాజంలోని విశిష్టత. వివిధ అంశాల మీద రక రకాల ఆలోచనలు ఉండవచ్చు గానీ, అంతస్సూత్రం మాత్రం సదాలోచన అయి ఉండాలి‘ అని చెప్పారు స్వాత్మానందేంద్ర సరస్వతి. అందుకే భగవంతుడ్ని సేవించుకొనేందుకు చాలా సరళమైన మార్గాల్ని, ఉత్తమ విధానాల్ని ప్రబోధిస్తుంటారు. ముఖ్యంగా ప్రస్తుత తరంలో హిందూమతంపై ఉన్న అపోహలు, దురభిప్రాయాలను తొలగించేందుకు ఈ విజయయాత్ర ద్వారా స్వాత్మానందేంద్ర ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేకించి నేడున్న సామాజిక పరిస్థితుల్లో అనేకానేక మానసిక, శారీరక సమస్యలతో సతమతమవుతూ చిన్న విషయాలకే తల్లడిల్లిపోతున్న మానవాళి తీరుపై ఆయన స్పందించారు. ఆధ్యాత్మిక మార్గం అంటే సామాన్యులకు దూరంగా నిలిచేది కానే కాదన్నది ఆయన అభిమతం. ఆధ్యాత్మికత అర్థం పూజలు, బోధలు మాత్రమే కాదనీ, సేవ చేయడం, సేవామార్గం చూపడం కూడా ఆధ్యాత్మికతకు ఆనవాళ్లనీ స్వామి చెప్పారు. సంసారం అనే సాగరాన్ని ఈదటంలో ఇబ్బందులు పడుతుండటమే సామాన్యుల వైచిత్రి. అటువంటప్పుడు సమస్యల పరిష్కారం మరో రకమైన ఇబ్బంది కాకూడదు అన్నది ఆయన మార్గం. ఈ క్రమంలో మైదాన ప్రాంతాల్లో మాత్రమే కాకుండా గిరిజన ప్రాంతాలను కూడా తమ పర్యటనలకు ఎంచుకున్నారు. ఎక్కువగా నిరక్షరాశ్యులుండే ఈ ప్రాంతాల వాసులకు ఆధ్యాత్మిక జీవిత ప్రాధాన్యత, ధర్మసూక్ష్మాలను సులభశైలిలో తెలియజేస్తున్నారు. ఇవన్నీ నిత్య జీవితంలో తేలికగా ఆచరించేలా వారిని సన్నద్ధులు చేస్తున్నారు. ఆధ్యాత్మికవేత్తలు, స్వాములంటే కేవలం పూజలు, బోధలకే పరిమితమై ఉంటారనే సార్వజనీన అభిప్రాయాన్ని తొలగించేందుకు శారదాపీఠం అడుగులు వేసింది. ఆధ్యాత్మికతకు సేవను కూడా జోడించి లోకకల్యాణానికి నిజమైన అర్థాన్ని తెలియజేసేందుకు ఈ పీఠం కంకణం కట్టుకుంది. సాధారణంగా సేవలనగానే మనుషులకు చేసే విద్య, వైద్య సేవలే ఎక్కువగా గుర్తుకొస్తాయి. అయితే శారదాపీఠం మరో అడుగు ముందుకేసి జంతుజీవజాలానికి కూడా వైద్య సేవలందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. జీవకోటి ఉనికికి మూలమైన వ్యవసాయ రంగంలో జంతుజీవజాలం పాత్ర ఎంతో కీలకం. అందుకే, పశుపక్ష్యాదుల ఆరోగ్య పరిరక్షణకు కూడా ప్రత్యేక శిబిరాల నిర్వహణకు రంగం సిద్ధం చేసింది. మాధవసేవ అంటే మనుషులకు మాత్రమే చేసే సేవ కాదన్నది శారదాపీఠం నిశ్చితాభిప్రాయం. ఈ విజయయాత్ర లక్ష్యం సమాజంలో మమేకమై సామాన్యులకు చేరువై ధర్మ సంస్థాపనకు మార్గం సుగమం చేయడమేనని స్వాత్మానంద తెలిపారు. పుట్టుక నుంచి ఒక స్పష్టమైన వ్యక్తిత్వం ఏర్పడే వరకూ తల్లి మార్గదర్శకత్వం వెలుగు బాటగా నిలుస్తుందని, కనుక మాతృమూర్తులు పిల్లల