రైతు ద్రోహి చంద్రబాబు
రైతు ద్రోహి చంద్రబాబు
Published Sat, Dec 10 2016 9:37 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
– రైతు రక్షణ యాత్రలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి రామచంద్రయ్య
ఆలూరు రూరల్/ ఆస్పరి: రైతు ద్రోహి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడని ఏపీ రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి రామచంద్రయ్య ధ్వజమెత్తారు. రైతు రక్షణ బస్సు యాత్ర ..శనివారం ఆస్పరి మండల కైరుప్పల, ఆలూరులో కొసాగింది. ఈ రైతు సంఘం నాయకులు ఉల్లి, వంకాయ కూరగాయలు దండలు వేసుకుని కైరుప్పలలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. బహిరంగ సభల్లో రామచంద్రయ్య మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు రుణ మాఫీ చేస్తానని చెప్పి రైతులను మోసం చేశారని విమర్శించారు. వేదావతి నదిపై ప్రాజెక్టు నిర్మిస్తానని హామీ ఇచ్చి మరిచారన్నారు. హంద్రీనీవా నీటితో చెరువులను నింపుతానని ప్రకటించి కరువొచ్చినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కరువు బారిన పడిన రైతులకు పరిహారం అందించడంలో విఫలమయ్యారన్నారు. రైతుల హక్కుల సాధన కోసం ఏపీ రైతుసంఘం ఆధ్వర్యంలో పత్తికొండ నుంచి విజయవాడ వరకు, అలాగే శ్రీకాకుళం జిల్లా నుంచి విజయవాడ వరకు రైతు రక్షణ యాత్ర పేరుతో బస్సుయాత్రను ప్రారంభించామన్నారు. రైతు రక్షణ యాత్రలో ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జగన్నాథం, సహాయ కార్యదర్శి గిడ్డయ్య, నియోజకవర్గ కార్యదర్శి జగదీష్, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు శివయ్య, ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు పాల్గొన్నారు.
Advertisement
Advertisement