bus tour
-
సీఎం జగన్ బస్సు యాత్ర ప్రొద్దుటూరులో తొలి బహిరంగ సభ
-
మేమంతా సిద్ధం.. సీఎం జగన్ 21 రోజుల బస్సు యాత్ర
-
బండి సంజయ్ బస్సుయాత్ర!
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ సర్కారు ముందస్తు ఎన్నికలకు వెళుతుందనే అంచనాలతో.. ప్రస్తుతం జరుగుతున్న పాదయాత్రకు బదులు బస్సుయాత్ర చేపట్టేందుకు రాష్ట్ర బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. ఎన్నికలుంటే పాదయాత్రకు సమయం సరిపోయే అవకాశం తక్కువకావడంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో బస్సు యాత్ర చేపట్టాలని భావిస్తోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా పార్టీ పూర్తిగా సన్నద్ధంగా ఉండేలా.. అన్ని నియోజకవర్గాలను చుట్టేలా కేడర్‌ను సంసిద్ధం చేస్తోంది. ఆరో విడత యాత్ర జంటనగరాల పరిధిలో.. ప్రస్తుతం ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్రలో ఉన్న బండి సంజయ్.. అది ముగిసిన వెంటనే మూడు నాలుగు రోజులు విరామమిచ్చి ఆరో విడత యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఈ సారి హైదరాబాద్ జంట నగరాల పరిధిలో పాదయాత్రకు రూట్ మ్యాప్ ఖరారు చేస్తున్నారు. గతంలో మల్కాజ్గిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర నిర్వహించిన తరహాలోనే జంట నగరాల పరిధిలో పది రోజుల యాత్ర కొనసాగించేలా పాదయాత్ర ప్రముఖ్ గంగిడి మనోహర్‌రెడ్డి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ నెల 18న కరీంనగర్లో ఐదో విడత పాదయాత్ర ముగింపు బహిరంగసభలో ఆరో విడత యాత్రపై ప్రకటన చేసే అవకాశం ఉంది. జిల్లాల వారీగా సమీక్షలు బండి సంజయ్ ఒకవైపు పాదయాత్ర నిర్వహిస్తూనే.. మరోవైపు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. పాదయాత్ర విరామ సమయంలో, ఉదయం పూట పార్టీ నేతలతో సమావేశమై జిల్లాలు, నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి, పోలింగ్ బూత్ కమిటీల ఏర్పాటు, పార్టీ బలోపేతానికి చేపడుతున్న కార్యక్రమాలు, తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం నిర్మల్ జిల్లా ముఖ్య నేతలతో సమీక్షించారు. ఆదివారం మంచిర్యాల జిల్లా నేతలతో సమావేశం నిర్వహించారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా నేతలతో, 6న నిజామాబాద్, 7న ఆసిఫాబాద్, కామారెడ్డి జిల్లాల ముఖ్య నేతలతో సమీక్షలు జరపనున్నారు. ఈ విడత పాదయాత్ర ముగిసేలోగా ఉత్తర తెలంగాణ జిల్లాల సమీక్షలు పూర్తి చేయనున్నారని.. తర్వాత దక్షిణ తెలంగాణ జిల్లాలపై దృష్టి పెడతారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. -
ఈ నెల 26 నుంచి వైఎస్సార్సీపీ బస్సుయాత్ర
సాక్షి, అమరావతి: బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు అధిక ప్రాధాన్యత నేపథ్యంలో ఈ నెల 26 నుంచి వైఎస్సార్ సీపీ బస్సు యాత్ర చేపట్టనుంది. సామాజిక న్యాయం పేరిట ఈ యాత్ర చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాష్ట్ర ప్రభుత్వ ఏవిధమైన ప్రాధాన్యత ఇస్తోందనేది ప్రజలకు వివరించడమే లక్ష్యంగా ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి. ఈ మేరకు మొత్తం శ్రీకాకుళం, అనంతపురం, రాజమండ్రి, నరసరావుపేట నాలుగు నియోజకవర్గాల్లో బస్సు యాత్ర నిర్వహించి బహిరంగ సభలు నిర్వహించనున్నారు. బీసీ, ఎస్టీ, ఎస్టీ మైనారిటీలకు చెందిన మొత్తం 17 మంత్రులు ఈ బస్సు యాత్రలో పాల్గొంటారు. ఈ నెల 26న శ్రీకాకుళం లేదంటే విజయనగరంలో బహిరంగ సభ 27న రాజమండ్రిలో సభ 28న నరసరావుపేటలో బహిరంగ సభ.. ఆ రాత్రికి నంద్యాలలో బస, 29న అనంతపురంలో బహిరంగ సభ (చదవండి: తీరిన బొగ్గు కొరత.. ఏపీలో ఇక నిరంతరాయ విద్యుత్ సరఫరా) -
కార్మిక హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు
తల్లాడ ఖమ్మం : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ, వారి పాలిట శాపంగా మారిందని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సింగు నరసింహారావు అన్నారు. శుక్రవారం ఏఐటీయూ సీ బస్సు ప్రచార యాత్ర ఏన్కూరు మీదుగా తల్లాడ చేరుకుంది. ఈ సందర్భంగా బీజీ.క్లెమెంట్ అధ్యక్షతన రింగ్సెంటర్లో జరిగిన సభలో ఆయ న మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ట్రేడ్ యూనియన్ చట్టాన్ని మారుస్తూ భవిషత్తులో పర్మినెంట్ ఉద్యోగాలు, ఉద్యోగ భద్రత లేకుండా పైర్ అనే విధానాన్ని ప్రవేశపెడుతూ శాశ్వత ఉద్యో గులు లేకుండా చర్యలకు పూనుకుంటున్నాయని ఆరోపించారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాం డ్ చేశారు. బంగారు తెలంగాణ సాధి స్తామని కేసీఆర్ ప్రగల్భాలు పలికి వాగ్ధానాలను అమలు చేయటంలో పూర్తిగా విఫలమయ్యా రని విమర్శించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించక పోతే ఈ ప్రభుత్వాలకు పతనం తప్పదని ఆయన హె చ్చరించారు. ఈ సందర్భంగా తల్లాడలో కార్మికులతో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయుసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉజ్జని రత్నాకర్‌రావు, రాష్ట్ర కార్యదర్శి ఎన్.కరుణకుమారి, సహాయ కార్యదర్శి బాలరాజు, ఏఐటీయూసీ డివిజన్ నాయుకులు నిమ్మటూ రి రామక్రిష్ణ, నల్లమోతు నరసింహరావు, టీ.వెంకటేశ్వర్రావు, తాళ్లూరి లక్ష్మీ, సుభద్ర, జయమ్మ, జే.వెంకటలక్ష్మీ, ఎం.పద్మ,సీత, కొల్లి నాగభూషణం, ఇనుపనూరి క్రిష్ణ పాల్గొన్నారు. -
పిచ్చోడి చేతిలో రాయిలా పాలన: షబ్బీర్ అలీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా సాగుతోందని మండ లిలో విపక్షనేత షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ను డల్లాస్ చేస్తా, ఇస్తాంబుల్ చేస్తా అని పెద్దపెద్ద మాటలు చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు హైదరాబాద్ రోడ్లపై నడిస్తే నగరం ఎలా తయారయిందో అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. ప్రజాచైతన్య బస్సుయాత్ర కమిటీ సమావేశం అనంతరం పార్టీ నేతలు మహేశ్వర్‌రెడ్డి, దయాసాగర్‌లతో కలసి ఆయన మంగళవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి అయిందని గొప్పలు చెప్పుకుంటున్న సీఎం, మంత్రి కేటీఆర్‌ల నిర్వాకానికి హైదరాబాద్ రోడ్లే నిద ర్శనంగా నిలుస్తున్నాయని చెప్పారు. పాలనలో విఫలమైన కేసీఆర్, కేటీఆర్‌లు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బ్రిటన్ కమిషనరేట్ అధికారులతో ఉత్తమ్ భేటీ సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని బ్రిటన్ కమిషనరేట్ అధికారులు మంగళ వారం మర్యాదపూర్వ కంగా కలిశారు. బ్రిటిష్ మినిస్టర్ కౌన్సిలర్, ప్రెస్ విభాగాల అధిపతి కైరెన్ డ్రాకె, బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్‌లు గాంధీ భవన్లో ఉత్తమ్‌తో భేటీ అయ్యారు. భేటీలో పలు రాజకీయ అంశాలను చర్చించినట్టు గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. బక్రీద్ శుభాకాంక్షలు బక్రీద్ పండుగ సందర్భంగా తెలంగాణలోని ముస్లిం సోదరులకు ఉత్తమ్, ఏఐసీసీ కార్యదర్శి మహ్మద్‌సలీంలు శుభాకాంక్షలు తెలిపారు. -
జనసేన సమావేశాల్లో గంటా బ్యాచ్?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర బస్సు యాత్ర పూర్వరంగంలో నగరంలోనే మకాం వేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో మంత్రి గంటా శ్రీనివాసరావు సన్నిహితులు భేటీ కావడం, జనసేన శ్రేణుల సమావేశాల్లోనూ ఆయన అనుచరులు పాల్గొనడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది.. వాస్తవానికి ప్రజారాజ్యం పార్టీ మొదలు గంటాతో చిరంజీవి కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్నాయనేది అందరికీ తెలిసిన విషయమే. పీఆర్పీ నుంచి కాంగ్రెస్‌లోకి.. అటు నుంచి టీడీపీలోకి గంటా వెళ్లడం.. ఇటు జనసేన పెట్టి పవన్‌కల్యాణ్ గత ఎన్నికల్లో టీడీపీతో కలిసి ప్రచారం చేయడం తదితర పరిణామాల నేపథ్యంలో గంటా, పవన్‌ల సంబంధాలు కొనసాగుతూ వచ్చాయి. అయితే పవన్ కల్యాణ్ ఇటీవల సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌పై విరుచుకుపడిన దరిమిలా జనసేనను టీడీపీ నేతలు, మంత్రులు టార్గెట్ చేస్తూ వస్తున్నారు. పవన్ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. కానీ పవన్‌పై విమర్శల విషయంలో ఇప్పటివరకు వ్యూహాత్మకంగా మౌనం పాటించిన మంత్రి గంటా ఇప్పుడు నగరంలోనే బస చేసిన పవన్‌తో తెరవెనుక మంత్రాంగం చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నెల 20న శ్రీకాకుళం నుంచి ఉత్తరాంధ్ర బస్సు యాత్రకు శ్రీకారం చుడుతున్న పవన్ బుధవారంరాత్రి నుంచి విశాఖలోనే బస చేస్తున్న సంగతి తెలిసిందే. పార్టీ శ్రేణులతో విస్తృతంగా సమావేశమైన పవన్ కల్యాణ్‌ను గురువారం మంత్రి గంటా శ్రీనివాసరావు సన్నిహితులు, అనుచరులు వెళ్లి కలవడం చర్చనీయాంశమైంది. ఈ విషయమై ఎవరికివారు అదంతా ఉత్తిదే అని కొట్టిపారేస్తున్నా ఉదయం నుంచి అక్కడే కాపుకాసిన జనసేన శ్రేణులు మాత్రం అంతర్గత సంభాషణల్లో గంటా బ్యాచ్ రాక వాస్తవమేనని అంగీకరిస్తున్నారు. -
‘సింగరేణి’కి అండగా ఉంటాం
ఇల్లెందు: తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కార్మికులకు కేసీఆర్ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డిపెండెంట్ ఎంప్లాయిమెంట్‌తో పాటు కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని, డిస్మిస్డ్ కార్మికులను విధుల్లోకి తీసుకుని గని కార్మికులకు అండగా ఉంటామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భరోసా ఇచ్చారు. సోమవారం రాత్రి ఇల్లెందు సింగరేణి గ్రౌండ్లో నిర్వహించిన ప్రజాచైతన్య బస్సుయాత్ర సభలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ఇల్లెందులోని సింగరేణి గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తానని వాగ్దానం చేసిన కేసీఆర్ వాటిని విస్మరించారని విమర్శించారు. డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ స్కీం అమలుకు నోచుకోలేదని, డిస్మిస్డ్ కార్మికులను ఉద్యోగంలోకి తీసుకోలేదని ఆరోపించారు. ఈ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం జీఓ జారీ చేస్తే.. ఆయన కూతురు కవిత నడుపుతున్న జాగృతి సంస్థ కోర్టుకు వెళ్లడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే 20 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని భరోసా ఇచ్చిన కేసీఆర్ ఆ వర్గాన్ని కూడా నిండా ముంచారని విమర్శించారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వకపోగా, గిరిజనుల ఆధీనంలో ఉన్న పోడు భూములను లాక్కుని హరితహారం పేరుతో మొక్కలు నాటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనుల పక్షాన పోరాడేందుకు టీపీసీసీ ఆధ్వర్యంలో బలరాంనాయక్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. త్వరలో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేయకపోగా దళిత వర్గాల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం దురహంకారం ప్రదర్శిస్తోందని అన్నారు. ఇల్లెందు మున్సిపల్ కమిషనర్ రవిబాబుపై టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు దాడిచేశారని, ప్రభుత్వం ఆయనకు న్యాయం చేయకపోగా ఇక్కడి నుంచి బదిలీ చేశారని ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇళ్లు ఏవర్గానికి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. నేరెళ్లలో ఇసుక మాఫియా అక్కడి దళితులను చిత్రహింసలకు గురి చేసిందని, పోలీసులు కూడా వారిపైనే థర్డ్ డిగ్రీ ఉపయోగించి కేసులు బనాయించారని ఆరోపించారు. వారిని పరామర్శించేందుకు వచ్చిన పార్లమెంట్ మాజీ స్పీకర్ మీరాకుమారి పట్ల సైతం సీఎం కేసీఆర్ అనుచితంగా మాట్లాడారని విమర్శించారు. ఖమ్మంలో గిరిజన రైతులకు బేడీలు వేసిన చరిత్ర కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. బీసీ సబ్‌ప్లాన్‌ను అమలు చేయాలని పలు దఫాలుగా డిమాండ్ చేస్తే నేటికీ ఆ ఊసే లేదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ. 2 లక్షల రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్, డ్వాక్రా సంఘాలకు లక్ష వరకు రివ్వాలింగ్ ఫండ్ అందజేస్తామని హామీ ఇచ్చారు. రూ. 10 లక్షల రుణాల వరకు వడ్డీ మాఫీ చేస్తామన్నారు. అభయహస్తం పథకాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు. నిరుద్యోగ భృతి రూ. 3 వేలు చెల్లిస్తామని, ఇల్లెందులో బస్సుడిపో, రైలు మంజూరు చేస్తామని ప్రకటించారు. విలేకరులదరికీ న్యాయం చేస్తామన్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క మట్లాడుతూ.. రాష్ట్రంలో దశబ్దాల పాటు కాంగ్రెస్ పాలించిందని, ఏనాడూ ప్రజలను హింసించలేదని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అహంభావంతో ఒకవైపు ప్రజలను మరోవైపు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ఇబ్బందులకు గురిచేసిందన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ కేటాయింపుపై ప్రస్తావించిన ఇద్దరు ఎమ్మెల్యేలను బర్తరఫ్ చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కేసీఆర్‌కు ఇదే చివరి బడ్జెట్ సమావేశమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తీరని అన్యాయం జరిగిన ఏకైక జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా అని, కేసీఆర్ చర్యకు ఇది నిదర్శనంగా మిగిలిందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ అన్నారు. ఏడు మండలాలను ఆం«ధ్ర రాష్ట్రానికి అప్పగించి ఖమ్మం జిల్లాకు తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తానని ప్రకటించిన కేసీఆర్‌కు చట్టం, రాజ్యాంగం తెలియదా అని ప్రశ్నించారు. కేసీఆర్ దుశ్చర్యలతో మైనార్టీలు విద్యాపరంగా తీవ్రంగా నష్టపోయారన్నారు. 1.90 లక్షల సీట్ల నుంచి 48 వేల సీట్లకు పడిపోయిందన్నారు. ఇల్లెందులో కాంగ్రెస్ నుంచి గెలిచిన కోరం కనకయ్య హైద్రాబాద్, ఇల్లెందులో బంగ్లాలు సంపాదించారని, విలువైన కార్లను కొనుగోలు చేశారని అన్నారు. అంతకు ముందు సైకిల్ కూడా లేని కనకయ్యకు బంగ్లాలు, విలువైన కార్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. రేణుకాచౌదరి మాట్లాడుతూ బంగారు తెలంగాణ పేరుతో ప్రజలను మోసగించిన కేసీఆర్‌కు దమ్ముంటే తన ముందుకు రమ్మని, తనచేతికి ఉన్న విష్ణుచక్రాలతో తఢాఖా చూపిస్తానని సవాల్ విసిరారు. ఇల్లెందు నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్‌ను గెలిపించుకునే ఆత్మాభిమానం ఎక్కువగా ఉందని, టీఆర్ఎస్కు అమ్ముడుపోయిన కనకయ్యకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని ఫైర్‌బ్రాండ్ రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజలను మోసం చేసిన కనకయ్య బతికున్నంత కాలం ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం లేదన్నారు. ఈ సభలో మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి, నాయకులు దొంతు మాధవరెడ్డి, జగన్‌లాల్, సంభాని చంద్రశేఖర్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పోట్ల నాగేశ్వరరావు, వనమా వెంకటేశ్వరరావు, ఎడవల్లి కృష్ణ, సీతక్క, రామ్మోహన్‌రెడ్డి, బెల్లయ్యనాయక్, భరత్‌చంద్రారెడ్డి, రాంరెడ్డి చరణ్‌రెడ్డి, పోరిక సాయిశంకర్ నాయక్, ఇల్లెందు పట్టణ, మండల అధ్యక్షులు ఎస్.కె జానీ, పోశం వెంకటేశ్వర్లు, నియోజకవర్గ నాయకులు చీమల వెంకటేశ్వర్లు, బానోత్ హరిప్రియ, డాక్టర్ రాంచందర్‌నాయక్, భూక్యా దళ్‌సింగ్‌నాయక్, డాక్టర్ జి.రవి, మంగీలాల్‌నాయక్, అజ్మీర శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
నేడు కాంగ్రెస్ ‘బస్సుయాత్ర’