పెంపకంలో గొప్ప పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. తల్లి ఒడి నుంచి వచ్చిన చిన్నారులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో బడి కీలకపాత్ర పోషిస్తుందని, ఆ ఉత్తమపౌరులను అత్యుత్తమ మానవులుగా మలచడంలో గుడిదే కీలకపాత్ర అన్నారు. దేవాలయాల నిర్వహణలో ఆర్షధర్మం సూచించిన వివిధ రకాల ఆగమ విధానాలు, మంత్రోపాసన ప్రక్రియలు ప్రజలను ఐకమత్యంతో సన్మార్గంవైపు నడిపించడంలో గొప్ప భూమిక పోషిస్తాయన్నారు.మానవ జీవితంలో ఇంత కీలక భూమికను పోషించే బడిని, గుడిని పటిష్టపరుచుకుంటే అదే నిజమైన లోకకల్యాణానికి బాసటగా నిలుస్తుందన్నారు. తమ పర్యటనలలో భాగంగా ఆయా ప్రాంతాలలో నెలకొని ఉన్న గోశాలలను సందర్శించి గోమాత విశిష్టతను భావితరాలకు అందించేందుకు నడుం కట్టారు. ఆధ్యాత్మిక క్రతువులతో పాటు ఆరోగ్యం, వాణిజ్యం, ఆహారం, వ్యవసాయ రంగాలలో భిన్న విధాలుగా గోవు అందిస్తున్న సేవలు అమూల్యమైనవని పేర్కొంటూ అలాంటి గోమాతను పరిరక్షించుకోవలసిన అవశ్యకతను నేటి తరం గుర్తించి ఆచరించాలన్నది తన ఆకాంక్షగా తెలియజేశారు. – వై. రమావిశ్వనాథన్, సీనియర్ పాత్రికేయులు ఇప్పటివరకు శారదా పీఠం ఒక ఉత్కృష్టమైన ఒరవడితో ముందుకు సాగుతోంది. హైందవ ఆధ్యాత్మిక మార్గంలో మాకు ఒక విభిన్నమైన మార్గం ఉంది. అదే ఒరవడిలో ధర్మాన్ని సంరక్షించుకొనే మార్గంలో ముందుకు సాగుతాం. అన్ని వర్గాల ప్రజలకు శంకరవాణి సమర్థవంతంగా అందాలన్నదే మా అభిమతం – స్వాత్మానందేంద్ర సరస్వతి ఉత్తరాధికారి, విశాఖ శ్రీ శారదాపీఠం ‘బాల్యం నుంచి ఆధ్యాత్మిక జీవితం మీదనే నాకు ఆసక్తి ఉండేది. మా గురువు గారైన శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతితో ఎక్కువ కాలం గడపటం, ఆయనతో భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించటంతో ఈ స్ఫూర్తి బలపడిందని అనుకోవచ్చు.. కలియుగంలో ప్రజలు వివిధ రకాల ఈతిబాధలతో సతమతం అవటం, భగవంతుడి అసలు తత్వాన్ని అర్థం చేసుకోలేక పోవటం వంటి అంశాల మీద నాలో నేను తీవ్రంగా అంతర్మథనం చెందేవాడిని. ‘జీవాత్మను పరమాత్మలో లయం చేసుకోవడం ద్వారానే బతుకు సార్థకం అవుతుంది. నీలోనూ, మాలోను ఉన్నది ఒకటే బ్రహ్మ పదార్థం. దీన్ని తెలుసుకోవటమే శంకరాచార్యుల వారు ఉపదేశించిన అద్వైత మార్గం. ప్రజలకు శంకర భగవత్పాదుల వారి అద్వైత మార్గాన్ని, అసలు తత్వాన్ని అందించేందుకు అంకితం కావాలని నిర్ణయించుకొన్నాను. అదే కఠినమైన సన్యాసాశ్రమ దీక్ష వైపు నన్ను మళ్లించింది‘ అని చెప్పారు స్వాత్మానందేంద్ర సరస్వతి. నిర్వహణ: డి.వి.ఆర్. భాస్కర్ -
తెలంగాణ సుభిక్షంగా ఉండాలని...
