sharimala
-
‘జగన్‌కు షర్మిల రాసిన లేఖ బాబుకు ఎలా చేరింది?’
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్ మళ్లీ సీఎం కాకూడదనే అజెండాతోనే షర్మిల పనిచేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఆస్తి తగాదా అయితే పరిష్కరించుకోవచ్చు.. ఆమెది ఆస్తి తగాదా కాదు.. అధికారం కోసం తగాదా అంటూ ఆయన ధ్వజమ్తెతారు.చంద్రబాబుతో కలిసికుట్ర..‘‘షర్మిల ప్రెస్మీట్లు 95 శాతం జగన్‌ను విమర్శించడానికే.. చంద్రబాబు కళ్లలో ఆనందం కోసమే షర్మిల ప్రెస్మీట్లు. షర్మిల.. బాబుతో కలిసి పనిచేస్తున్నారు. తల్లికి, చెల్లికి అన్యాయం అంటూ చంద్రబాబు చెప్పించారు. జగన్‌పై మహిళల్లో వ్యతిరేకత రావాలని బాబు మాట్లాడిస్తున్నారు. జగన్‌కు షర్మిల రాసిన లేఖ చంద్రబాబుకు ఎలా చేరింది?’’ అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. వైఎస్సార్ మరణానికి ముందు బాబు మాటలు గుర్తులేవా?‘‘వైఎస్సార్ ఘోరమైన మరణం పొందుతారని చంద్రబాబు అన్నారు. వైఎస్సార్ మరణానికి ముందు చంద్రబాబు చెప్పిన మాటలు గుర్తులేదా?. ప్రత్యర్థికి మేలు చేసేందుకు సొంత అన్నకు అన్యాయం చేస్తున్నారు. ఎల్లో మీడియాతో కలిసి జగన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. మీ తండ్రి మరణానికి కారణమైన వ్యక్తులతో చేతులు కలుపుతారా?. చంద్రబాబుతో కలిసి జగన్‌పై కుట్ర పన్నడం న్యాయమేనా?. షర్మిల చేసే పనికి దివంగత వైఎస్సార్ ఆత్మ క్షోభిస్తుంది.’’ అని విజయసాయిరెడ్డి చెప్పారు.బాబు మేలు కోసం సొంత అన్ననే మోసం చేస్తావా?‘‘చంద్రబాబు అత్యంత దుర్మార్గుడు.. ఆయనతో స్నేహం ఎంతమాత్రం మంచిది కాదు. వైఎస్సార్ మృతికి కారణమైన కాంగ్రెస్,బాబుతో చేతులు కలుపుతారా?. మీ అన్నను జైల్లో పెట్టి హింసించిన కాంగ్రెస్‌లో ఉంటారా?. చంద్రబాబు మేలు కోసం సొంత అన్నను మోసం చేస్తారా?. ఇలాంటి విషపు పామును ఎక్కడా చూడలేదు. వైఎస్సార్ ఉన్నప్పుడే జగన్, షర్మిలకు ఆస్తులు పంచారు. చెల్లిపై ప్రేమతో జగన్ తన ఆస్తిలో 40 శాతం వాటా ఇస్తామన్నారు. కోర్టు కేసుల పరిష్కారం తర్వాత ఇస్తామన్నారు. కానీ మీరు రిటర్న్ గిఫ్ట్‌గా ఏం ఇచ్చారు?. షేర్ ట్రాన్స్ఫర్ డీడ్స్, జగన్ సంతకాలు లేకుండా దొంగ సంతకాలతో నిబంధనలు ఉల్లంఘించారు. జగన్‌ను జైలుకు పంపడానికే చంద్రబాబుతో షర్మిల లాలూచీ పడ్డారు...షేర్ ట్రాన్స్ఫర్ అయితే జగన్ బెయిల్ రద్దు అవుతుంది.ఈ విషయం తెలిసే జగన్ బెయిల్ క్యాన్సిల్ అయ్యేలా కుట్ర చేశారు. జగన్‌ను జైలుకు పంపడమే చంద్రబాబు, షర్మిల లక్ష్యం. నష్టాలతో నడిచిన సంస్థలను జగన్ లాభాల్లోకి తెచ్చారు. నష్టాల్లో ఉన్నప్పుడు షర్మిల ఏం చేశారు? జగన్ అతి మంచితనం ఆయనకు అనర్థాలను తెచ్చిపెడుతోంది.’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.ఇదీ చదవండి: గురి తప్పిన బాణం వెనుక..! -
రివ్యూ పిటిషన్ వెయ్యబోం: కేరళ
తిరువనంతపురం: అన్ని వయసుల మహిళలకు శబరిమల ఆలయ ప్రవేశానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయబోమని కేరళ సర్కారు స్పష్టం చేసింది. అక్టోబర్ 16న భక్తులందరికీ దర్శనాలకు అనుమతించనున్న నేపథ్యంలో మహిళా భక్తుల దర్శనం కోసం ఏర్పాట్లు చేయాలని ట్రావెన్కోర్ దేవస్థాన బోర్డు నిర్ణయించింది. సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తూ బుధవారం వందలాది మంది అయ్యప్ప భక్తులు (అందులో మహిళలూ ఉన్నారు) కేరళలోని జాతీయ రహదారులను నిర్భందించారు. -