ఇల్లెందు: టీపీసీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహిస్తున్న ప్రజా చైతన్య బస్సు యాత్ర బహిరంగ సభ విజయవంతం కోసం నేతలు సర్వం సిద్ధంచేశారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఇల్లెందులో కాంగ్రెస్ ప్రజా చైతన్య బస్సు యాత్ర బహిరంగ సభ నిర్వహిస్తున్న విషయం విదితమే. వారం రోజులుగా బస్‌యాత్ర విజయవంతం కోసం గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ బస్ యాత్ర ఇన్చార్జ్ జగల్‌లాల్, నియోజకవర్గ సమన్వయకర్త తాజుద్దీన్ బాబా, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌లు నియోజకవర్గంలో పర్యటించి కార్యకర్తలను, నేతలను సమన్వయపర్చారు. మూడు దఫాలు వాయిదా పడిన కాంగ్రెస్ సభ ఎట్టకేలకు ఖరారు కావటంతో సభ విజయవంతం మీదే నేతలు దృష్టిసారించారు. టీపీసీసీ నిర్వహిస్తున్న ప్రజాచైతన్య బస్సు యాత్ర సభలో అగ్రనేతలంతా హాజరు అవుతుందటంతో ఆయా మండలాలు, పట్టణ అధ్యక్షులు, రానున్న ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న నేతలు ముమ్మరంగా కృషి చేస్తున్నారు. టీపీసీసీ నిర్వహించే సభ విజయవంతం చేసి అగ్రనేతల దృష్టిని ఆకర్షించాలని టికెట్ ఆశించే నేతలు చీమల వెంకటేశ్వర్లు, డాక్టర్ బి.రాంచందర్‌నాయక్, బానోతు హరిప్రియతో పాటు మరో ఇద్దరు, ముగ్గురు నేతలు తమదైన శైలిలో జనసమీకరణలో నిమగ్నమయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అడుగు పెడుతున్న బస్ యాత్ర ప్రప్రథమంగా ఇల్లెందు నుంచే ప్రారంభం అవుతుండటంతో నేతల్లో సందడి మొదలైంది. ఇల్లెందులో సాంప్రదాయ ఓటు బ్యాంకు కలిగిన కాంగ్రెస్ తనదైన శైలిలో తన ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు యత్నిస్తోంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రెండో విడత ప్రజా చైతన్య బస్సు యాత్రలో భాగంగా జిల్లాలోని ఇల్లెందులో తొలి బస్సు యాత్ర సభ జరుగనుంది. ఈ సభకు పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నాయకులు కె.జానారెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్, మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, నాయకులు రేవంత్‌రెడ్డి, రేణుకచౌదరి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, సంభాని చంద్రశేఖర్, వనమా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొననున్నారు. -
16న కాంగ్రెస్ బస్సుయాత్ర
ఇల్లెందు: జిల్లాలోకి ఈనెల 16న రానున్న కాంగ్రెస్ బస్సుయాత్ర విజయవంతం కోసం ఆ పార్టీ నేతల్లో హడావిడి మొదలైంది. మొదట ఇల్లెందులోనే ప్రారంభం కావడంతో స్థానిక నాయకులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో కాంగ్రెస్ ఏ కార్యక్రమం తలపెట్టిన ఇల్లెందుకు ప్రాధాన్యత లభిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లెందులో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే కొద్ది రోజులకే ఎమ్మెల్యే కోరం కనకయ్య టీఆర్ఎస్లో చేరిన విషయం విదితమే. ఎమ్మెల్యే వెంట జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, మున్సిపల్ చైర్మన్ లాంటి కీలక నేతలంగా వెళ్లడంతో కాంగ్రెస్ డీలా పడింది. గత రెండేళ్ల కాలంలో ఒక వైపు పార్టీ కార్యక్రమాలు, మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను ప్రచారం చేస్తూ పార్టీ బలోపేతం కోసం విశ్వప్రయత్నం చేస్తున్నారు. అధికార టీఆర్ఎస్ తర్వాత అతి పెద్ద ఓటు బ్యాంకు కలిగిన పార్టీగా కాంగ్రెస్ నిలిచింది. గత ఏడాది కాలంగా ఇల్లెందు బరిలో నిలబడే కాంగ్రెస్ నేతల జాబితా రోజురోజుకూ పెరుగుతోంది. అభ్యర్థుల సంఖ్య పెరగటంతో ఇక్కడ సభల విజయవంతం బా«ధ్యత కూడా వారి భుజాలపై మోపుతున్నారు. గత మార్చి 10న యువజన కాంగ్రెస్ చైతన్య సదస్సు నిర్వహించగా, ఈ నెల 16న కాంగ్రెస్ ప్రజా చైతన్య బస్సు యాత్ర నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ రోజున మధ్యాహ్నం 3 గంటలకు బస్సు యాత్ర ర్యాలీ బయలు దేరుతుంది. పట్టణంలో ప్రధాన రహదారుల గుండా సాగే ర్యాలీ 4 గంటలకు జేకే సింగరేణి హైస్కూల్ గ్రౌండ్‌కు చేరుకుంటుంది. అక్కడ జరిగే సభలో పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నాయకులు కె.జానారెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర మాజీ మంతి పోరిక బలరాం నాయక్, మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, నాయకులు రేవంత్ రెడ్డి, రేణుకాచౌదరి, పొంగులేటి సుధాకర్‌రెడ్డిæ, సంభాని చంద్రశేఖర్, వనమా వెంకటేశ్వరరావు తదితర నేతలు పాల్గొననున్నారు. బస్సుయాత్ర సందర్భంగా సుమారు 10 వేల మందితో బహిరంగ సభ నిర్వహించాలని యోచిస్తున్నారు. -
మరో 4 రోజులు కాంగ్రెస్ బస్సుయాత్ర
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త బస్సుయాత్రకు మరో మూడు రోజుల షెడ్యూల్ తయారైంది. ఈనెల 15 నుంచి 18 వరకు వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల పరిధిలోని ములుగు, వరంగల్, వర్ధన్నపేట, పినపాక, ఇల్లెందు, భద్రాచలం నియోజకవర్గాలో బస్సుయాత్ర చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్ణయించారు. -
చేవెళ్ల టు హుజూరాబాద్
సాక్షి, హైదరాబాద్: చేవెళ్ల సెంటిమెంటు.. నేతల ఐక్యతారాగం.. ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీత.. స్థానిక సమస్యల ప్రస్తావన.. ఎన్నికల హామీలు.. బహిరంగసభలు.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ చేపట్టిన ‘ప్రజా చైతన్య బస్సు యాత్ర’తొలిదశ గురువారంతో ముగిసింది. ఎనిమిది రోజుల పాటు రెండు దఫాలుగా సాగిన ఈ యాత్రలో 16 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో బహిరంగ సభలు నిర్వహించారు. టీపీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా హాజరై ఐక్యతారాగాన్ని చాటడం విశేషం. మొత్తంగా తొలిదశ యాత్ర తీరుపై పార్టీలో నేతలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీపై వ్యతిరేక పవనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్పై విమర్శల దాడి తొలిదశ బస్సుయాత్రలో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కాంగ్రెస్ నేతలు పర్యటించారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభలు పెట్టి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ ఎన్నికల సందర్భంలో, అంతకుమందు ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ.. దళిత సీఎం, ఇంటికో ఉద్యోగం, రైతు రుణమాఫీ, మూడెకరాల భూ పంపిణీ, డబుల్ బెడ్రూం ఇళ్లు, ముస్లిం, గిరిజన రిజర్వేషన్లు తదితర అంశాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. మిషన్‌కాకతీయ, భగీరథ, ఇతర ప్రాజెక్టుల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలూ గుప్పించారు. పకడ్బందీగా సభలు సభల నిర్వహణలోనూ కాంగ్రెస్ యంత్రాంగం పకడ్బందీగా వ్యవహరించింది. తొలిరోజున చేరికలతో ప్రారంభమైన యాత్ర.. చేవెళ్ల సెంటిమెంట్‌తో ముందుకు సాగింది. దాదాపు అన్ని సభలకు భారీగానే న సమీకరణ చేసింది. పార్టీకి మంచి బలమున్న మెదక్, నిజామాబాద్‌లతో పాటు టీఆర్ఎస్ ప్రాబల్యమున్న ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో జరిగిన సభలకు కూడా జనం భారీగానే హాజరుకావడంతో కాంగ్రెస్ నేతల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. సభ నిర్వహణ ఆలస్యమైనా కేడర్ ఓపికతో ఉన్నారని, సభ పూర్తయ్యేవరకు ఉండి నేతలు మాట్లాడిందంతా విని వెళ్లారని... ఇది ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకతకు నిదర్శనమని ఓ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని, బస్సుయాత్ర సభలు ఎన్నికల సభలను తలపించాయని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షం చేస్తున్న బస్సుయాత్రపై అధికార టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేసినా.. కాంగ్రెస్ నేతలు దీటుగానే సమాధానాలు ఇచ్చారు. మొత్తంగా తొలిదశ యాత్రతో కాంగ్రెస్‌లో నూతనోత్సాహం కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల హామీలు వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, పంటలకు మద్దతు ధర, డ్వాక్రా మహిళలకు రూ.లక్ష రివాల్వింగ్ ఫండ్, అభయహస్తం పింఛన్ పెంపు, పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్, నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి వంటివి అమలు చేస్తామని బస్సుయాత్రలో హామీలు గుప్పించారు. వీటితోపాటు ఎక్కడికక్కడ స్థానిక అంశాల ప్రస్తావన, సమస్యల పరిష్కారానికి హామీలిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. -
పోలవరాన్ని ఎందుకు తీసుకున్నారు?
-
పోలవరాన్ని ఎందుకు తీసుకున్నారు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం నుంచి ఎందుకు తీసుకున్నారో, ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గారో చంద్రబాబు చెప్పాలని వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టును కేవలం కమీషన్ల కోసమే తీసుకున్నారని, పథకం ప్రకారం దీనికి సమాధి కట్టేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని వైవీ విమర్శించారు. నేడు ప్రాజెక్టు సందర్శన : పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు దుర్మార్గాన్ని ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపించడానికి వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధుల బృందం ఈ నెల 7న (నేడు) క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళుతోందని తెలిపారు. అక్కడి పరిస్థితులపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు నివేదికను సమర్పిస్తుందని చెప్పారు. అంబేడ్కర్ భగవద్గీతలాంటి రాజ్యాంగాన్ని అందించారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భగవద్గీతలాంటి రాజ్యాంగాన్ని ప్రసాదించారని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా బుధవారం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ సీపీ నేతలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. -
విద్యార్థి,యువత వైపు టీఆర్ఎస్ చూపు
-
సామాజిక హక్కుల సాధనకు బస్సుయాత్ర
అనంతపురం అర్బన్ : అణగారిన, వెనుబడిన వర్గాల హక్కుల సాధన, చైతన్యం కోసం సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో మార్చి 4 నుంచి జిల్లాలో బస్సుయాత్ర సాగుతుందని వేదిక నాయకులు తెలిపారు. శనివారం స్థానిక బళ్లారి బైపాస్‌లోని వైభవ్ రెసిడెన్సీలో వేదిక జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకుల సమావేశం జరిగింది. వేదిక గౌరవాధ్యక్షుడు ఎస్ఆర్ నాగభూషణం ఆధ్యక్షతన జరిగిన సామావేశంలో జిల్లా అధ్యక్షుడు డి.జగదీశ్ మాట్లాడారు. వేదిక ఆధ్వర్యంలో బస్సు యాత్ర ఈ నెల 26న శ్రీకాకుళం ఇచ్చాపురంలో ప్రారంభమైందన్నారు. మార్చి 4 నుంచి 6వ తేదీ వరకు జిల్లాలో సాగుతుందన్నారు. 7న జిల్లా కేంద్రంలో ముగింపు సభ నిర్వహిస్తామన్నారు. యాత్రను, ముగింపు సభను జయప్రదం చేయడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నాయకులు కృషి చేయాలన్నారు. సమావేశంలో నాయకులు మునిసిపల్ మాజీ చైర్మన్ నూర్ మహమ్మద్, కనగానపల్లి జెడ్పీటీసీ ఈశ్వరయ్య, ఖలీఖుల్లాఖాన్, ఎంఎస్‌రాజు, దేవళ్ల మురళీ, మైనుద్దీన్, బోరంపల్లి ఆంజనేయులు, పద్మావతి, జాఫర్, కేశవ్‌నాయక్, రాప్తాడు సర్పంచ్ ఆకుల వెంకటరాముడు పాల్గొన్నారు. 15 నుంచి నియోజవకర్గాల్లో సమావేశాలు : జిల్లాలో బస్సుయాత్ర విజయంతం చేసేందుకు ఈ నెల 15నుంచి నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నామని వేదిక నాయకులు తెలిపారు. 15న రాయదుర్గం, కళ్యాణదుర్గంలోనూ, 16న మడకశిర, హిందూపురం, 17న ఉరవకొండ, గుంతకల్లు, 18న పుట్టపర్తి, ధర్మవరం, 19న తాడిపత్రి, శింగనమల, 20న పెనుకొండ, రాప్తాడు, 21న కదిరి, అనంతపురం నియోజకవర్గాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సమావేశం నిర్వహిస్తామన్నారు. -
దళిత వ్యతిరేక ప్రభుత్వాలను గద్దె దింపాలి
సామాజిక హక్కుల వేదిక బస్సు యాత్రలో ప్రజా సంఘాల పిలుపు బాలాజీ చెరువు (కాకినాడ): మార్పు రావాలి...అభివృద్థి« జరగాలి, అందులో వాటా కావాలి, శ్రమ మాది, అధికారం మీకా అంటూ సీపీఐ ,ప్రజా సంఘాలు, బీసీ, ఎస్టి, ఎస్టీ సంఘాల నాయకుల నినాదాలతో కాకినాడ నగరం మార్మోగింది. ఎస్టి,ఎస్టీ బీసీ హక్కుల సాధనకు సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన బస్సుయాత్ర మంగళవారం సాయంత్రం కాకినాడ చేరుకుంది. అనంతరం కాకినాడ సూర్య కళా మందిరంలో ఏర్పాటు చేసిన సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, సామాజిక హక్కుల వేదిక కన్వీనర్ కె.రామకృష్ణ మాట్లాడుతూ దళితులు, మైనార్టీలు, బీసీల జీవితాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నీర్వీర్యం చేస్తున్నాయని అగ్రహం వ్యక్తం చేశారు. ఎస్టి,ఎస్టీ సబ్‌ప్లా¯ŒSల నిధులు ప్రాజెక్టులకు కేటాయించి మరింత అన్యాయం చేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల ప్రజా ప్రతినిధులలో వారికి గౌరవం లేదని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇష్టమొచ్చిన హమీలిచ్చి ప్రజలను ఇప్పుడు రోడ్లపైకి లాగుతున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం బీసీ సబ్‌ప్లా¯ŒSను విస్మరించిందని దుయ్యబట్టారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు బేబీరాణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ సేవలన్నీ ప్రైవేటీకరణ చెయ్యాలని యోచిస్తుందని, ముఖ్యంగా ఆరోగ్య సేవలను విస్మరించి కార్పొరేట్ వైద్యశాలలకు తోడ్పాటునందిస్తుందన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సీటీలో దళిత విద్యార్థి రోహిత్‌ది ఆత్మహత్యకాదని ,ముమ్మాటికి హత్యేనని, దీనిపై విచారణ చెయ్యకపోవడం దురదృష్టకరమన్నారు. అనంతరం బస్సు యాత్రకు సంఘీభావంగా తప్పెటగుళ్ల కళాకారుల నృత్య ప్రదర్శన అకట్టుకుంది .ఈ సభలో రైతు సంఘ రాష్ట్ర నాయకులు రావుల వెంక య్య, సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, బీసీ సంఘ నాయకులు పంపన రామకృష్ణ, తూతిక విశ్వనా«థ్, ఎస్సీ,ఎస్టీ సంఘ నాయకులు పాల్గొన్నారు. -
రైతు ద్రోహి చంద్రబాబు
– రైతు రక్షణ యాత్రలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి రామచంద్రయ్య ఆలూరు రూరల్/ ఆస్పరి: రైతు ద్రోహి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడని ఏపీ రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి రామచంద్రయ్య ధ్వజమెత్తారు. రైతు రక్షణ బస్సు యాత్ర ..శనివారం ఆస్పరి మండల కైరుప్పల, ఆలూరులో కొసాగింది. ఈ రైతు సంఘం నాయకులు ఉల్లి, వంకాయ కూరగాయలు దండలు వేసుకుని కైరుప్పలలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. బహిరంగ సభల్లో రామచంద్రయ్య మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు రుణ మాఫీ చేస్తానని చెప్పి రైతులను మోసం చేశారని విమర్శించారు. వేదావతి నదిపై ప్రాజెక్టు నిర్మిస్తానని హామీ ఇచ్చి మరిచారన్నారు. హంద్రీనీవా నీటితో చెరువులను నింపుతానని ప్రకటించి కరువొచ్చినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కరువు బారిన పడిన రైతులకు పరిహారం అందించడంలో విఫలమయ్యారన్నారు. రైతుల హక్కుల సాధన కోసం ఏపీ రైతుసంఘం ఆధ్వర్యంలో పత్తికొండ నుంచి విజయవాడ వరకు, అలాగే శ్రీకాకుళం జిల్లా నుంచి విజయవాడ వరకు రైతు రక్షణ యాత్ర పేరుతో బస్సుయాత్రను ప్రారంభించామన్నారు. రైతు రక్షణ యాత్రలో ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జగన్నాథం, సహాయ కార్యదర్శి గిడ్డయ్య, నియోజకవర్గ కార్యదర్శి జగదీష్, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు శివయ్య, ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు పాల్గొన్నారు. -
త్వరలో సీఎం కేసీఆర్ బస్సు యాత్ర
-
ముగిసిన టీపీఎఫ్ బస్సు యాత్ర
పట్టణంలో ర్యాలీ నిర్వహించిన నాయకులు నర్సంపేట : హరితహరం పేరుతో పోడు భూములను ఫారెస్టు అధికారులు లాక్కుం టున్నారని దీనిని నిరసిస్తూ టీపీఎఫ్ ఆధ్వర్యంలో బస్సు యాత్ర నిర్వహించడం జరిగిందని , శనివారంతో యాత్ర ముగిసిందని టీపీఎఫ్ ప్రధాన కార్యదర్శి మెంచు రమేష్ అన్నా రు. అనంతరం పట్టణంలోని అం»ే ద్కర్ సెంటర్ నుంచి వరంగల్ రోడ్డు కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ తెలంగాణ ప్రజాఫ్రంట్ ఆధ్వర్యంలో పోడు భూముల ఆక్రమణ నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 23న హన్మకొండ నుంచిlబయలుదేరిన బస్సు యాత్ర 5 రోజుల పాటు వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పెద్ద గూడూరు, పాకాల, కొత్తగూడ, ఇల్లం దు, గుండాల, టేకులపల్లి, కాచనపల్లి, కొత్తగూడెం, చంద్రుగొండ, మండలా ల్లో కొ నసాగిందన్నారు. హరితహారం పేరుతో ప్రభుత్వం సాగుచేసుకుంటు న్న పోడు భూములను గుంజుకుం టు న్న గ్రామాలను పర్యటించి ఆదివాసీ ప్రజలకు సమావేశాలు ఏర్పాటు చేసి, వారి పోరాటానికి సంఘీభావం తెలుపుతూ ప్రభుత్వం చేస్తున్న ్రçపజా వ్యతి రేక విధానాలను వివరించడం జరిగిందన్నారు. అనంతరం నర్సంపేటకు చే రుకుని ముగింపు ర్యాలీని పట్టణంలో ని అంబేద్కర్ సెంటర్ నుంచి అమరవీరుల స్థూపం వరకు కొనసాగించామన్నారు. కార్యక్రమంలో టీపీఎఫ్ నాయకులు సాయన్న, జనగాం కుమారస్వా మి, స్వప్న, నవీన్, గణేష్, శ్రీనివాస్, శాంత, వెంకన్న, సైదులు,యాదయ్య, శ్రీనివాస్,శాంత, వెంకన్న, సైదులు, మమత, యాకయ్య పాల్గొన్నారు. -
ప్రచార వేగాన్ని పెంచిన హిల్లరీ..
