
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త బస్సుయాత్రకు మరో మూడు రోజుల షెడ్యూల్ తయారైంది. ఈనెల 15 నుంచి 18 వరకు వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల పరిధిలోని ములుగు, వరంగల్, వర్ధన్నపేట, పినపాక, ఇల్లెందు, భద్రాచలం నియోజకవర్గాలో బస్సుయాత్ర చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్ణయించారు.