సాక్షి, విశాఖపట్నం: తెలంగాణ సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదివారం విశాఖపట్నంలోని శారదాపీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలకు మరింత మేలు చేకూర్చేలా తమ ప్రభుత్వానికి శారదాంబ అమ్మవారి ఆశీస్సులు కావాలని కోరుకున్నారు. పార్టీ ముఖ్య నేతలతో కలసి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్న కేసీఆర్ దంపతులు ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా పెందుర్తి మండలం చినముషిడివాడ గ్రామంలోని శ్రీ శారదాపీఠానికి చేరుకున్నారు. పీఠాధిపతి శ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతిని దర్శించుకున్నారు. స్వామీజీకి సాష్టాంగ నమస్కారాలు చేసి ఆయన ఆశీస్సులు అందుకున్నారు. అలాగే ఆయనకు పట్టువస్త్రాలు, పండ్లు బహూకరించి గజమాలతో సత్కరించారు. అనంతరం స్వామీజీతో కలసి సతీసమేతంగా పీఠంలోని శార దాంబ, రాజశ్యామల, వల్లీదేవి సమేత సుబ్రçహ్మణ్యేశ్వరస్వామి, దక్షిణామూర్తి, దాసాంజనేయ స్వామి వారి ఆలయాలతోపాటు స్వర్ణ మండపాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పీఠంలో నిత్యం జరిగే యజ్ఞ, యాగాలు, హోమాలు, పూర్ణాహుతిలో పాల్గొన్నారు. కోరిన కోర్కెలు తీర్చే శమీ వృక్షం చుట్టూ కేసీఆర్ దంపతులు ప్రదక్షిణలు చేశారు. ఇచ్చిన మాట ప్రకారమే... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో శారదా పీఠాధిపతి శ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో రాజశ్యామల యాగం నిర్వహించారు. ఆ యాగం చక్కటి ఫలితాలు ఇవ్వడంతో ఆ రోజే స్వామీజీకీ కేసీఆర్ మాటిచ్చారు. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగానే పీఠాన్ని సందర్శిస్తానని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ పీఠాన్ని సందర్శించి స్వామీజీ ఆశీర్వచనం తీసుకున్నారు. దాదాపు రెండు గంటలపాటు ఆశ్రమంలో గడిపిన కేసీఆర్... అందులో గంటా 20 నిమిషాలపాటు స్వామీజీతో ఏకాంతంగా సమావేశమయ్యారు. ఇరువురి మధ్య పలు ఆధ్యాత్మిక, రాజకీయ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ముఖ్యంగా తాను ఏర్పాటు చేయనున్న ఫెడరల్ ఫ్రంట్‌పై స్వామీజీ సలహాలను కేసీఆర్ తీసుకున్నారని సమాచారం. తెలంగాణ ప్రజల అభిమానం, దేవుని ఆశీస్సులతో తాను రెండోసారి అధికార పగ్గాలు చేపట్టానని కేసీఆర్ ఈ సందర్భంగా చెప్పారని పీఠం సిబ్బంది తెలిపారు. ఉద్యమ సమయంలోనూ.. ఆ తర్వాత రెండుసార్లు సీఎం కావడంలో స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు ఎంతో ఉన్నాయని కేసీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారన్నారు. గతంలో ప్రధాని కాకముందు పీవీ నర్సింహారావు కూడా పీఠా న్ని సందర్శించి స్వామిజీ ఆశీస్సులు పొందేవారని సిబ్బంది పేర్కొన్నారు. హోరెత్తిన కేసీఆర్ నినాదాలు... ముఖ్యమంత్రి రాకతో విశాఖ ఎయిర్‌పోర్టు, శారదాపీఠం పరిసరాలు కేసీఆర్ నినాదాలతో హోరె త్తాయి. ఎయిర్‌పోర్టు నుంచి పీఠం వరకు దారిపొడవునా రోడ్లకు ఇరువైపులా కేసీఆర్‌కు స్వాగతం పలు కుతూ ఆయన అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కేసీఆర్‌ను చూసేందుకు ఎయిర్‌పోర్టు వద్ద, పీఠం వద్ద జనం ఎగబడ్డారు. ఎయిర్‌పోర్టు వద్ద బోనాలతో సినీ నటి రమ్యశ్రీ సహా పెద్ద ఎత్తున మహిళలు కేసీఆర్‌కు స్వాగతం పలికారు. ఏపీ టీఆర్ఎస్ నేతలమంటూ విజయవాడ నుంచి కొణిజేటి ఆదినారాయణ అనుచరులతో కలసి పార్టీ కండువా లు, జెండాలతో రాగా, కాకినాడ నుంచి వచ్చిన దూసర్లపూడి రమణరాజు అన్నవరంలో కేసీఆర్ కోసం పూజలు చేశానంటూ కేసీఆర్ ఫొటో ఫ్రేమ్, సత్యదేవుని ప్రసాదంతో పీఠం వద్దకు వచ్చారు. ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి కేసీఆర్ సామాజిక వర్గీయులు పీఠం వద్దకు చేరుకుని కేసీఆర్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. పీఠంలోకి వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు కేసీఆర్ తన కారు దిగి అభిమానులకు అభివాదం చేయడంతో పీఠం పరిసరాలు నినాదాలతో హోరె త్తాయి. కేసీఆర్ వెంట ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఎంపీ సంతోష్, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, కేసీఆర్ రాజకీయ కార్యదర్శి సుభాష్ రెడ్డి ఉన్నారు. వారికి ఉత్తర పీఠాధిపతి బాలస్వామి, ధర్మాధికారి కామేశ్వరశర్మ తదితరులు స్వాగతం పలికారు. -
విశాఖలో హల్చల్ చేస్తున్న కేసీఆర్ కటౌట్లు
-
విశాఖ విమానాశ్రయంలో కేసీఆర్‌కు ఘనస్వాగతం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు ఆదివారం విశాఖపట్నానికి చేరుకున్నారు. విశాఖపట్నం విమానాశ్రయంలో ఆయనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా శారదాపీఠానికి బయలుదేరారు. సీఎం హోదాలో తొలిసారి విశాఖపట్నం వచ్చిన కేసీఆర్.. శారదా పీఠాన్ని సందర్శించి.. స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం రాజశ్యామల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరికాసేపట్లో ఆయన విశాఖ నుంచి భువనేశ్వర్ వెళ్లనున్నారు. సీఎం కేసీఆర్ వెంట టీఆర్ఎస్ ఎంపీ సంతోష్, తన రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డి ఉన్నారు. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా కేసీఆర్ వరుసగా ఐదు రోజులపాటు వివిధ రాష్ట్రాల్లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబసభ్యులతో కలసి ఆదివారం ఉదయం 10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి విశాఖపట్నం బయలుదేరారు. అంతకుముందు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌కు హోంమంత్రి మహమూద్ అలీ దట్టీ కట్టి.. సాదరంగా వీడ్కోలు పలికారు. విశాఖలోని శారదా పీఠాన్ని సందర్శించిన అనంతరం ఆయన భువనేశ్వర్ వెళ్తారు. సాయంత్రం ఆరు గంటలకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో ఆయన నివాసంలోనే సమావేశమవుతారు. ముఖ్యమంత్రి అధికార నివాసంలోనే కేసీఆర్ బస చేస్తారు. సోమవారం సైతం ఒడిశాలోనే ఉంటారు. కోణార్క్, పూరీ దేవాలయాలను సందర్శించి సాయంత్రం కోల్‌కతా వెళ్తారు. విశాఖలో భారీ కేసీఆర్ కటౌట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ విశాఖ పర్యటన నేపథ్యంలో శారదాపీఠం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ మార్గంలో భారీగా పోలీసులను మొహరించారు. తెలంగాణా పోలీసులు కూడా శారదాపీఠం వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే ఆశ్రమంలోకి అనుమతిస్తున్నారు. మరోవైపు కేసీఆర్ విశాఖకు వస్తున్న సందర్భంగా ఆయనకు స్వాగతం పలుకుతూ.. విశాఖ విమానాశ్రయం నుంచి శారదాపీఠం వెళ్లే మార్గంలో భారీ కటౌట్లు వెలిశాయి. ఈ మార్గంలో వెలిసిన కేసీఆర్ కటౌట్లు పలువురు దృష్టిని ఆకర్షిస్తున్నాయి. -
కాశీలో శారదాపీఠం శాఖ ప్రారంభం
పెందుర్తి: పవిత్ర గంగానదీ తీరం సమీపంలోని కాశీ (వారణాసి)లో నూతనంగా నిర్మించిన శారదాపీఠం శాఖను విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామీ చేతుల మీదుగా ఆదివారం ప్రారంభించారు. ముందుగా గంగానదీ స్నానమాచ రించి కాశీ విశ్వేశ్వరుడు, విశాలాక్షి, అన్న పూర్ణాదేవి దేవాలయాలను సందర్శించి దేవతామూర్తులను దర్శించుకున్నారు. అనంతరం శారదాపీఠం శాఖలోకి పీఠం మర్యాదలతో స్వామీజీని ప్రతినిధులు, వేదపండితులు ఆహ్వానించారు. శాస్త్రోక్తం గా పీఠం భవనాన్ని ప్రారంభించారు. స్వామీజీ అనుగ్రహభాషణ చేస్తూ కాశీ క్షేత్రంలో నివసించే దండి స్వాములకు వారానికికోసారి యతిభిక్ష (అన్నదానం) ఏర్పాటు చేయాలని పీఠం ప్రతినిధులకు సూచించారు. దత్త జయంతి సందర్భంగా పీఠంలో అన్నదాన కార్య క్రమాన్ని స్వామీజీ చేతుల మీదుగా ప్రారంభించారు. దండిస్వాములకు భిక్ష పెట్టి దక్షిణలు అందజేశారు. కార్యక్రమం లో ఉత్తర పీఠాధిపతి బాలస్వామి, ధర్మాధికారి జి.కామేశ్వరశర్మ, ఆస్థాన పండితుడు కృష్ణశర్మ, శారదాపీఠం ట్రస్టీ రొబ్బి శ్రీనివాస్, కాశీ శారదాపీఠం శాఖ భవనం మేనేజర్ పి.కిశోర్‌కుమార్, ఆంధ్రా ఆశ్రమం మేనేజింగ్ ట్రస్టీ వి.వి.సుందర శాస్త్రి, వి.వి సీతారాం, ప్రముఖ న్యాయ వాది వై.నీలలోహిత్, కరివేణ సత్రం మేనేజర్ శ్రీనివాస్, సాధుసంతులు పాల్గొన్నారు. -
'నిన్నటి దుర్ఘటనకు చింతిస్తున్నా'
రాజమండ్రి: గోదావరినది అతి పవిత్రమైందని ... ఆ నదీ స్నానం ఎక్కడైనా ఆచరించవచ్చునని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. బుధవారం రాజమండ్రిలో పవిత్ర గోదావరి నదిలో స్నానం ఆచరించిన అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. మంగళవారం కోటగుమ్మం పుష్కరఘాట్‌లో చోటు చేసుకున్న తొక్కిసలాట దుర్ఘటన పట్ల చింతిస్తున్నట్లు వెల్లడించారు. పుష్కరాలు జరిగే 12 రోజులు సంయుక్తంగా పని చేయాలని రెవెన్యూ, పోలీసు, దేవాదాయ శాఖలకు స్వరూపానందేంద్ర సూచించారు. అలాగే ఆధ్యాత్మిక సదస్సులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి స్వరూపానందేంద్ర సరస్వతి విజ్ఞప్తి చేశారు. అయితే గోదావరి పుష్కరాల ప్రారంభం సందర్భంగా రాజమండ్రిలోకి కోటగుమ్మం పుష్కరఘాట్‌లో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 35 మంది భక్తులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పట్ల స్వరూపానందేంద్ర సరస్వతి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.