వాషింగ్టన్: డెమోక్రటిక్ పార్టీ తరపున ప్రెసిడెన్షియల్ నామినీ హిల్లరీ క్లింటన్ ప్రచార వేగాన్ని పెంచారు. తన వైస్ ప్రెసిడెంట్ క్యాండెట్, వర్జీనియా సెనెటర్ టిమ్ కెయినీతో కలిసి ఆమె మూడు రోజుల బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్నటువంటి ఒహియో, పెన్సుల్వేనియాలోని పలు ప్రాంతాల్లో.. సుమారు 600 మైళ్ళు వారి బస్సు యాత్ర కొనసాగనుంది. రాయల్ బ్లూ పెయింటింగ్‌తో ఉన్న బస్సుపై 'స్ట్రాంగర్ టుగెదర్' అనే స్లోగన్ ఆకట్టుకుంటోంది. వస్తుతయారీ పరిశ్రమకు సంబంధించిన ప్రజలను కలుసుకోబోతున్నామని హిల్లరీ ఈ సందర్భంగా వెల్లడించారు. ఉద్యోగాల కల్పనకు సంబంధించిన ప్రణాళికలతో పాటు.. మధ్యతరగతి ప్రజలను ఆకర్షించడం లక్ష్యంగా చేసుకొని ఈ పర్యటన జరుగుతోందని సీబీఎస్ మీడియా వెల్లడించింది. బస్సు యాత్రలో భాగంగా పిట్స్బర్గ్, ఓహియో, యంగ్స్టౌన్ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ర్యాలీలో హిల్లరీ పాల్గొంటారు. -
చేనేత సమస్యల పరిష్కారంలో సర్కార్ విఫలం
- చేనేత కార్మిక సంఘం విమర్శ - ఈ నెల 23 నుంచి బస్సు యాత్ర - జూలై 1న పోచంపల్లి సభతో యాత్ర ముగింపు సాక్షి, హైదరాబాద్: చేనేత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం ఈ రెండేళ్లలో చేసిందేమీ లేదని, చేనేత సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాష్ట్ర చేనేత కార్మిక సంఘం నాయకుడు టి.వెంకట్రాములు విమర్శించారు. చేనేత కార్మికులను చైతన్య పరిచి, సంఘటితం చేసేందుకు తెలంగాణ చేనేత అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ నెల 23 నుంచి జూలై 1 వరకు చేనేత బస్సుయాత్రను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో పి.లక్ష్మీనరసయ్య అధ్యక్షతన మంగళవారం జరిగిన చేనేత సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వెంకట్రాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయన్నారు. చేనేత సంక్షేమనిధి ఏర్పాటు చేస్తామని, నిపుణుల కమిటీ ద్వారా చేనేతరంగ అభివృద్ధికి చర్యలు చేపడతామని హామీనిచ్చిన సీఎం కేసీఆర్ ఈ రెండేళ్లలో వాటిని కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. చేనేతను జౌళిశాఖ నుంచి విడదీసి ప్రత్యేకంగా బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని కేసీఆర్ చేసిన వాగ్దానాలు ఇంతవర కు అమలుకు నోచుకోలేదన్నారు. చేనేత బస్సుయాత్ర షెడ్యూలిదీ ఈ నెల 23 నుంచి చేపట్టే చేనేత బస్సుయాత్ర షెడ్యూలును వెంకట్రాములు మీడియాకు వెల్లడించారు. ఈ నెల 23న మహబూబ్‌నగర్ జిల్లా రాజోలిలో బస్సు యాత్ర ప్రారంభమై రెండురోజుల పాటు అదే జిల్లాలో కొనసాగుతుంది. 25న మెదక్, 26, 27 తేదీల్లో కరీంనగర్, 28, 29 తేదీల్లో వరంగల్ జిల్లాల్లో యాత్ర కొనసాగుతుంది. ఈ నెల 30న నల్లగొండ జిల్లాలో ప్రవేశించి, జూలై 1న పోచంపల్లిలో నిర్వహించే బహిరంగసభతో బస్సుయాత్ర ముగుస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో పెండెం సర్వేశంను చేనేత సంఘ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో ఏశాల అశోక్, ఎం.జనార్దన్, ఎల్.యాదగిరి, జల్దిరాములు, సీహెచ్ ధనుంజయ్య తదితరులు పాల్గొన్నారు. -
నిజామాబాద్ జిల్లాకు నేడు సీఎం
♦ ఇందూరు నుంచే బస్సుయాత్రకు శ్రీకారం ♦ నేడు, రేపు రెండు రోజులు జిల్లాలో పర్యటన సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిజామాబాద్ జిల్లా నుంచి బస్సుయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం జిల్లాల్లో బస్సుయాత్ర చేయనున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్... శుక్రవారం మధ్యాహ్నమే జిల్లాకేంద్రానికి చేరుకుని, నిజామాబాద్ మండలం నర్సింగ్‌పల్లిలో శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి బయలు దేరి మాక్లూరు మండల కేంద్రంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త నూతన గృహ ప్రవేశం కార్యక్రమానికి హాజరవుతారు. అక్కడి నుంచి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకోనున్న సీఎం, ఆయన కుమార్తె నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఇంటికి వెళ్లి అరగంట అక్కడే గడపనున్నారు. అనంతరం జెడ్పీ సమావేశ మందిరంలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కరువు పరిస్థితులు, తాగునీటి ఎద్దడిపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సమీక్ష తర్వాత బాన్సువాడకు వెళ్లి అక్కడ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో రాత్రి బస చేస్తారు. శనివారం ఉదయం బీర్కూరు మండలం తిమ్మాపూర్ గుట్టలపై మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన తెలంగాణ తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించి సీఎం కేసీఆర్ పూజలు చేయనున్నారు. అక్కడి నుంచి బయలుదేరి మెదక్ జిల్లా ఎర్రపల్లికి చేరుకుంటారు. సీఎం కేసీఆర్ రెండు రోజుల పర్యటన సందర్భంగా అధికారయంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. -
రోహిత్ చట్టాన్ని సాధిస్తాం
హైదరాబాద్: రోహిత్ వేముల ఆశయాల సాధనకు చేపట్టిన ఉద్యమాన్ని పక్కదోవ పట్టించేందుకు కేంద్రం పన్నుతున్న కుట్రలను ఛేదిస్తామని, రోహిత్ చట్టాన్ని సాధిస్తామని పలువురు వక్తలు పేర్కొన్నారు. బుధవారం హెచ్‌సీయూ విద్యార్థుల బస్సుయాత్ర ముగింపు సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదుట బహిరంగ సభ నిర్వహించారు. భాస్కర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం హిందూ దేశంగా మార్చే ప్రయత్నాన్ని మానుకోవాలన్నారు. ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ సూచనల మేరకే పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠినంగా శిక్షించే వరకు ఉద్యమం ఆగదని ప్రొఫెసర్ కంచ ఐలయ్య అన్నారు. రోహిత్ ఘటనపై చర్చ జరగకుండా అడ్డుకునే కుట్రలో భాగంగానే జెఎన్యూలో కన్హయ్యపై దేశద్రోహ నేరం మోపారని మల్లెపల్లి లక్ష్మయ్య ఆరోపించారు. ఎన్ని అడ్డంకులెదురైనా రోహిత్ చట్టం వచ్చేవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్‌సీయూ విద్యార్థి జేఏసీ నాయకులు జోహెల్ అన్నారు. రోహిత్‌కు జరిగిన అన్యాయంపై యువకులు, విద్యార్థులు ఆగ్రహావేశాలతో ఉన్నారని కన్వీనర్ వెంకటేశ్ చౌహాన్ తెలిపారు. ఏబీవీపీ విద్యార్థులు శూలాలతో ప్రదర్శనలు చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం, కులవివక్షపై పోరాడుతున్న విద్యార్థులను దేశద్రోహులుగా చిత్రీకరిస్తోందని ఓయూ జేఏసీ నాయకులు దుర్గం భాస్కర్ ఆరోపించారు. డీఎస్ఎస్ అధ్యక్షురాలు గెడ్డం ఝాన్సీ, జమాతే ముస్లిం నాయకులు షబ్బీర్, మాల సంక్షేమ సంఘం నాయకులు రాంప్రసాద్, ఎస్ఎఫ్ఐ నాయకులు సాంబశివ, పిడిఎస్యు నాయకులు రాము, సత్య కార్యక్రమంలో పాల్గొన్నారు. విచారణ తేదీలను మార్చాలని వినతి రోహిత్ ఘటనపై నియమించిన ఏకసభ్య కమిషన్ విచారణ తేదీని ఈ నెల 27కు మార్చాలని హెచ్‌సీయూ సామాజిక న్యాయపోరాట విద్యార్థి జేఏసీ కమిషన్‌కు లేఖ రాసింది. ఈ నెల 23న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నందున తేదీల్లో మార్పు చేయాలని కోరుతూ జేఏసీ నాయకులు మున్న, ఫిరదౌస్ సోనీ, జుహైల్, సంజయ్, ధనుంజయ్ ఒక ప్రకటన విడుదల చేశారు. విచారణను యుజీసీ ప్రాంతీయ కార్యాలయంలో కాకుండా హెచ్‌సీయూలో నిర్వహించాలని వారు కోరారు. హెచ్‌సియు బంద్‌కు పిలుపు జేఎన్‌యూ ఉపాధ్యాయులు, విద్యార్థుల పిలుపు మేరకు విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతున్న వివక్షకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న బంద్‌లో పాల్గొనాలని హెచ్‌సియు విద్యార్థి జేఏసీ నాయకులు పేర్కొన్నారు. వర్సిటీల్లో ఫాసిస్టు దాడులను వ్యతిరేకిస్తూ జరిగే బంద్ లో విద్యార్థులంతా పాల్గొనాలని కోరారు. గురువారం ఉదయం 9 గంటలకు లైఫ్ సెన్సైస్ బిల్డింగ్ దగ్గర బంద్ కార్యక్రమం ప్రారంభం అవుతుందని తెలిపారు. -
సీమద్రోహి చంద్రబాబు: బైరెడ్డి
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాయలసీమ ద్రోహి అని రాయలసీమ పరిరక్షణ సమితి(ఆర్పీఎస్) అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆరోపించారు. ప్రత్యేక రాయలసీమ రాష్ట్రమే లక్ష్యంగా ఆదివారం..కర్నూలు జిల్లా ఆలూరు మండలం మూసానహళ్లి గ్రామం నుంచి రాయలసీమ చైతన్య బస్సు యాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయలసీమ జిల్లాల అభివద్ధిని చంద్రబాబు మరిచిపోయారన్నారు. సీమవాసి అయినప్పటికీ కోస్తా జిల్లాలపై ప్రేమ చూపుతున్నారన్నారు. సీమలో కష్ణా, పెన్నా, తుంగభద్ర నదులు పారుతున్నా.. ఇక్కడి ప్రజలకు తాగు, సాగునీరు అందడం లేదన్నారు. సీమ జిల్లాల్లో పేదరికం, నిరుద్యోగ సమస్య మున్ముందు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని బైరెడ్డి అన్నారు. ఉన్నత చదువులు చదివిన ఎంతోమంది నిరుద్యోగులు ‘ఉపాధి’పనులకు వెళ్తున్నారన్నారు. రాజధాని అమరావతి జపం చేస్తూ సీమ జిల్లాలను సీఎం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. కనీసం వర్షపాతం లేకపోవడంతో పంటల సాగు కోసం చేసిన అప్పులు తీర్చే దారిలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పటికీ.. ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. అంతకముందు గ్రామానికి చేరుకున్న బెరైడ్డి రాజశేఖర్‌రెడ్డికి గ్రామ సర్పంచ్ సోమశేఖర్, ప్రజలు పెద్ద సంఖ్యలో స్వాగతం తెలిపారు. జై రాయలసీమ అంటూ నినాదాలు చేశారు. -
23న హెచ్‌సీయూ విద్యార్థుల చలో ఢిల్లీ
- 11 నుంచి తెలంగాణ, ఏపీల్లో బస్సు యాత్ర - కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన కార్యక్రమాలు హైదరాబాద్: హెచ్‌సీయూలో రోహిత్ ఆత్మహత్య ఘటనపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా విద్యార్థులు మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా చలో ఢిల్లీ కార్యక్రమంతోపాటు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో బస్సు యాత్రలు చేపట్టాలని నిర్ణయించారు. అయితే తొలుత పేర్కొన్నట్లుగా చలో ఢిల్లీని ఈ నెల 20కి బదులుగా 23వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు విద్యార్థి జేఏసీ నాయకులు సోమవారం ప్రకటించారు. దీంతోపాటు పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో పలు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జేఏసీ కన్వీనర్ వెంకటేశ్ చౌహన్ చెప్పారు. దేశవ్యాప్తంగా కదిలి వచ్చే విద్యార్థులతో మూడు రోజుల పాటు ఆందోళనలు చేపడతామన్నారు. ఇక ఈనెల 11వ తేదీ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బస్సు యాత్ర చేపడతామని తెలిపారు. ఈ యాత్రలో భాగంగా వారం రోజుల పాటు ఉస్మానియా, కాకతీయ, మహత్మా గాంధీ, శాతవాహన, తెలంగాణ, ఆంధ్రా, ఎస్వీ, నాగార్జున, పద్మావతి, జేఎన్టీయూ, ద్రావిడ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలతో పాటు ప్రధాన విద్యాసంస్థలకు వెళ్లనున్నట్లు చెప్పారు. రిలే దీక్షలలో బిహార్ విద్యార్థులు రోహిత్ ఘటనకు సంఘీభావంగా హెచ్‌సీయూలో బిహార్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు రిలే నిరాహార దీక్షలలో పాల్గొన్నారు. ఈ విద్యార్థులకు ఉస్మానియా విద్యార్థి జేఏసీ నాయకులు, మధ్యప్రదేశ్ గిరిజన సంఘాల నాయకులు సంఘీభావం ప్రకటించారు. దీక్షలో జిక్రుల్లాఖాన్, విషాల్ కుమార్, జితేంద్ర కుమార్, కుమార్ సౌరభ్, ఆశుతోష్ పాండే, ఫైజుల్ ఇస్లాం, మృత్యుంజయ్ పాండే, దివాకర్ ఉపాధ్యాయ తదితరులు పాల్గొన్నారు. -
రోహిత్ ఘటనపై 20న చలో ఢిల్లీ
