సాక్షి, విశాఖపట్నం: విష వాయువు లీకైన ఘటన దురదృష్టకరమని విశాఖ శారదా పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనలోని బాధితులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. భగవంతుడి ఆశీస్సులతో పరిస్థితి సద్దుమణగాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా విష వాయువు ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు విశాఖ శారదాపీఠం, వానప్రస్థం వృద్దాశ్రమం చేయూత అందిస్తాయని తెలిపారు. (గ్యాస్ లీక్.. కారణం అదే!)
పదివేల మందికి వానప్రస్థం వృద్దాశ్రమంలో మధ్యాహ్న భోజనం అందించటం కోసం ఆహారం పంపిణీకి నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. ఈ బాధ్యతలను శరదాపీఠం ట్రస్టీ రొబ్బి శ్రీనివాస్‌కు అప్పగించినట్లు స్వామి స్వరూపానందేంద్ర తెలిపారు. (లీకైన గ్యాస్ చాలా ప్రమాదకరం: నిపుణులు)
Comments
Please login to add a commentAdd a comment