వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల సెప్టెంబర్ రెండో తేదీన తిరుపతికి రానున్నట్లు పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు
సాక్షి, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల సెప్టెంబర్ రెండో తేదీన తిరుపతికి రానున్నట్లు పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇడుపులపాయ నుంచి బస్సుయాత్ర ప్రారంభించనున్న ఆమె అక్కడి నుంచి నేరుగా తిరుపతికి చేరుకుంటారని పేర్కొన్నారు. తిరుపతిలో రెండో తేదీ సాయంత్రం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని, రాత్రి ఇక్కడే బస చేస్తారని తెలిపారు. మూడో తేదీ ఉదయం పూతలపట్టు, చిత్తూరు, పలమనేరు మీదుగా మదనపల్లె చేరుకోనున్నట్లు వివరించారు. మూడో తేదీన ఉదయం చిత్తూరులో, సాయంత్రం మదనపల్లెలో బహిరంగ సభలు ఉంటాయని తెలిపారు.