♦ 8 నుంచి తెలుగు రాష్ట్రాల్లో బస్సు యాత్ర ♦ ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన జేఏసీ నాయకులు హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్డీ విద్యార్థి రోహిత్ వేముల మృతి ఘటనపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 20న చలో ఢిల్లీ కార్యక్రమానికి విద్యార్థి జేఏసీ పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. హెచ్‌సీయూలోని బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించిన జేఏసీ నాయకులు ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ వెంకటేష్ చౌహాన్ మాట్లాడుతూ రోహిత్ ఘటనకు కారుకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేస్తున్నా.. కేంద్రం స్పందించకపోవడం ఆవేదన కలిగించిందన్నారు. కేంద్రమంత్రులు దత్తాత్రేయ, స్మృతీఇరానీ, వీసీ అప్పారావులపై చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ చలో ఢిల్లీకి పూనుకున్నామన్నారు. ఢిల్లీలో అన్ని వర్సిటీల విద్యార్థులతో నాలుగు రోజులు ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ నెల 8 నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వర్సిటీల్లో బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 5న ప్రత్యేక సమావేశం, 6న హెచ్‌సీయూలో రౌండ్ టేబుల్ సమావేశం, పబ్లిక్ మీటింగ్ ఉంటుందని చెప్పారు. ముఖ్య వక్తలుగా ఆలిండియా ఫోరం ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్ సభ్యులు ప్రొఫెసర్ అనిల్ సద్గోపాల్, రమేష్ పట్నాయక్, తెలంగాణ సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ ప్రతినిధులు ప్రొఫెసర్ జగేంద్రబాబు, చక్రధర్రావులతో పాటు పలువురు ప్రసంగిస్తారని చెప్పారు. రిలే నిరాహారదీక్షలు నిరంతరాయంగా కొనసాగుతాయని వెల్లడించారు. కొనసాగుతున్న రిలే దీక్షలు.. రోహిత్ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హెచ్‌సీయూలో విద్యార్థుల రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. దీక్షల్లో విద్యార్థులు ప్రకాష్, సందీప్ కాంబ్లే, రాహుల్, తుషార్ గాడ్గే, యోగేష్ పాల్గొన్నారు. పరిపాలనకు, తరగతులకు అంతరాయం కలగకుండా సాయంత్రం వేళల్లో జేఏసీ ప్రతినిధులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. -
బెజవాడకు ఐఏఎస్ అధికారుల బస్సుయాత్ర
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు న్యూ ఇయర్ విషెస్ తెలిపేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారుల బృందం శుక్రవారం మధ్యాహ్నం విజయవాడకు బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో అధికారుల బృందం పయనమయ్యారు. సాయంత్రం బాబును కలిసి అధికారులు శుభాకాంక్షలు తెలపనున్నారు. ఈ బృందంలో జేపీ శర్మ, ఎల్వీ సుబ్రమణ్యం, సిసోడియా, రవిచంద్ర, లింగరాజ్ పాణి గ్రహి, అశోక్‌తో పాటు పలువురు అధికారులు ఉన్నారు. -
బెజవాడకు ఐఏఎస్ అధికారుల బస్సుయాత్ర
-
పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం
- వామపక్ష పార్టీల నేతలు హన్మకొండ : గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికులు, గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉద్యోగులకు అండగా వామపక్షాలు నిలుస్తాయని, పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని వామపక్ష నాయకులు అన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పది వామ పక్ష పార్టీలు చేపట్టిన బస్సు యాత్ర మంగళవారం హన్మకొండకు చేరుకొంది. ఈ సందర్భంగా హన్మకొండలోని ఏకశిల పార్కులో బహిరంగ సభ జరిగింది. ఈ సభలో సీపీఐ శాసన సభ పక్షనేత ఆర్.రవీందర్‌కుమార్ నాయక్, సీపీఎం శాసనసభ పక్షనేత సున్నం రాజయ్య మాట్లాడారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా వచ్చే అసెంబ్లీ సమావేశాలను జరుగనివ్వబోమని హెచ్చరించారు. సీఎం కే సీఆర్ విభజించి పాలించు అన్నట్లుగా కార్మికుల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రానున్నందున అక్కడ పని చేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచి తెలంగాణలోని ఇతర జిల్లాల కార్మికుల సమస్యలను విస్మరించారని మండిపడ్డారు. కార్మికులకు కమ్యూనిస్టులు అండగా నిలిస్తే ఆంధ్రా పార్టీలని చెప్పడం విడ్డూరంగా ఉందని, కమ్యూనిస్టులు పుట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. 2001లో పార్టీ పెట్టిన కేసీఆర్‌కు ఎర్ర జెండా పార్టీలను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. కేసీఆర్‌కు కార్మికుల పట్ల కనికరం లేదన్నారు. కార్మికులు భయపడొద్దని పది వామపక్ష పార్టీలు, ప్రజా సంఘా లు అండగా ఉంటాయని అన్నారు. సీపీఎం జిల్లా కార్యాదర్శి సారంపల్లి వాసుదేవరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో న్యూ డెమొక్రసీ నాయకుడు రాయ చంద్రశేఖర్‌రావు, ఎంసీపీఐ నాయకుడు మహమ్మద్ గౌస్, ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడు ఈసంపల్లి వేణు, తెలంగాణ ఎమ్మార్పీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బొట్ల బిక్షపతి, వామపక్ష పార్టీల నాయకులు పోతినేని సుదర్శన్, గాదగోని రవి, సంపత్‌రావు, ఎం.చుక్కయ్య, పోతరాజు సారయ్య, దుబ్బ శ్రీనివాస్, సిరిబోయిన కరుణాకర్, టి.ఉప్పలయ్య, రాగుల రమేష్ పాల్గొన్నారు. -
జగన్‌ను కలిసిన రైతు నాయకులు
తిరుపతి మంగళం : రాష్ట్రంలోని ప్రాజెక్టులను పరిశీలించేందుకు బస్సుయాత్రను చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్రెడ్డిని శనివారం పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో పాటు పార్టీ రైతువిభాగం జిల్లా అధ్యక్షుడు టి.ఆదికేశవులురెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం.కొండ్రెడ్డి, హరీష్‌కుమార్ కలిసి జిల్లాలోని రైతుల సమస్యలను వివరించారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టేందుకు తమ పార్టీ అధ్యక్షుడు చేస్తున్న బస్సుయాత్రకు విశేష స్పందన లభిస్తోందని వారు అన్నారు. -
ఇదో ముడుపు కథ
పట్టిసీమలో రూ. 300 కోట్ల కోసం చంద్రబాబు పోలవరాన్ని పణంగా పెట్టారు సీఎంపై వైఎస్ జగన్ ధ్వజం బస్సు యాత్రలో ప్రకాశం బ్యారేజీ, వెలిగొండ టన్నెల్ సందర్శన ► తమ కాంట్రాక్టర్లే అర్హత సాధించేలా టెండరు నిబంధనలు మార్చారు ► వారు 21.9 శాతం అధికంగా టెండర్లు వేసినా బాబు వంతపాడారు ► ఐదు శాతం అధికమని.. 16.9 శాతం బోనస్‌గా ఇస్తామని చెప్తున్నారు ► పట్టిసీమపై ఉన్న ప్రేమ వెలిగొండపై ఉంటే అది ఈ ఏడాది పూర్తయ్యేదే ► పట్టిసీమకు అవసరమయ్యే నిధులతో వెలిగొండ ప్రాజెక్టు పూర్తవుతుంది ► రూ. 1,650 కోట్లు అవసరమైతే.. బడ్జెట్లో కేటాయించింది రూ. 150 కోట్లు ► రాయలసీమకు నీళ్లివ్వటానికే పట్టిసీమ అనే చంద్రబాబు మాట బూటకం ► సీమపై అంత ప్రేమ ఉంటే.. హంద్రీ - నీవా, గాలేరి - నగరి ప్రాజెక్టులను ► పూర్తిచేసేందుకు చర్యలేవీ? బడ్జెట్లో నిధుల కేటాయింపులేవీ? ► పోతిరెడ్డిపాడు కింద పనులు పూర్తిచేయడానికి నిధుల కేటాయింపులేవీ? ► అసలు పట్టిసీమ ప్రాజెక్టు జీవోలో రాయలసీమ ఊసు ఎక్కడ? ► అసలు ఆ ప్రాజెక్టుకు బడ్జెట్లో నిధుల కేటాయింపులూ చేయలేదు? ► అంటే ఇతర ప్రాజెక్టులకు కేటాయింపుల్లో కోత పెట్టటం ఖాయమే కదా! ► చంద్రబాబుకు గుణపాఠం చెప్పేందుకు కలిసి పోరాటం చేద్దాం విజయవాడ/వెలిగొండ: పట్టిసీమ ప్రాజెక్టు పేరుతో కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని నిబంధనలనూ తుంగలో తొక్కారని.. ఈ ప్రక్రియలో బాబుకు రూ. 300 కోట్ల ముడుపులు చేతులు మారాయని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపించారు. ముడుపుల కోసం పోలవరం ప్రాజెక్టును సైతం పణంగా పెడుతున్నారని.. రైతుల ప్రయోజనాలను దారుణంగా దెబ్బతీస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబుది మోసపూరిత విధాన మని మండిపడ్డారు. వెలుగొండ ప్రాజెక్టుపై మొదటి నుంచీ ఆయనది దొంగాటేనని విమర్శించారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే 4.50 లక్షల ఎకరాలకు సమృద్ధిగా సాగునీరందుతుందని తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగానే ప్రాజెక్టుపై నిర్లక్ష్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రాజెక్టుల బాటలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలిసి గురువారం కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య విజయవాడ వద్ద ప్రకాశం బ్యారేజీని పరిశీలించారు. ఇక్కడ నీటి నిల్వలకు సంబంధించిన సాంకేతిక అంశాలను నీటిపారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్యారేజీ మీద తన కోసం వచ్చిన జనాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాత్రి ప్రకాశం జిల్లాలో వెలిగొండ టన్నెల్‌ను సందర్శించారు. టన్నెల్ లోపలికి ట్రాలీలో వెళ్లి నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం సమీపంలో ఆ ప్రాంత రైతులతో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో జగన్ ప్రసంగించారు. ఉప్పొంగే జీవజలాలు.. ఉప్పుసముద్రం పాలు.. వర్షపు నీటినీ, వరద నీటినీ నిల్వ చేసుకునే సామర్థ్యం లేకనే ఉప్పొంగే జీవజలాలు సముద్రం పాలవుతున్నాయని జగన్ ఆవేదన వ్యక్తంచేశారు. ఏటా 290 టీఎంసీల నీరు వృధాగా సాగరంలో కలసిపోతోందన్నారు. దీన్ని నివారించి నీటిని సమర్థంగా నిల్వ చేసుకునే దిశగా దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్టుకు ఆనాడు శ్రీకారం చుట్టారని వివరించారు. అది పూర్తయితే 194 టీఎంసీల నీటిని మనం నిల్వ చేసుకోగలుగుతామన్నారు. అన్ని ప్రాంతాలను సశ్యశ్యామలం చేసే పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు కోల్డ్ స్టోరేజ్‌లో పడేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పులిచింతలకు చంద్రబాబు తొమ్మిదేళ్ళ తన హయాంలో కేవలం రూ. 24 కోట్లు మాత్రమే కేటాయించగా... తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ దాని ప్రాధాన్యతను గుర్తించి తన హయాంలో 90 శాతం పూర్తిచేశారన్నారు. మిగిలిన పది శాతాన్ని పూర్తి చేసేందుకు రూ. 290 కోట్లు అవసరమవుతాయనీ, బాబు దానికి రూ. 20 కోట్లు మాత్రమే కేటాయించారంటే బాబు చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చన్నారు. పులిచింతల పూర్తయితే 40 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యం మన రాష్ట్రానికి లభిస్తుందన్నారు. కమీషన్ల కోసమే పట్టిసీమపై బాబు పట్టు... వాటిని విస్మరించి కేవలం కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్ల కోసమే పట్టిసీమ ప్రాజెక్టును చంద్రబాబు తెరమీదకు తెచ్చారని జగన్ ధ్వజమెత్తారు. దీని కోసం రైతాంగాన్నీ, రాష్ట్రాన్నీ హోల్‌సేల్‌గా అమ్మేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. పట్టిసీమ ప్రాజె క్టు టెండర్ల నిబంధనలలో తమకు అత్యంత కావలసిన రెండు కాం ట్రాక్టు సంస్థలకు మాత్రమే అనుకూలంగా ఉండేలా నిబంధనలను మార్చారని తూర్పారబట్టారు. అంచనా విలువ కంటే 21.9% ఎక్కువకు టెండరు కోట్ చేయడం, ఏడాదిలో ప్రాజెక్టులో పూర్తి చేస్తే 16.9 శాతాన్ని బోనస్‌గా చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటన చేయడంలో 300 కోట్ల కుంభకోణం దాగి ఉందని ఆరోపించారు. పట్టిసీమ ద్వారా పోలవరం కుడికాల్వకు చుక్కనీరు మళ్లించకుండానే.. ఎగువ రాష్ట్రాలకు కృష్ణా జలాల్లో మన వాటాను కోల్పోయేప్రమాదం కూడా ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. పట్టిసీమపై ఉన్న ప్రేమ వెలిగొండపై లేదేమి? ‘‘పట్టిసీమ నిర్మాణానికి ఎన్ని నిధులు ఖర్చవుతాయో అంతే మొత్తం వెలిగొండ పూర్తి కావడానికి అవసరమవుతాయి. కానీ చంద్రబాబు ఏ మాత్రం ఈ ప్రాజెక్టుపై శ్రద్ధ చూపడం లేదు. వెలిగొండ పూర్తి కావడానికి ఇంకా రూ. 1,650 కోట్లు అవసరమైతే ఈ బడ్జెట్లో ఆయన కేటాయించింది కేవలం రూ. 150 కోట్లు మాత్రమే. ఇలా నిధులు కేటాయిస్తే ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుంది?’’ అని సూటిగా ప్రశ్నించారు. ‘‘వెలిగొండ నిర్మాణం పూర్తయితే 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాల్లోని 15 లక్షల మంది ప్రజలకు తాగునీరు కూడా లభిస్తుంది. అలాంటి బృహత్తరమైన ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తూ.. ఇంకా తనకు ఇక్కడి ప్రజలపై ప్రేమ ఉందని చంద్రబాబు చెబుతారు’’ అని ఆయన విమర్శించారు. 1996లో ఎన్నికలొచ్చినపుడు అపుడు సీఎంగా ఉన్న చంద్రబాబు ఇదే వెలిగొండ ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేశారని, ఎన్నికలయ్యాక దానిని మరచిపోయారని, మొత్తం ఆయన తొమ్మిదేళ్ల పాలనలో వెలిగొండకు కేటాయించిన మొత్తం కేవలం రూ.13.5 కోట్లు మాత్రమేనని జగన్ తూర్పారబట్టారు. వైఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఐదేళ్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 3,000 కోట్లు కేటాయించారని, ఆయన చేసిన కేటాయింపుల వల్లనే ఇపుడు ఇక్కడ పనులు జరుగుతున్నాయని జగన్ గుర్తుచేశారు. సీమపై బాబు కపట ప్రేమ... రాయలసీమపై చంద్రబాబు కపట ప్రేమ ఒలక బోస్తున్నారని.. రాయలసీమకు నీళ్లివ్వడానికే పట్టిసీమ అని ఓ వైపు చెబుతూ అక్కడికి నీళ్లు తీసుకువెళ్లే హంద్రీ - నీవా, గాలేరు - నగరి ప్రాజెక్టులకు అరకొర మొత్తాలను మాత్రమే బడ్జెట్లో కేటాయించారని జగన్ ఎండగట్టారు. ‘‘రాయలసీమ మీద ప్రేమ ఒలగబోస్తున్న చంద్రబాబు గతంలో తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసినప్పుడు హంద్రీ - నీవాకు కేటాయించింది రూ. 