13 నుంచి సమైక్య శంఖారావం
Published Sun, Sep 8 2013 2:14 AM | Last Updated on Fri, Sep 1 2017 10:32 PM
కాకినాడ, న్యూస్‌లైన్:వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావ యాత్ర ఈనెల 13న జిల్లాకు రానుంది. జిల్లాలో రెండు రోజుల పాటు సాగే ఈ యాత్రలో రావులపాలెం, అమలాపురం, కాకినాడల్లో సభలు నిర్వహించనున్నారు. షర్మిల పర్యటించే ప్రాంతాలు, షెడ్యూల్ ఖరారు, ఇతర అంశాలపై చర్చించేందుకు కాకినాడలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి అధ్యక్షతన శనివారం సాయంత్రం సీజీసీ సభ్యులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలు, నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు, అనుబంధ సంఘాల కన్వీనర్ల సమావేశం జరిగింది. సమావేశం అనంతరం చిట్టబ్బాయి షర్మిల బస్సుయాత్ర వివరాలను విలేకరులకు తెలియజేశారు.
సమైక్య శంఖారావయాత్ర ఈనెల 13వ తేదీ ఉదయం 10.30 గంటలకు రావులపాలెం చేరుకుంటుందన్నారు. అక్కడ జరిగే సభలో షర్మిల ప్రసంగిస్తారని తెలిపారు. అనంతరం 4 గంటలకు అమలాపురంలో జరిగే సభలో ఆమె మాట్లాడతారన్నారు. రాత్రికి షర్మిల అమలాపురంలోనే బస చేస్తారని, 14వ తేదీ ఉదయం 10.30 గంటలకు కాకినాడలో జరిగే సభలో ప్రసంగిస్తారని పేర్కొన్నారు. పిఠాపురం, తుని మీదుగా విశాఖ జిల్లా వెళతారన్నారు. సమైక్య శంఖారావ బస్సుయాత్రను విజయవంతం చేయాలని చిట్టబ్బాయి పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. షర్మిల పర్యటనపై చర్చించేందుకు ఈ నెల 10వ తేదీన ఉదయం 10 గంటలకు ముమ్మిడివరంలో, 12 గంటలకు అమలాపురంలో, 3 గంటలకు పి.గన్నవరంలో, 5 గంటలకు రాజోలులో నియోజకవర్గాల నేతలు, పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తామన్నారు.
ఈ సమావేశంలో సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్ గంపల వెంకటరమణ, ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కర రామారావు, ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పెండెం దొరబాబు, చిర్ల జగ్గిరెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి, మాజీ ఎంపీ ఏజేవీ బుచ్చిమహేశ్వరరావు, కాకినాడ నగర కన్వీనర్ ఆర్‌వీజేఆర్ కుమార్, వివిధ నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లు విప్పర్తి వేణుగోపాలరావు, దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన వేణు, కొండేటి చిట్టిబాబు, ఆకుల వీర్రాజు, గుత్తుల సాయి, జిల్లా అధికార ప్రతినిధి పి.కె.రావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
జిల్లా మహిళ, ఎస్సీ, వాణిజ్య, బీసీ, రైతు, మైనార్టీ, చేనేత, ఇండస్ట్రీయల్, సేవాదళ్, వికలాంగ, విభాగాల కన్వీనర్లు రొంగలి లక్ష్మి, శెట్టిబత్తుల రాజబాబు, కర్రి పాపారాయుడు, గుత్తుల రమణ, రెడ్డి రాధాకృష్ణ, నయీమ్, పంపన రామకృష్ణ, మంతెన రవిరాజు, మార్గాని గంగాధర్, నలమాటి లంకరాజు, రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి సుంకర చిన్ని, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కార్యదర్శి టీకే విశ్వేశ్వరరెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యురాలు ఎన్. వసుంధర, నాయకులు వరుపుల సూరిబాబు, కాలే రాజబాబు, ముత్యాల సతీష్, కుసునం దొరబాబు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
Advertisement