
జగన్‌ను కలిసిన రైతు నాయకులు
రాష్ట్రంలోని ప్రాజెక్టులను పరిశీలించేందుకు బస్సుయాత్రను చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని...
తిరుపతి మంగళం : రాష్ట్రంలోని ప్రాజెక్టులను పరిశీలించేందుకు బస్సుయాత్రను చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డిని శనివారం పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో పాటు పార్టీ రైతువిభాగం జిల్లా అధ్యక్షుడు టి.ఆదికేశవులురెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం.కొండ్రెడ్డి, హరీష్‌కుమార్ కలిసి జిల్లాలోని రైతుల సమస్యలను వివరించారు.
రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టేందుకు తమ పార్టీ అధ్యక్షుడు చేస్తున్న బస్సుయాత్రకు విశేష స్పందన లభిస్తోందని వారు అన్నారు.