13 కోట్లే. దాని అంచనా వ్యయం రూ. 6,850 కోట్లు. బాబుకు సీమ మీద అంత ప్రేమ ఉంటే కనీస సంవత్సరానికి రూ. 2 కోట్లు కూడా ఎందుకు ఇవ్వలేదు? మహానేత రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత హంద్రీనీవాకు రూ. 4,000 కోట్లు ఖర్చు చేశారు. పాక్షికంగా పూర్తయిన ప్రాజెక్టు ద్వారా కొంత మేర నీళ్లిస్తున్నారు. ఇప్పుడు బాబు వచ్చి హంద్రీ - నీవా కుళాయి తిప్పి ఆ ఘనత అంతా తనదే అని గొప్పగా చెప్పుకుంటున్నారు. ప్రాజెక్టు పూర్తి చేయడానికి మరో రూ. 1,100 కోట్లు అవసరమైతే.. ఈ ఏడాది బడ్జెట్లో ఇచ్చింది రూ. 200 కోట్లే’’ అని ఎద్దేవా చేశారు. ‘‘గాలేరు - నగరి పరిస్థితి కూడా అంతే. అంచనా వ్యయం రూ. 7,200 కోట్లు అయితే బాబు ప్రభుత్వంలో 9 సంవత్సరాలకు గాను రూ. 17 కోట్లు కేటాయించారు. అంటే.. జీతభత్యాలకూ సరిపోని పరిస్థితి. వైఎస్ హయాంలో దాదాపు రూ. 4,000 కోట్లు ఖర్చుచేశారు. ఇప్పుడు బడ్జెట్లో బాబు చేసిన కేటాయింపులు రూ. 169 కోట్లే. ఇలా చేస్తూ పోతే.. గాలేరు నగరి ఎప్పుడు పూర్తయ్యేను?’’ అని నిలదీశారు. బాబు చెప్పేవన్నీ అబద్ధాలే... చంద్రబాబు చెప్పేదొకటి, చేసేది మరొకటి అని జగన్ విమర్శించారు. రైతు రుణాలు మాఫీ చేసేసినట్లుగా చెప్తున్నారని కానీ రైతుల రుణాలపై వడ్డీ కూడా మాఫీ కాలేదనేది వాస్తవమని పేర్కొన్నారు. డ్వాక్రా మహిళల రుణాల విషయంలో కూడా అంతేజరిగిందన్నారు. రాయలసీమ విషయంలో కూడా అంతేనని పోతిరెడ్డిపాడు కింద ఉన్న పథకాలకు అరకొర నిధులు కేటాయించి అవి పూర్తికాకుండా ఎలా నీరిస్తారని ఆయన ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు నుంచి నీరు రావాలంటే శ్రీశైలం రిజర్వాయరులో 854 అడుగు మేరకు నీటిమట్టం ఉండాలని, కానీ చంద్రబాబు గద్దెనెక్కిన తొలి ఏడాదిలో ఆ మట్టం 803 అడుగులకు తగ్గిపోయిందని జగన్ విమర్శించారు. ‘‘ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంత ప్రజలు నీళ్లు లేక ఎన్ని అవస్థలు పడుతున్నామన్న సంగతి మనకన్నా ఎక్కువగా మరెవరికీ తెలియదు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మన గోడు ఏమాత్రం వినిపించడం లేదు. ఆయనకు ఎంతసేపు కాంట్రాక్టర్లు, కమీషన్లు తప్ప మరేమీ కనిపించడం లేదు’’ అని దుయ్యబట్టారు. ఈ పరిస్థితుల నుంచి గోదావరి డెల్టా రైతులను రక్షించడం, వెలుగొండ ప్రాజెక్టు సాధనకు పోరాటం చేయడం అవసరమన్నారు. ఇందుకోసం కలిసికట్టుగా ఉద్యమిద్దామని, రానున్న రోజుల్లో మరింత గట్టిగా ప్రభుత్వంపై పోరాటం చేద్దామని జగన్మోహన్రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. అవధుల్లేని అభిమానం వెలుగొండ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అలుపెరగని అభిమానం గంటల కొద్దీ పరుగులు తీసింది. ‘అన్నా...జగనన్నా’ అంటూ.. వైఎస్సార్సీపీ అధినేత వెంట అభిమానులు, కార్యకర్తలు కిలోమీటర్ల కొద్దీ ఉప్పొంగిన ఉత్సాహంతో వెన్నంటి నడిచారు. గురువారం ఉదయం 10 గంటలకు విజయవాడ నుంచి మొదలైన రెండో రోజు బస్సుయాత్ర రాత్రి 9 గంటల వరకు జనం మధ్యనే సాగింది. ఉదయం 10 గంటలకు పార్టీ ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రకాశం బ్యారేజీకి చేరుకున్న వైఎస్ జగన్ అక్కడున్న ఈఈ రవికుమార్, మరో ఇద్దరు నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడారు. బ్యారేజీ నిల్వ సామర్థ్యం, ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లోల గురించి, ఏడాదికి ఎంత నీరు సముద్రంలో కలుస్తున్నదీ ప్రశ్నించారు. అక్కడి నుంచి రోడ్డుమార్గాన ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టుకు బయలుదేరారు. ఆయన కాన్వాయ్ కోటప్పకొండకు చేరగానే జోరున వర్షం మొదలైంది. పెట్టూరివారిపాలేం గ్రామానికి చెందిన మహిళలు జోరున కురిసే వర్షంలో తడుస్తూ నిలబడటం చూసి జగన్ వారిని పలకరించారు. కుంట, దోర్నాలల్లో 20 వేల మందికి పైగా రైతులు, అభిమానులు 3 గంటల పాటు రాజన్నబిడ్డ కోసం ఎదురు చూశారు. జగన్ వెంట ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, పాలపర్తి డేవిడ్‌రాజు, ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర, జిల్లా నేతలు ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, సుబ్బారెడ్డి, జంకే వెంకటరెడ్డి, బత్తుల బ్రహ్మానందరెడ్డి ఉన్నారు. పట్టిసీమ జీవోలో సీమ పేరెక్కడ? పట్టిసీమ నిర్మాణానికి జారీ అయిన జీవోలో కూడా ఎక్కడా రాయలసీమకు నీళ్లివ్వడానికే ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు పేర్కొనలేదని జగన్ గుర్తుచేశారు. గోదావరి నుంచి కృష్ణా నదిలోకి నీటిని తెస్తే వాటిని నిలువ చేసుకునే సామర్థ్యం ఎక్కడుందని ఆయన సూటిగా ప్రశ్నించారు. గోదావరి, కృష్ణా ప్రాజెక్టుల వద్ద పనిచేస్తున్న ఇంజనీర్లతో తాను మాట్లాడినపుడు ఏడాదికి రెండు చోట్లా 60 నుంచి 80 రోజుల పాటు దాదాపు ఒకే సమయంలో వరదలు వస్తాయని చెప్పారని ఆయన పేర్కొన్నారు. ‘‘అంటే దీనర్థం అక్కడి నీళ్లు ఇక్కడికి తెచ్చి సముద్రంలోకి వదలి వేయడమే కదా?’’ అని జగన్ ప్రశ్నించారు. పోలవరాన్ని పక్కనబెట్టి నిర్మించ తలపెట్టిన పట్టిసీమకు అయ్యే రూ. 1,300 కోట్లు నిధులు వెలిగొండకు ఇస్తే ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుందన్నారు. పైగా పట్టిసీమకు బడ్జెట్లో కేటాయింపులు జరగలేదని, దీనర్థం రాబోయే రోజుల్లో ఇతర ప్రాజెక్టులకు కేటాయించిన నిధుల్లో కోత వేయడమేనని పేర్కొన్నారు. -
మీ కోసం ఎందాకైనా
‘పట్టిసీమ’పై పొలికేక - గోదావరి జిల్లాల రైతులకు వైఎస్ జగన్ భరోసా - పట్టిసీమపై పోరాడదాం - పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జాప్యంపై నిలదీద్దాం - పెండింగ్ ప్రాజెక్టులపై సమరభేరి మోగిద్దాం - గోదావరి జిల్లాల పర్యటనలో వైఎస్ జగన్ పిలుపు - అడుగడుగునా జన నీరాజనం - తొలిరోజు బస్సుయాత్ర విజయవంతం సాక్షి ప్రతినిధి, ఏలూరు :గోదావరి జిల్లాల ప్రజలు, రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ఎన్నిపోరాటాలకైనా సిద్ధమని వైఎస్సార్ సీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. రైతుల కోసం ఎందాకైనా, దేనికైనా సిద్ధమని ఆయన ప్రకటించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టులో అవినీతిని ఎండగట్టేందుకు చేపట్టిన ‘ప్రాజెక్టుల సందర్శన బస్సుయాత్ర’ తొలి రోజైన బుధవారం ఉభయగోదావరి జిల్లాల్లో జయప్రదమైంది. హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి ఉదయం 10 గంటలకు రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జగన్ అక్కడి నుంచి బస్సుయాత్ర ప్రారంభించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలతో కలసి ఆయన ధవళేశ్వరం ఆనకట్టను సందర్శించారు. అనంతరం విజ్జేశ్వరం వద్ద జిల్లాలోకి ప్రవేశించారు. అక్కడ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో నాయకులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి గోదావరి గట్టు వెంబడి బస్సుయాత్ర నిర్వహించిన జగన్‌కు జిల్లా ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పట్టారు. ఎక్కడికక్కడ రైతులు వేలాదిగా పాల్గొన్నారు. గ్రామగ్రామాన వేచివున్న జనం పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకునే వరకూ ప్రతి గ్రామంలోనూ జగన్ కోసం ప్రజ లు వేచి చూడటంతో ఆయన ఎక్కడికక్కడ బస్సు నిలిపి వారిని పలకరించారు. వారి సమస్యలు వింటూ ముందుకు సాగారు. యాత్ర ఆలస్యమవుతున్నా లెక్కచేయక ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ ముందుకు వెళ్లడంతో పోలవరానికి చేరుకునేటప్పటికి సాయంత్రం 4 గంటలు దాటింది. పోలవరం ప్రాజెక్టు వ్యూ పాయింట్ వద్ద ప్రాజెక్టు నిర్మాణం ఎంతవరకు వచ్చిందని ఇంజినీర్ల నుంచి ఆరా తీశారు. పోలవరం నిర్వాసితులకు లక్షన్నర పరిహారం ఇచ్చేందుకు ఏళ్లు గడుస్తున్నా ముందుకురాని సర్కారు పట్టిసీమ ప్రాజెక్టుతో భూములు కోల్పోయే రైతులకు 19.50 లక్షలు ఎలా ఇస్తామంటోం దని నిలదీశారు. వైఎస్ జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అధికారులు నీళ్లు నమిలారు. అక్కడి నుంచి పట్టిసీమ ఎత్తిపోతల నిర్మాణ ప్రాంతానికి వెళ్లి పనులను పరిశీలించారు. సర్కారుపై సమరభేరి అనంతరం పట్టిసీమలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో రైతులతోనే జగన్ మాట్లాడించారు. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులపై రైతుల అభిప్రాయాలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం ప్రభుత్వంపై రాజీ లేని పోరాటం చేస్తామని ప్రకటించారు. పోల వరం ప్రాజెక్టు పూర్తిచేసే వరకూ అడుగడుగునా ఉద్యమం చేయడానికి వెనుకాడేది లేదన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలుపుదల చేసి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంలో జిల్లా ప్రజలు చేసే ఉద్యమాలకు తమ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలుపుదల చేయిం చడానికి చేసే పోరాటంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని, జిల్లా ప్రజలతో కలిసి ఉద్యమాలు చేస్తామని అన్నారు. రాష్ట్రం లోని అన్ని జిల్లాలను, అన్ని ప్రాంతాలను సస్యశ్యామలం చేసే బృహత్తర పథకం పోలవ రం ప్రాజెక్టును పూర్తిచేయడానికి చర్యలు తీసుకోవాల్సింది పోయి, కేవలం టీడీపీ నాయకుల జేబులు నింపడానికే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడుకి బుద్ధి వచ్చేవిధంగా ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. కేవలం ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న చంద్రబాబుకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని, ఈ విషయంపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంద ని జగన్ పిలుపునిచ్చారు. జగన్ యాత్రతో రైతుల్లో స్థైర్యం పట్టిసీమ నిర్మాణంతో కంటిమీద కునుకులేకుండా ఆందోళన చెందుతున్న తమకు వైఎస్ జగన్ యాత్రతో భరోసా వచ్చిందని రైతులు రచ్చబండ సాక్షిగా ప్రకటించారు. తమ కోసం పోరాడే నేత ఉన్నారనే ధైర్యం వచ్చిందని వ్యాఖ్యానించారు. అనంతరం వైఎస్ జగన్మోహన్రెడ్డి రోడ్డు మార్గంలో తాళ్లపూడి, దేవరపల్లి, నల్లజర్ల మీదుగా విజయవాడ వెళ్లారు. -
రైతు ఆత్మహత్యలను రుజువు చేస్తాం
వెంటనే అఖిలపక్ష భేటీ ఏర్పాటుచేయండి తెలంగాణ సర్కారుకు వామపక్షాల సవాల్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 69 మంది రైతులు ప్రకృతి వైపరీత్యాలు, వరుస కరువు, సామాజిక పరిస్థితుల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడ్డారంటూ ప్రభుత్వం ప్రకటించటాన్ని పది వామపక్షాలు విమర్శించాయి. శనివారం రాజ్యసభలో ఎంపీ వి.హనుమంతరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి మోహన్ కుంధేరియా ఈ మేరకు ఇచ్చిన సమాధానం అసంబద్ధమైందని శనివారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తాయి. దాదాపు 550 మంది ఆత్మహత్యలకు పాల్పడగా, 69 మందేనని మంత్రి ఏ ప్రాతిపదికన నిర్ధారించారో వెల్లడించాలని సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ, ఎంసీపీఐ-యూ, సీపీఐఎంఎల్ (న్యూడెమోక్రసీ), ఫార్వర్డ్‌బ్లాక్, ఆర్ఎస్పీ, సీపీఐ(ఎంఎల్), ఎస్‌యూసీఐ-సీ, లిబరేషన్ డిమాండ్ చేశాయి. ఈనెల 5వ తేదీ నుంచి 10 వరకు తమ పార్టీలు రైతు భరోసా బస్సు యాత్రను నిర్వహించి 176 మంది కుటుంబాలను కలుసుకుని, వారి ఆవేదనను తెలుసుకున్నట్లు వివరించాయి. రైతు ఆత్మహత్యలపై అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేస్తే తాము సేకరించిన అన్ని ఆధారాలను ప్రభుత్వం ముందు ఉంచుతామని సవాల్ విసిరాయి. కేంద్రం చేసిన ప్రకటన మరింత అపార్ధానికి అవకాశమిస్తుందని హెచ్చరించాయి. తప్పుడు లెక్కలను పంపించి కేంద్రంతో సమాధానం ఇప్పించటం రైతు ఆత్మహత్యలపై తెలంగాణ ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని స్పష్టం చేస్తోందని ఆ ప్రకటనలో విమర్శించాయి. వాస్తవాలను ప్రభుత్వం గుర్తించటానికి నిరాకరించడం అన్యాయమని పేర్కొన్నాయి. తెలంగాణ వస్తే న్యాయం జరుగుతుందనే రైతుల ఆకాంక్ష నిరాశగానే మారిందని అభిప్రాయపడ్డాయి. ఇప్పటికైనా ప్రభుత్వం రైతు కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారంతోపాటు ఇతర సహాయ చర్యలను ప్రకటించాలని ఈ పార్టీలు విజ్ఞప్తి చేశాయి. -
ప్రారంభమైన టీ టీడీపీ బస్సు యాత్ర
-
ద్రోహులమంటూ యాత్ర చేస్తారా?
తెలుగుదేశం పార్టీ నేతలకు మంత్రి హరీశ్‌రావు ప్రశ్న సాక్షి, హైదరాబాద్: టీటీడీపీ నేతలపై టీఆర్ఎస్ మంత్రులు, నేతలు మండిపడ్డారు. మంగళవా రం వారు వేర్వేరుగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ నేతల బస్సు యాత్రపై కస్సుబుస్సు అయ్యారు. తెలంగాణ ద్రోహులం, చంద్రబాబుకు తాబేదారులమంటూ బస్సుయాత్ర చేస్తారా అని నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రశ్నించారు. తెలంగాణభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. రైతుల గురించి టీడీపీ నేతలు మాట్లాడుతుంటే.. ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ‘కరెంటు చార్జీలను తగ్గించాలని అడిగితే.. ప్రజల్ని పిట్టలను కాల్చినట్టుగా చంపి, బ్యాంకు లోన్లు తీసుకున్నవారిపై క్రిమినల్ కేసులు పెట్టించిన చంద్రబాబు చరి త్రను యాత్రలో మీరు వివరిస్తారా’ అని నిల దీశారు. తెలంగాణలో కరెంటు కొరతకు చంద్రబాబు, కాంగ్రెస్ కారణమని విమర్శించారు. రేవంత్‌ను బజారుకీడుస్తాం.. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అవినీతిని బయటపెట్టి, బజారుకీడుస్తామని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్సీ భానుప్రసాద్ హెచ్చరించారు. తెలంగాణ విద్యుత్ కొరత, ఖమ్మం జిల్లాలోని 7 ముంపు మండలాల గురించి చంద్రబాబును ఎందుకు నిలదీయడం లేదన్నారు. ప్రతిపక్షాలవి అర్థంలేని విమర్శలు వరంగల్: కాంగ్రెస్, టీడీపీ నాయకులు అర్థం లేని విమర్శలు చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. మంగళవారం హన్మకొండలో జరిగిన టీఆర్ఎస్ జిల్లా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనతోనే తెలంగాణకు విద్యుత్ కష్టాలు వచ్చాయన్నారు. తెలంగాణలో టీడీపీ ఉంటే.. విద్యుత్ ఇవ్వు కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ ఉంటే, తెలంగాణకు వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఇవ్వాలని ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. మంగళవారం కరీంనగర్లో జరిగిన టీఆర్ఎస్ సమావేశంలో మాట్లాడారు. యూనిట్‌కు రూ.14 ఖర్చుచేసైనా కొనుగోలు చేయాలని కేసీఆర్ ఆదేశించారన్నారు. ఎర్రబెల్లిని టీఆర్ఎస్లోకి రానివ్వం వరంగల్: టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయా కర్రావును టీఆర్ఎస్లోకి రానివ్వబోమని ఆ పార్టీ ఎంపీ కడియం శ్రీహరి అన్నారు. మంగళ వారం ఇక్కడ జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కడియం మాట్లాడుతూ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న పార్టీలు ఎటూ పాలుపోక విమర్శలు చేస్తున్నాయన్నారు. -
టీడీపీలో ఇదో టైపు స్వచ్ఛంద ప్రచారం!
పార్టీ వారే ‘పారిశ్రామిక అభివృద్ధి మండలి’ పేరుతో బస్సు యాత్ర సాక్షి, హైదరాబాద్: టీడీపీలో సరికొత్త ప్రచారానికి తెరలేచింది. కొందరు ప్రతినిధులు... ‘పారిశ్రామిక అభివృద్ధి మండలి’ పేరుతో స్వచ్ఛందంగా ఎన్నికల ప్రచారం చేస్తామని పార్టీ అధినేత చంద్రబాబు వద్దకు గురువారం వచ్చారు. వీరి ప్రతిపాదనతో ఎంతగానో ఉబ్బితబ్బి బ్బైన చంద్రబాబు సదరు బస్సు యాత్రను జెండా ఊపి మరీ ప్రారంభించారు. అయితే, నిజానికి ఆ బస్సు యాత్రకు అవసరమైన ఏర్పాట్లన్నీ టీడీపీ అధినాయకత్వమే సమకూర్చింది. అంతేకాదు, యాత్ర చేస్తామని ముందుకొచ్చిన వారంతా ఆ పార్టీ లో పనిచేస్తున్న వారే కావడం గమనార్హం. వీరిలో.. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, గతంలో చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన అశోక్‌రాజ్, వైఎస్సార్ జిల్లా టీడీపీ నేతలు కందుల రాజమోహన్‌రెడ్డి, శివానందరెడ్డిల సోదరి శకుంతలారెడ్డి ఉన్నారు. బస్సు యాత్రను శకుంతలారెడ్డి సమన్వయం చేస్తున్నారు. యాత్ర ప్రారంభించిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, సీమాంధ్రను సింగపూర్ చేస్తానని మరోసారి చెప్పారు. -
తుస్సుమన్న బస్సు యాత్ర!
కల్లూరు రూరల్, న్యూస్‌లైన్: కాంగ్రెస్ నిర్వహించిన బస్సు యాత్ర జిల్లాలో తుస్సుమంది. పార్టీ వర్గాలు భావించిన రీతిలో జనస్పందన కనిపించలేదు. కర్నూలు పాతబస్టాండులోని ఓపెన్ ఎయిర్ థియేటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ గందరగోళంగా మారింది. ఈలలు, అరుపులే తప్ప పార్టీ నేతల సందేశాలు ఎవరికీ వినిపించకుండా పోయాయి. పార్టీ కార్యకర్తల కంటే చిరంజీవిని చూసేందుకు వచ్చిన వారే ఎక్కువగా ఉన్నారు. కొందరు అభిమానులు బల్లలెక్కి, కుర్చీలెక్కి అడ్డంగా నిలవడంతో.. సామాన్యులు నిరుత్సాహానికి గురై సభ మధ్యలోనే వెళ్లిపోయారు. మొదట పోలీసులు వేదిక వద్ద నుంచి అందర్ని పంపి వేసినా గోల అధికమయ్యే కొద్దీ వారు నిమ్మకుండిపోయారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బస్సుయాత్ర గురువారం సాయంత్రం కర్నూలు నగరానికి చేరింది. డీసీసీ అధ్యక్షుడు బి.వై.రామయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభ దిక్కుమొక్కు లేకుండానే ముగిసింది. సభకు కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ చిరంజీవి, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, 2014 ఎన్నికల మేనిఫెస్టో, ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ ఛైర్మన్ ఆనం రామనారాయణరెడ్డి, రాజ్యసభ ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి, కేంద్ర మంత్రులు జె.డి.శీలం, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, మాజీ మంత్రులు బాలరాజు, కొండ్రు మురళీ, డొక్కా మాణిక్యవరప్రసాద్, డీసీసీ నాయకులు తదితరులు హాజరయ్యారు. వీరి సభకు ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు, కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి అహ్మద్‌అలీఖాన్ అనుచరులు తప్ప పార్టీ కార్యకర్తల సంఖ్య పల్చగా కనిపించింది. వీరి అల్లరికి సభలో ప్రసంగించిన వక్తలంతా రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది. డీసీసీ అధ్యక్షుడు, పార్టీ అసెంబ్లీ అభ్యర్థి పదేపదే వారించినా ప్రయోజనం లేకపోయింది. నాయకులు కూడా చెప్పిందే చెప్పుకుంటూ వెళ్లడంతో ఎవరూ వినిపించుకోలేదు. ప్రతివక్త కూడా రాష్ట్ర విభజన పాపం తమది కాదని, ఇందులో అందరి ప్రమేయం ఉందని చెప్పుకొచ్చారు. అలాగే రాష్ట్ర విభజనతో రాయలసీమకు, కోస్తాంధ్రకు ఎన్నో ప్రయోజనాలు కలగనున్నాయని రెండో వాదనను వినిపించారు. ఓటు టీడీపీకి వేస్తే అది బీజేపీకి వేసినట్లేనని చిరంజీవి అన్నారు. -
ఫ్లాప్ షో..!
సాక్షి, ఒంగోలు: ‘కాశీకి వెళ్లానని..కాషాయం..’ అంటూ ఇంద్ర సినిమా డైలాగ్‌తో ప్రారంభమైన ఆయన ప్రసంగం కాంగ్రెస్ కార్యకర్తల బుర్రను వేడెక్కించింది. నూనుగు మీసాల వయసులో ఒంగోలులో తాను తిరిగిన జ్ఞాపకాలు మదిలో మెదులుతున్నాయని చెప్పిన ఆయన గుర్తులు వేదికపైనున్న కాంగ్రెస్ పెద్దల్ని అయోమయానికి గురిచేశాయి. ‘కాంగ్రెస్ పార్టీ అనేది ప్రకృతి గద్ద.. రెక్కలు విప్పుకుని ఆకాశంలో ఎగిరిన పక్షిలా.. నేడు యువకులు రూపాంతరం చెందాలి.. కార్యోన్ముఖులు కావాలి..’ కాంగ్రెస్ ప్రచారకమిటీ అధ్యక్ష బాధ్యత చేపట్టిన కేంద్రమంత్రి చిరంజీవి పొంతనలేకుండా చేసిన వ్యాఖ్యలివి.. సోమవారం ఒంగోలులో కాంగ్రెస్ బస్సుయాత్ర కాస్తా తుస్సుమంది. గుంటూరు జిల్లా నుంచి నేరుగా ఒంగోలులోకి ప్రవేశించిన బస్సుయాత్ర నగరంలో ట్రంకురోడ్డు, చర్చిసెంటర్, కలెక్టరేట్, రామ్‌నగర్ మీదుగా సాగింది. అనంతరం ఓ ప్రైవేటు ఫంక్షన్‌హాలులో ఏర్పాటు చేసిన సమావేశానికి సీమాంధ్ర పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, చిరంజీవి, కేంద్రమంత్రులు పనబాక లక్ష్మి, జేడీ శీలం, మాజీమంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, డొక్కా మాణిక్యవరప్రసాద్, ఎమ్మెల్యేలు తదితరులు హాజరయ్యారు. డీసీసీ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశం ఆద్యంతం గందరగోళంగా నడిచింది. చిరంజీవి అభిమానులు అక్కడికొచ్చినా... వారు తమ అభిమాన నేతను కలిసే విషయంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో తీవ్రంగా విభేదించి వాగ్వాదానికి దిగారు. అక్కడ ఏర్పాటు చేసిన పార్టీ ఫ్లెక్సీలను కూడా చించేశారు. నేతల ప్రసంగాలకు అడ్డుతగులుతున్న చిరు అభిమానుల హడావుడిపై రఘువీరారెడ్డి తీవ్ర అసహనానికి గురై మైక్‌లో కేకలేశారు. స్వయంగా చిరంజీవి పైకిలేచి ..మైకు పట్టుకుని క్రమశిక్షణ అంటూ అభిమానులను కట్టడిచేసే ప్రయత్నం చే సినా.. వారిమధ్య వాగ్వాదాలు సద్దుమణగలేదు. పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి మాట్లాడుతూ సీమాంధ్రను నవ్యాంధ్రగా మార్చే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు. దొంగే..దొంగదొంగ అని అరిచినట్లు చంద్రబాబు కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నారని.. అతనికి భవిష్యత్‌లో ఘోరపరాభవం ఎదురుకానున్నదని రఘువీరా జోస్యం చెప్పారు. కేంద్రమంత్రి పనబాక మాట్లాడుతూ చిరంజీవిని సూపర్‌స్టార్ అని సంభోదించగా.. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు వినిపించాయి. పవర్‌స్టార్, జై జనసేన అంటూ పవన్‌కల్యాణ్‌ను స్తుతిస్తూ కొందరు పవన్‌కల్యాణ్ అభిమానులు పెద్దగా నినాదాలివ్వడంతో వేదికపై నేతలు డైలామాలో పడ్డారు. పలువురు రాష్ట్ర నేతలు మాట్లాడినప్పటికీ.. రాష్ట్రవిభజనపై కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలు, సీమాంధ్ర ప్యాకేజీలపై కార్యకర్తల్లో సరైన అవగాహన కల్పించలేకపోయారు. చివరికి చిరంజీవి ప్రసంగంలో ఒంగోలును జపాన్ చేస్తానని.. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో ప్రకాశం రైతులకు మేలంటూ .. చెప్పడంపై విసుగు చెందిన పలువురు నేతలతో పాటు సమావేశం నుంచి భారీగా కార్యకర్తలు బయటకు వెళ్లిపోయారు. ‘స్టాలిన్’ డైలాగ్‌ను గుర్తుచేసిన పనబాక కేంద్రమంత్రి పనబాక లక్ష్మి మాట్లాడుతూ చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమా డైలాగ్‌ను చెబుతూ.. కాంగ్రెస్‌పై ఇతర పార్టీలు చేస్తున్న దుష్ర్పచారాన్ని ఒకరు మరో ముగ్గురుతో మాట్లాడి తిప్పికొట్టాలని సూచించారు. చిరంజీవి అభిమానులు ఈలలు, చప్పట్లకు పరిమితం కాకూడదంటూ.. రానున్న కాలంలో యువతకు తమపార్టీ పెద్దపీట వేస్తుందని చెప్పారు. మరో కేంద్రమంత్రి జేడీ శీలం మాట్లాడుతూ చంద్రబాబు బీజేపీతో అశ్లీలపొత్తుకు సిద్ధపడటం సిగ్గుచేటన్నారు. ఆయన తొమ్మిదేళ్లహయాంలో ఇంకుడు గుంతలు, నీరు, మీరు, వనం..మనం తదితర పథకాలతో పచ్చకండువాల నేతలకు రాష్ట్ర్రాన్ని బేరం పెట్టడం అందరికీ తెలిసిందేనన్నారు. సీమాంధ్రకు కేంద్రమిచ్చిన ప్రత్యేక ప్యాకేజీతో ఒక్కో పట్టణాన్ని ఒక్కో భాగ్యనగరంగా తీర్చిదిద్దుతామన్నారు. మాజీమంత్రి కొండ్రు మురళి మాట్లాడుతూ పదవులు అనుభవించి పక్కకెళ్లిన నేతల కారణంగా కాంగ్రెస్‌కు కష్టాలు దాపురించాయన్నారు. త్వరలో సీమాంధ్ర అద్భుతప్రగతిని చూస్తుందన్నారు. మాజీమంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, డొక్కా మాణిక్యవరప్రసాద్, ఎమ్మెల్యే జీవీ శేషు తదితరులు మాట్లాడారు. కాంగ్రెస్ బస్సుయాత్రకు ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి, జీవి శేషు మినహా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మాజీమంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డితోపాటు ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా దూరంగా ఉన్నారు. కార్యక్రమం అంతటా చిరంజీవి అభిమానులు తప్ప కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు పెద్దగా కనిపించలేదు. గతంలో తాను పీఆర్పీ అధినేతగా సమైక్యాంధ్ర కోసం పోరాడానంటూనే.. అప్పట్లో తనను ఎవరూ మెచ్చుకోనందున.. కాంగ్రెస్‌లో కలిశానని.. ఇప్పుడు తన హక్కులు, అధికారాలు పరిమితమయ్యాయని చిరంజీవి చెప్పుకోవడంపై అభిమానులు పెదవి విరిచారు. చిరంజీవి మాట్లాడుతూ మాగుంట కాస్త అటూఇటుగా ఉన్నారని, ఆయన మళ్లీ కాంగ్రెస్‌లోకి వస్తారని అన్నారు. విభజనపై తాను బాధపడుతున్నానని ఆయన చెప్పుకుంటూనే కాంగ్రెస్‌ను ఓట్లేసి గెలిపించమనడం ఎంతవరకు సబబని కార్యకర్తలు ఒకరికొకరు ప్రశ్నించుకున్నారు. మొత్తానికి కాంగ్రెస్ బస్సుయాత్ర ఫ్లాప్‌షోగా మిగిలిపోయింది. -
'కాళ్లు పట్టుకుని మరీ టీడీపీలో చేర్చుకుంటున్నారు'
కాంగ్రెస్ కార్యకర్తలలో ఉత్సాహం నింపేందుకే బస్సు యాత్ర చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ నాయకులు చేపట్టిన బస్సు యాత్ర శనివారం విశాఖపట్నం చేరుకుంది. ఈ సందర్బంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ...తాము చేపట్టిన బస్సు యాత్ర ముగిసేలోపు కాంగ్రెస్ పార్టీలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయన్నారు. తమ బస్సు యాత్ర వల్ల సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ భారీ సంఖ్యలో సీట్లను కైవసం చేసుకుంటుందని తెలిపారు. రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర ప్రాంతానికి అన్యాయం జరిగిందన్న భావన సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. అన్ని పార్టీలు విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చాయని, అయితే కాంగ్రెస్ పార్టీనే లక్ష్యంగా చేసుకోవడం సరికాదన్నారు. విభజనతో పార్టీ నుంచి బయటకు వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను కాళ్లు పట్టుకుని మరీ పచ్చ పార్టీ చేర్చుకుంటుందని టీడీపీపై రఘువీరారెడ్డి నిప్పులు చెరిగారు. -
బెరైడ్డి బస్ యాత్రలో ఘర్షణ
బుచ్చినాయుడుకండ్రిగ, న్యూస్‌లైన్: రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖరరెడ్డి బస్సు యాత్రలో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా బుచ్చినాయుడుకండ్రిగ మండలంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. బస్సు యాత్ర సభ జరుగుతున్న సమయంలో రెండు కార్లలో ఆయన అనుచరులు బుచ్చినాయుడుకండ్రిగకు బయలుదేరారు. మార్గమధ్యంలోని గోవర్థనపురం వద్ద ఆ కార్లను ఓ ఆటో ఓవర్టేక్ చేసింది. దీంతో బెరైడ్డి అనుచరులు ఆటోను ఆపి డ్రైవర్ వెంకటేష్, మరో వ్యక్తిని చితకబాదారు. వెంకటేష్ అక్కడికి సమీపంలోని ఎన్టీఆర్ నగర్ కాలనీకి చెందినవాడు. జరిగిన విషయాన్ని కాలనీలోని బంధువులకు ఫోన్లో తెలిపాడు. దీంతో కాలనీవాసులు కార్లను అడ్డుకోబోయారు. ఓ కారు వెళ్లిపోగా, మ రో కారులో ఉన్న ముగ్గురిపై కాలనీ వాసులు దాడి చేశారు. వారిలో మధు అనే వ్యక్తికి గాయాలయ్యాయి. కారు వెనుక అద్దాలు పగిలాయి. ఇంతలో సభను ముగించుకుని బస్‌లో వస్తున్న బెరైడ్డి రాజశేఖరరెడ్డిని కాలనీవాసులు చుట్టుముట్టారు. బెరైడ్డి గంటసేపు బస్‌లోనే ఉండిపోయారు. ఈలోపు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కాలనీవాసులకు సర్ది చెప్పారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. -
12నుంచి షర్మిల సమైక్య శంఖారావం
ఏలూరు (ఆర్ఆర్ పేట), న్యూస్‌లైన్ :సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావం బస్సు యాత్ర ఈనెల 12న జిల్లాలోకి ప్రవేశించనుందని పార్టీ జిల్లా కన్వీనర్, పోల వరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తెలిపారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన నియోజకవర్గాల కన్వీనర్లు, పార్టీ ముఖ్య నాయకుల సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 12న మధ్యాహ్నం 3గంటలకు స్థానిక ఫైర్‌స్టేషన్ సెంట ర్లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తారని చెప్పారు. ఆ రోజు రాత్రి ఏలూరులో బస చేస్తారని వివరించారు. 13న ఉదయం ఏలూరు నుంచి బస్సు యాత్ర బయలుదేరుతుందన్నారు. అనంతరంతూర్పుగోదావరి జిల్లా రావులపాలెం చేరుకుంటారని వెల్లడించారు. బహిరంగ సభను, బస్సు యూత్రను జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఇంతకుముందు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నిర్వహిం చిన షర్మిల ప్రపంచ రాజకీయాల్లోనే సరి కొత్త చరిత్ర సృష్టించారని బాలరాజు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించే ప్రయత్నాలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతోందని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఇప్పటికే అనేక కార్యక్రమాలు నిర్వహించామని గుర్తుచేశారు. పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు విభజన ప్రకటన వెలువడిన వెంటనే రాజీనామా చేశారని తెలిపారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ 5 రోజులు, పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి 7 రోజులు నిరాహార దీక్ష చేసి సమైక్య వాదానికి కట్టుబడి ఉన్న విషయాన్ని స్పష్టం చేశారని చెప్పారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల వైఖరి కారణంగానే రాష్ట్రం అగ్నిగుండంగా మారిందని బాలరాజు విమర్శిం చారు. ఈ పరిస్థితుల్లోనూ చంద్రబాబునాయుడు ప్రజలను మోసం చేయడానికి ఆత్మగౌరవ యాత్ర చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సమైక్య వాదానికి కట్టుబడి ఉన్నప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ జగన్మోహన్రెడ్డిని చంద్రబాబు విమర్శించడం విడ్డూరంగా ఉందని పేర్కొ న్నారు. అసలు విధానమే లేని బాబు ఏ మొహం పెట్టుకుని ప్రజల ముందుకు వస్తున్నారని దుయ్యబట్టారు. సమైక్యవాదాన్ని, నాదాన్ని ఢిల్లీకి వినిపిస్తాం : నాని ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని మాట్లాడుతూ సమైక్య శంఖారావంలో భాగంగా షర్మిల నిర్వహించనున్న సభను విజ యవంతం చేయడానికి ఏలూరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. సమైక్య శంఖారావం బహిరంగ సభను జయప్రదం చేయడానికి సమైక్య వాదులు సైతం ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే వివిధ జిల్లాలో సమైక్య శంఖారావం యాత్రను సమైక్యవాదులు, ప్రజలు స్వాగతించడం శుభపరిణామమన్నారు. షర్మిల సభ సందర్భంగా సమైక్యవాదాన్ని, నాదాన్ని ఢిల్లీ వరకూ వినిపిస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడుతూ షర్మిల సభకు 15 నియోజకవర్గాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటు ప్రజలు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. సమైక్య వాణిని తమ పార్టీ నాయకులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదిలోనే పార్లమెంటులో వినిపించారని గుర్తు చేశారు. ఆత్మగౌరవ యాత్ర పేరిట చంద్రబాబు బస్సుయూత్ర చేయడాన్ని ప్రజలు నమ్మ టం లేదని పేర్కొన్నారు. చంద్రబాబు మాటల్లో పొంతన లేకపోవడమే ప్రజల అపనమ్మకానికి కారణమైందన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ నియోజకవర్గాల కన్వీనర్లు తోట గోపి, పాతపాటి సర్రాజు, తలారి వెంకటరావు, చలమోలు అశోక్‌గౌడ్, కొఠారు రామచంద్రరావు, కర్రా రాజారావు, చీర్ల రాధయ్య, గొట్టుముక్కల భాస్కరరాజు, పార్టీ జిల్లా మహిళా కన్వీనర్ గూడూరి ఉమాబాల పాల్గొన్నారు. -
13 నుంచి సమైక్య శంఖారావం
కాకినాడ, న్యూస్‌లైన్:వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావ యాత్ర ఈనెల 13న జిల్లాకు రానుంది. జిల్లాలో రెండు రోజుల పాటు సాగే ఈ యాత్రలో రావులపాలెం, అమలాపురం, కాకినాడల్లో సభలు నిర్వహించనున్నారు. షర్మిల పర్యటించే ప్రాంతాలు, షెడ్యూల్ ఖరారు, ఇతర అంశాలపై చర్చించేందుకు కాకినాడలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి అధ్యక్షతన శనివారం సాయంత్రం సీజీసీ సభ్యులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలు, నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు, అనుబంధ సంఘాల కన్వీనర్ల సమావేశం జరిగింది. సమావేశం అనంతరం చిట్టబ్బాయి షర్మిల బస్సుయాత్ర వివరాలను విలేకరులకు తెలియజేశారు. సమైక్య శంఖారావయాత్ర ఈనెల 13వ తేదీ ఉదయం 10.30 గంటలకు రావులపాలెం చేరుకుంటుందన్నారు. అక్కడ జరిగే సభలో షర్మిల ప్రసంగిస్తారని తెలిపారు. అనంతరం 4 గంటలకు అమలాపురంలో జరిగే సభలో ఆమె మాట్లాడతారన్నారు. రాత్రికి షర్మిల అమలాపురంలోనే బస చేస్తారని, 14వ తేదీ ఉదయం 10.30 గంటలకు కాకినాడలో జరిగే సభలో ప్రసంగిస్తారని పేర్కొన్నారు. పిఠాపురం, తుని మీదుగా విశాఖ జిల్లా వెళతారన్నారు. సమైక్య శంఖారావ బస్సుయాత్రను విజయవంతం చేయాలని చిట్టబ్బాయి పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. షర్మిల పర్యటనపై చర్చించేందుకు ఈ నెల 10వ తేదీన ఉదయం 10 గంటలకు ముమ్మిడివరంలో, 12 గంటలకు అమలాపురంలో, 3 గంటలకు పి.గన్నవరంలో, 5 గంటలకు రాజోలులో నియోజకవర్గాల నేతలు, పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్ గంపల వెంకటరమణ, ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కర రామారావు, ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పెండెం దొరబాబు, చిర్ల జగ్గిరెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి, మాజీ ఎంపీ ఏజేవీ బుచ్చిమహేశ్వరరావు, కాకినాడ నగర కన్వీనర్ ఆర్‌వీజేఆర్ కుమార్, వివిధ నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లు విప్పర్తి వేణుగోపాలరావు, దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన వేణు, కొండేటి చిట్టిబాబు, ఆకుల వీర్రాజు, గుత్తుల సాయి, జిల్లా అధికార ప్రతినిధి పి.కె.రావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళ, ఎస్సీ, వాణిజ్య, బీసీ, రైతు, మైనార్టీ, చేనేత, ఇండస్ట్రీయల్, సేవాదళ్, వికలాంగ, విభాగాల కన్వీనర్లు రొంగలి లక్ష్మి, శెట్టిబత్తుల రాజబాబు, కర్రి పాపారాయుడు, గుత్తుల రమణ, రెడ్డి రాధాకృష్ణ, నయీమ్, పంపన రామకృష్ణ, మంతెన రవిరాజు, మార్గాని గంగాధర్, నలమాటి లంకరాజు, రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి సుంకర చిన్ని, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కార్యదర్శి టీకే విశ్వేశ్వరరెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యురాలు ఎన్. వసుంధర, నాయకులు వరుపుల సూరిబాబు, కాలే రాజబాబు, ముత్యాల సతీష్, కుసునం దొరబాబు, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
ఆత్మగౌరవంపై అంతర్మథనం
సాక్షి, గుంటూరు :రాష్ట్ర విభజన ప్రకటనతో ఆగ్రహోదగ్రులైన సమైక్యవాదులు ఉవ్వెత్తున ఉద్యమబాట పట్టిన తరుణంలో దానికి పరోక్ష కారకుడిగా ముద్రపడిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు జిల్లాలో తలపెట్టిన బస్సు యాత్ర ఆ పార్టీ నాయకుల్లో ఆందోళన రేపుతోంది. తెలంగాణ విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి తగుదునమ్మా అంటూ ఆ లేఖ ఇవ్వటానికిగల కారణాలు చెప్పేందుకు తెలుగు ఆత్మగౌరవ యాత్ర చేపట్టడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఉద్యమానికి కేంద్రబిందువుగా మారిన గుంటూరు జిల్లాలోనే ఈ యాత్ర కూడా మొదలుపెట్టడం ఇక్కడి నాయకులకు మింగుడుపడటం లేదు. గురజాల నియోజకవర్గం పొందుగల నుంచి మొదలై ఐదురోజులపాటు సత్తెనపల్లి, పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల్లో కొనసాగనున్న ఈ యాత్ర షెడ్యూల్‌ను జిల్లాపార్టీ అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు ఇప్పటికే ప్రకటించారు. వాస్తవానికి విభజన నిర్ణయంలో తెలుగుదేశం పార్టీ అనుసరించిన వైఖరిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో జిల్లాలో యాత్ర చేపట్టడం సరికాదేమోనన్న అనుమానాలు ఆ పార్టీ నేతల్లో అంతర్లీనంగా వినిపిస్తున్నాయి. దీనివల్ల పార్టీకి నష్టమవుతుందేమోనని అధినేత దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఆయనేమీ పట్టించుకోకపోవడంతో వారంతా తలలు పట్టుకుంటున్నారు. సమైక్యవాదుల నుంచి ప్రతిఘటన తప్పదా? విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చేసి.. కొన్నాళ్లు మౌనం దాల్చిన ఆయన అటు తరువాత కొత్త రాజధాని నిర్మించుకోవడానికి ప్యాకేజీలగురించి వాదించిన చంద్రబాబునాయుడు ఆత్మగౌరవ యాత్రకు జిల్లాలోని సమైక్యవాదులనుంచి ప్రతిఘటన తప్పదేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యమం ఇంతలా సాగుతుంటే ఈ పరిస్థితుల్లో యాత్ర పేరుతో కోరి కష్టాలు తెచ్చుకోవడం ఎందుకంటూ పార్టీ సీనియర్లు మల్లగుల్లాలు పడుతున్నారు. అయినా అధినేత నిర్ణయంలో మార్పు లేకపోవడంతో చేసేది లేక మిన్నకుంటున్నారు. ఆత్మగౌరవంపై అంతర్మథనం తెలుగుజాతి ఆత్మగౌరవం కాపాడేందుకు ఆనాడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ.. ఈనాడు అదే తెలుగు ప్రజల్ని విడగొట్టేందుకు కారణమైందనే నిజాన్ని ఆ పార్టీ సీనియర్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. 2008 అక్టోబర్ 18న ప్రణబ్‌ముఖర్జీకి రాసిన లేఖలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు అంగీకరిస్తున్నట్లు రాస్తున్నప్పుడు.. సీమాంధ్ర ప్రజల ప్రయోజనాల్ని కూడా కాపాడాలనే అంశాల్ని లేఖలో పెట్టాలని పయ్యావుల కేశవ్, దూళిపాళ్ల నరేంద్ర, దేవినేని ఉమా వంటి కొందరు సీనియర్లు చంద్రబాబుకు చెప్పినట్లు సమాచారం. అయితే ఆయన వాటిని పట్టించుకోలేదని పార్టీ వర్గాల భోగట్టా. 2009 డిసెంబర్ 7న హైదరాబాద్‌లో రోశయ్య కమిటీకి, 2012 డిసెంబర్ 27న షిండేకి రాసిన లేఖలోనూ విభజనకు కసరత్తు చేయడంటూ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయాన్ని ఎవరూ మరచిపోలేకపోతున్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయం తర్వాత ఆయన విలేకరుల సమావేశంలో సీమాంధ్ర ప్రాంతానికి రాజధాని ఏర్పాటుకు రూ. 4 నుంచి 5 లక్షల కోట్లు ఇవ్వాలంటూ కేంద్రాన్ని డిమాండ్ చేయడం సీమాంధ్ర జిల్లాలవాసులకు తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ఇన్ని సందర్భాల్లోనూ తెలుగువారి ఆత్మగౌరవం గుర్తుకురాని చంద్రబాబు.. తాజాగా బస్సుయాత్ర పేరుతో జిల్లాలోకి అడుగిడటంపైన సమైక్యవాదులు రగిలిపోతున్నారు. టీడీపీ నేతలు కూడా సమైక్యాంధ్రకు మద్దతుగా దీక్షల్లో కూర్చున్నా.. ప్రజల ఆదరణను దక్కించుకోవడంలో విఫలమయ్యారు. ఇప్పుడు నేరుగా అధినేతే జనంలోకి వస్తే ఎలాంటి పరాభవాన్ని ఎదుర్కొనాల్సి వస్తుందేమోనన్న ఆందోళన పార్టీవర్గాల్లో వ్యక్తమవుతోంది. -
తిరుపతిలో షర్మిల బహిరంగ సభ
సాక్షి, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల సెప్టెంబర్ రెండో తేదీన తిరుపతికి రానున్నట్లు పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇడుపులపాయ నుంచి బస్సుయాత్ర ప్రారంభించనున్న ఆమె అక్కడి నుంచి నేరుగా తిరుపతికి చేరుకుంటారని పేర్కొన్నారు. తిరుపతిలో రెండో తేదీ సాయంత్రం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని, రాత్రి ఇక్కడే బస చేస్తారని తెలిపారు. మూడో తేదీ ఉదయం పూతలపట్టు, చిత్తూరు, పలమనేరు మీదుగా మదనపల్లె చేరుకోనున్నట్లు వివరించారు. మూడో తేదీన ఉదయం చిత్తూరులో, సాయంత్రం మదనపల్లెలో బహిరంగ సభలు ఉంటాయని తెలిపారు. -
ఆత్మ గౌరవ కాదు.. టీడీపీకి అంతిమ యాత్ర
రాయదుర్గం, న్యూస్‌లైన్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈనెల 25 నుంచి ఆత్మగౌరవ యాత్ర పేరుతో బస్సు యాత్ర చేపడుతున్నారని, విభజనకు కారణమైన చంద్రబాబు రాజకీయానికి సీమాంధ్రలో ఇది అంతిమ యాత్ర అవుతుందని అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం రాయదుర్గంలో కాపు భారతి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శిబిరం, విద్యార్థులు చేపట్టిన రిలే దీక్షల శిబిరంలో ఆయన మాట్లాడారు. వీహెచ్ హనుమంతరావుకు తిరుపతిలో పట్టిన గతే చంద్రబాబుకు కూడా పడుతుందని హెచ్చరించారు. విభజన కోసం ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకుని బస్సు యాత్ర చేపట్టాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ధ్వజమెత్తారు. విభజనకు లేఖ ఇచ్చిన చంద్రబాబును నిలదీయకుండా ఆ పార్టీ నాయకులు వైఎస్సార్సీపీ నాయకులపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సిగ్గు, మానవత్వం ఉంటే చంద్రబాబు తన లేఖను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం విడిపోతే సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. -
కొత్తవలస నుంచి చంద్రబాబు బస్సు యాత్ర 25 నుంచి ప్రారంభం..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రకటన వెలువడీ వెలువడగానే నూతన రాజధాని ఏర్పాటుకు రూ. నాలుగైదు లక్షల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేసిన తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదివారం నుంచి బస్సు యాత్రకు సన్నద్ధమవుతున్నారు. విజయనగరం జిల్లా కొత్తవలస నుంచి 25న ఉదయం ఆయన ‘తెలుగు ఆత్మగౌరవ యాత్ర ’ పేరుతో బస్సు యాత్రను ప్రారంభిస్తారు. తొలిదశలో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో యాత్ర కొనసాగుతుంది. యాత్ర ఏర్పాట్లపై గురువారం ఉత్తరాంధ్ర జిల్లాల నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీగా జనసమీకరణ జరపాలని సూచించారు. సీమాంధ్రలో జనాగ్ర హం తథ్యం? చంద్రబాబు బస్సు యాత్రను సీమాంధ్రకు చెందిన మెజారిటీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయం వెలువడిన వెంటనే కొత్త రాజధాని ఖర్చు గురించి మాట్లాడిన చంద్రబాబు సీమాంధ్రలో దేని కోసం యాత్ర చేపడుతున్నారని ప్రజలు నిలదీయడం తథ్యమని నేతలు చెబుతున్నారు. బస్సు చుట్టూ కార్యకర్తలను భారీ సంఖ్యలో పెట్టుకుని యాత్ర చేసి సాధించేదేమీ లేదంటున్నారు. తెలంగాణ ఇవ్వాలని కేంద్రానికి లేఖ ఇచ్చిన రోజున సీమాంధ్ర సమస్యలను విస్మరించి ఇప్పుడు బస్సు యాత్ర చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. సమైక్యాంధ్ర ఆందోళనల్లో పొల్గొంటున్న టీడీపీ నేతలు కొన్ని చోట్ల బాబు ఫోటోలను పెట్టుకోవడానికి కూడా ఇష్టపడకపోవడాన్ని కొందరు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. చంద్రబాబు బస్సు యాత్రలో ప్రజల ఆగ్రహావేశాలకు గురికావలసివస్తుందన్న అభిప్రాయాన్ని కొందరు నేతలు వ్యక్తం చేస్తున్నారు. -
25 నుంచి బాబు బస్సుయాత్ర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి అందుకు కారణమైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు సీమాంధ్ర ప్రాంతంలో బస్సుయాత్రకు సిద్ధమయ్యారు. మీకోసం యాత్ర ముగించిన విశాఖపట్నం నుంచి ఈ నెల 25న యాత్రను ప్రారంభించాలని నిర్ణయించారు. తొలివిడతగా విశాఖతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. యాత్ర విషయమై అందుబాటులో ఉన్న నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, మోత్కుపల్లి నర్సింహులు, రేవూరి ప్రకాష్‌రెడ్డి, విజయ రమణారావు, పట్నం మహేందర్‌రెడ్డి, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, డాక్టర్ కోడెల శివప్రసాదరావు, గరికపాటి మోహనరావులతో బుధవారం ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఈనెల 25 నుంచి బస్సు యాత్ర చేయాలనుకుంటున్నానని, ఒకవేళ ఆ రోజు అనువుకాని పక్షంలో 27 లేదా 29 తేదీల్లో ప్రారంభిస్తానని వారితో చెప్పారు. అయితే ప్రస్తుతం యాత్ర చేపట్టడం మంచిది కాదని సమావేశంలో పాల్గొన్న సీమాంధ్ర ప్రాంత నేతలు సూచించారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని ప్రకటించిన రోజున సీమాంధ్రలో కొత్త రాజధాని నిర్మాణం కోసం నాలుగైదు లక్షల కోట్ల రూపాయల నిధులివ్వాలని కోరడంపై కోస్తా, రాయలసీమ ప్రాంత ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయని బాబు దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంలో యాత్ర చేపట్టడమే తప్పయితే, సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేయడానికే బస్సుయాత్ర చేస్తున్నానని చెబితే నమ్మేవారెవరూ ఉండరని హెచ్చరించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో చంద్రబాబు 23, 24 తేదీల్లో రెండు ప్రాంతాల నేతలతో విడివిడిగా సమావేశం కానున్నట్లు తెలిపాయి. భారీ బందోబస్తు మధ్య: చంద్రబాబు బస్సు యాత్రకు భారీగా రక్షణ వలయం ఏర్పరచాలని టీడీపీ నేతలు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. బస్సుయాత్ర చేస్తానని ప్రకటించాక వెనక్కు తగ్గితే భయపడి రాలేదన్న విమర్శలు వస్తాయన్న అంశంపై వారు తర్జనభర్జన పడ్డారు. గతంలో తెలంగాణ ప్రాంతంలో వరంగల్ జిల్లా పాలకుర్తికి రైతు పోరుబాట పేరుతో పర్యటించినప్పుడు చంద్రబాబుకు రక్షణ వలయంగా ఎర్రబెల్లి దయాకర్‌రావు పెద్దఎత్తున కార్యకర్తలను సమీకరించి భారీ వాహన కాన్వాయ్‌ను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు చేపట్టే బస్సుయాత్రకు కూడా అలాంటి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. జిల్లాల వారీగా ఎక్కడెక్కడ వాహన శ్రేణి ఏ విధంగా చంద్రబాబు వాహనం వెంట ఉండాలో ముందే నిర్ణయించి, ఎక్కడికక్కడ అన్ని సౌకర్యాలు కల్పించి కార్యకర్తలను సమీకరించి, బస్సుయాత్ర పూర్తయ్యేవరకు వారు బాబు వెంటే ఉండేలా కార్యచరణ రూపొందించాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. సమావేశంలో పాల్గొన్న తెలంగాణ నేతలు మాత్రం తెలంగాణకు అనుకూలంగా పార్టీ ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నానని చెప్పాలని కోరగా చంద్రబాబు అంగీకరించినట్లు తెలిసింది. -
తెలంగాణ వచ్చినా ఇబ్బంది లేదు: చంద్రబాబు
హైదరాబాద్‌లో ఇతర ప్రాంతాలవారికి సమస్య ఏమీ ఉండదు విలేకరుల సమావేశంలో ప్రసంగించిన చంద్రబాబు మేం అధికారంలోకి వస్తామన్న ఆందోళనతోనే విభజన ప్రకటన పార్టీలో నామాటే వేదం.. అందరూ నా వెనుక నడవాల్సిందే హరికృష్ణతో కలిసి బస్సుయాత్ర చేసే ఆలోచన లేదు త్వరలోనే ‘తెలుగు వారి ఆత్మగౌరవయాత్ర’ చేపడతా.. సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో నివసించే వారిని తాము కాపాడతామంటే తాము కాపాడతామంటూ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారని, మన వారు ఇతర ప్రాంతాలకు వెళ్లి నివసిస్తున్నపుడు లేని ఇబ్బంది హైదరాబాద్‌లో నివసించే వారికి ఎందుకు వస్తుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడినా హైదరాబాద్‌లో నివసించే వారికి ఎలాంటి ఇబ్బందులూ ఉండవన్నారు. మంగళవారం చంద్రబాబు తన నివాసంలో సుమారు గంటకు పైగా విలేకరులనుద్దేశించి ప్రసంగించారు. యథావిధిగా ‘సాక్షి’ దినపత్రిక, చానల్‌పై తన అక్కసును వెళ్లగక్కారు. తాము తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చామని, దానికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ప్రజల్లోకి తీసుకెళతానని, ఈ పరిస్థితికి కారణమైన పార్టీల బాగోతాన్ని వివరిస్తానని చెప్పారు. పార్టీలో తన నిర్ణయం అంతిమమని చెప్పారు. ఇక్కడ బంధుత్వాలకు తావులేదని, అందరూ తన వెనక నడవాల్సిందేనన్నారు. తాను, నందమూరి హరికృష్ణ ఉమ్మడిగా బస్సుయాత్ర చేసే ఆలోచన లేదన్నారు. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం వల్ల ఒకరిద్దరు నేతలు ఉద్వేగానికిలోనై చేసే వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ సీమాంధ్ర ప్రాంతంలోని ప్రజలు స్థానిక ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఆందోళనలు చేస్తున్నారని కొత్త భాష్యం చెప్పారు. తాను ‘తెలుగువారి ఆత్మగౌరవ యాత్ర’ను చేపడతానని, అయితే ఎక్కడి నుంచి అనేది ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని కోరారు. తాను పదవుల కోసం రాజకీయం చేయటం లేదన్నారు. సీఎం పదవి రాకపోయినా తనకు ఇబ్బంది లేదని చెప్పారు. టీడీపీని ఇబ్బంది పెట్టడానికే: వచ్చే ఎన్నిక ల్లో విజయం సాధించి టీడీపీ అధికారంలోకి వస్తుందన్నఏకైక కారణంతో అనాలోచితంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన ప్రకటన చేసిందని చంద్రబాబు అన్నారు. కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల నిజస్వరూపం గురించి ప్రజలకు వివరిస్తానన్నారు. రాష్ర్ట విభజన ద్వారా తెలంగాణ ప్రాంతంలో ఎలాంటి లాభం లేకపోయినా ఓట్ల ద్వారా లబ్ధిపొందే టీ ఆర్ఎస్ను విలీనం చేసుకుని ఈ ప్రాంతంలో చక్రం తిప్పాలని కాంగ్రెస్ చూస్తోందన్నారు. సీమాంధ్ర ప్రాంతంలో తన వ్యతిరేక ఓటును వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు బదిలీ చే సి ఎన్నికల తరువాత విలీనం చేసుకోవాలని చూస్తోందన్నారు. ఇందుకోసం సీబీఐని కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంటోందన్నారు. ఆ ప్రక్రియలో భాగంగానే జగన్మోహన్రెడ్డికి సంబంధించి ఈ మధ్యకాలంలో ఎలాంటి అరెస్టులూ జరగలేదని ఆరోపించారు. జగన్మోహన్రెడ్డి కూడా జైలు నుంచి నేడో, రేపో విడుదలవుతారని చంద్రబాబు తీర్పిచ్చారు. జగన్మోహన్రెడ్డి ఇల్లు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీల మధ్య హాట్‌లైన్ ఉందన్నారు. ఒకవేళ హాట్‌లైన్ లేకపోతే కాంగ్రెస్ పార్టీ విభజన నిర్ణయం తీసుకోకముందే అందుకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ఎలా రాజీనామాలు చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనకు సంబంధించి కాంగ్రెస్ నేతలు, దిగ్విజయ్‌సింగ్, ముఖ్యమంత్రి పూటకోమాట మాట్లాడుతూ ప్రజలను ఆయోమయానికి గురి చేస్తున్నారని చెప్పారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న సమస్యలు, ప్రజలు పడుతున్న ఇబ్బందులకు కాంగ్రెస్ పార్టీనే కారణమని చంద్రబాబు ఆరోపించారు. ఈ ప్రశ్నలకు బదులేది? ఈ విలేకరుల సమావేశానికి ‘సాక్షి’ ప్రతినిధిని అనుమతించలేదు. వివిధ రూపాల్లో సేకరించిన సమాచారం మేరకు ‘సాక్షి’ ఈ వార్త ప్రచురిస్తోంది. మీడియా సమావేశానికి అనుమతించి ఉంటే చంద్రబాబును ‘సాక్షి’ ఈ ప్రశ్నలు అడిగేది.. - టీడీపీ అధికారంలోకి రాకుండా చేసేందుకే కాంగ్రెస్ విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని అంటున్నారు కదా, తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చింది మీరు కాదా? ఆ తర్వాత తెలంగాణ అంశాన్ని వెంటనే తేల్చమని, అఖిల పక్ష సమావేశం పెట్టాలని ప్రధానికి లేఖ రాసిన మాట వాస్తవం కాదా? - జగన్మోహన్రెడ్డి నివాసానికి, సీడబ్ల్యూసీకి మధ్య హాట్‌లైన్ ఉందని ఆరోపిస్తున్నారు కదా, సీడబ్ల్యూసీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడానికి ముందు కాంగ్రెస్ హైకమాండ్‌లోని కీలకమైన ముగ్గురు నేతలతో మీరు ఫోన్లో మాట్లాడిన అంశం హిందుస్థాన్ టైమ్స్ పత్రిక ప్రచురించింది. అంటే కాంగ్రెస్ నేతలు మీతో టచ్‌లో ఉన్నారని భావించాలా? లేక జగన్‌తోనా? - ‘మీ పార్టీ నాయకుడు (చంద్రబాబు) నన్ను కలిశారని’ స్వయంగా కేంద్ర మంత్రి చిదంబరం పార్లమెంట్ వేదికగా మీ పార్టీ ఎంపీలకు చెప్పారు కదా. అంటే కాంగ్రెస్ నేతలు ఎవరితో టచ్‌లో ఉన్నారంటారు? - నా రాజకీయ జీవితంలో ఇంత చెత్త నీచమైన ప్రభుత్వాన్ని చూడలేదంటున్న మీరు ఎఫ్‌డీఐలకు సంబంధించిన బిల్లు రాజ్యసభలోకి వచ్చినప్పుడు ఆ బిల్లు ఆమోదం పొందేలా స్వయంగా టీడీపీ ఎంపీలు సభ నుంచి గైర్హాజరై పరోక్షంగా బిల్లు నెగ్గడానికి ఉపయోగపడలేదా? - రాష్ట్రంలోని మిగిలిన అన్ని ప్రతిపక్షాలు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే దానికి మద్దతివ్వకుండా ప్రభుత్వాన్ని కాపాడిన మీరే కాంగ్రెస్‌పై నిందలు వేయడంలో ఆంతర్యమేంటి? - విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకటించగానే సీమాంధ్రలో రాజధాని నిర్మాణానికి నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు కావాలని కేంద్రాన్ని కోరింది మీరు కాదా? ఇప్పుడేమో హైదరాబాద్‌లో నివసించే ఇతర ప్రాంతాల వారికి ఇబ్బందులుండవని చెబుతున్నారు కదా.. అలాంటప్పుడు ఆత్మగౌరవ యాత్ర ఎందుకు చేపట్టాలనుకుంటున్నారు? -
కలిసుంటే కష్టాలు తీరుతాయి
సాక్షి, రాజమండ్రి : తెలుగు ప్రజలు కలిసుంటేనే కష్టాలు తీరుతాయని, విడిపోతే నష్టాల పాలవుతారనే విషయాన్ని ప్రజలకు చాటి చేప్పేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గంలో బస్సు యాత్రను ప్రారంభించింది. ఉదయం పది గంటలకు వీఎల్ పురంలోని సాయిబాబా ఆలయం వద్ద ప్రారంభమైన ఈ యాత్ర నగర వీధుల్లో కొనసాగి లాలాచెరువు వద్ద ముగిసింది. ‘ఆంధ్రా వేరు కాదు, తెలంగాణ వేరుకాదు, రాయలసీమ వేరుకాదు, మూడు ప్రాంతాలు కలిస్తేనే తెలుగు ప్రజలు సమైక్య శక్తిని చాటగలుగుతారు’ అంటూ వాడవాడలా ప్రచారం చేస్తూ ముందుకు సాగింది. ఈ యాత్రను ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, బొడ్డు భాస్కర రామారావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి మాట్లాడుతూ విడిపోతే రెండు ప్రాంతాల ప్రజలకు నష్టం వాటిల్లుతుందని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే సుభిక్షంగా ఉంటుందనే ఉద్దేశంతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమైక్యాంధ్ర ప్రదేశ్‌ను కాంక్షిస్తున్నారన్నారు. సోనియా తన కుమారుడు రాహుల్‌గాంధీని ప్రధానిని చేయాలన్న లక్ష్యంతో రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు పూనుకున్నారని విమర్శించారు. రాష్ట్రం రెండు ముక్కలుగా విడిపోతే విద్యుత్తు, సాగునీటి సమస్యలు తలెత్తుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వైఖరిని అవలంబిస్తున్నాయన్నారు. తెలంగాణ విడిపోతే సీమాంధ్ర ప్రాంతంలో యువతకు ఉపాధి అవకాశాలు తగ్గుతాయన్నారు. టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ద్వారా చంద్రబాబు నాయుడు విభజనకు అంగీకరిస్తూ లేఖ పంపడం వల్లనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో విభజన చిచ్చు రగులుకుందని దుయ్యబట్టారు. విభజన నెపాన్ని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై నెడుతున్న చంద్రబాబు.. సీఎం కిరణ్ మాటలకు వంత పాడుతూ అధికార పార్టీకి అండగా నిలుస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు మాట్లాడుతూ ప్రజలు సమైక్యంగానే ఉండాలని కోరుకుంటున్నారన్నారు. సమైక్య వాదాన్ని పార్లమెంటరీ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల ప్రజల వద్ద బలంగా వినిపిస్తామన్నారు. పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి టి.కె.విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఇప్పటికీ మన ఎంపీలు ప్రజలను మభ్యపెట్టేలా వ్యవహరిస్తున్నారన్నారు. భారీ మోటార్ బైక్ ర్యాలీ ముందుగా మోటారు బైక్‌ల భారీ ర్యాలీ మొదలవ్వగా, బస్సు యాత్ర అనుసరించింది. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు బైక్ నడిపి కార్యకర్తలను ఉత్తేజపరిచారు. అడుగడుగునా సమైక్యాంధ్ర నినాదాలను మారుమోగించారు. ఈ యాత్ర మధ్యాహ్నానికి పుష్కర్‌ఘాట్ చేరుకుంది. అక్కడ వంటావార్పు నిర్వహించి సహపంక్తి భోజనాలు చేశారు. అనంతరం ప్రధాన ప్రాంతాల్లో కొనసాగిన యాత్రలాలాచెరువులోని వైఎస్ విగ్రహం వద్ద ముగిసింది. ఈ యాత్రలో పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ నాయకుడు బొడ్డు వెంకటరమణ చౌదరి, గోపాలపురం ఎమ్మెల్యే తానేటి వనిత, అర్బన్ కోఆర్డినేటర్ బొమ్మన రాజ్‌కుమార్, రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, మైనారిటీ సెల్ జిల్లా కన్వీనర్ నయూమ్, సాంస్కృతిక విభాగం కన్వీనర్ గారపాటి ఆనంద్ పాల్గొన్నారు. -
బాబు బస్సు యాత్రకు బ్రేక్