షర్మిలపై బురద చల్లడం గర్హనీయం
దుష్ర్పచారంపై వైఎస్సార్ కాంగ్రెస్ మహిళా ఎంపీల ధ్వజం హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిలపై బురదజల్లి అప్రతిష్టపాలు చేసేందుకు యత్నించడం గర్హనీయమని వైఎస్సార్ కాంగ్రెస్ మహిళా ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీలు కొత్తపల్లి గీత(అరకు), బుట్టా రేణుక(కర్నూలు) శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో ఎదుగుతున్న ఒక మహిళా నాయకురాలిపై సోషల్ మీడియాలో దుష్ర్పచారం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. రాజకీయ కారణాలతో షర్మిలపై అభూత కల్పనలు సృష్టించి ప్రచారం చేయడమనేది దిగజారుడు చర్య అని వారు పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు, వెబ్సైట్లు షర్మిలపై తప్పుడు ప్రచారం చేయడాన్ని సమాజంలో మనసున్న ప్రతి మహిళా ప్రతిఘటించాలని, తనపై జరుగుతున్న దుష్ర్పచారంపై ఆమె చేస్తున్న పోరాటంలో తాము వెంట నిలుస్తామని గీత పేర్కొన్నారు. -
నిస్సిగ్గుగా బాబు వాగ్దానాలు
అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశావు టీడీపీ అధ్యక్షుడిని ప్రశ్నించిన షర్మిల ఇప్పుడు అన్నీ అబద్ధపు హామీలిస్తున్నావు బాబుకు ఓటడిగే హక్కు లేదు వైఎస్సార్ జనం గుండెల్లో ఉన్నారు.. ఓటేసే ముందు ఆయనను గుర్తుచేసుకోండి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి హైదరాబాద్: ‘‘రాష్ట్రాన్ని సింగపూర్, జపాన్‌లా మారుస్తానని.. అన్నీ ఉచితంగా ఇస్తానంటూ నిస్సిగ్గుగా వాగ్దానాలు చేస్తున్న చంద్రబాబు.. తాను అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు’’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ సోదరి షర్మిల ప్రశ్నించారు. మంగళవారం మల్కాజ్గిరి లోక్‌సభ స్థానం పరిధిలోని కుత్బుల్లాపూర్, షాపూర్‌నగర్, మల్కాజ్గిరి, కంటోన్మెంట్, శాంతినగర్, ఎల్బీనగర్లో నిర్వహించిన బహిరంగ సభలు, రోడ్‌షోల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాజరైన అశేష జనసందోహాన్ని ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. వైఎస్సార్ తన ఐదేళ్ల పాలనాకాలంలో పేదలపై ఒక్క రూపాయి కూడా భారం పడకుండా చూస్తే... తర్వాత కాంగ్రెస్ సర్కారు జనంపై రూ. 32 వేల కోట్ల భారం మోపిందని మండిపడ్డారు. రైతులు, విద్యార్థులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, వృద్ధులు ఇలా అని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చిన ఘనత వైఎస్సార్‌దేనని గుర్తు చేశారు. వైఎస్సార్ జనం గుండెల్లో ఉన్నారని చెప్పారు. పేదల కోసం ఆయన ఆరోగ్యశ్రీ, 108, 104, ఫీజు రీయింబర్స్మెంట్, రాజీవ్ గృహకల్ప వంటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. చంద్రబాబునాయుడు తన తొమ్మిదేళ్ల పాలనలో 16 లక్షల మందికి పింఛన్లు ఇస్తే.. వైఎస్సార్ 71 లక్షల మందికి పింఛన్లు ఇచ్చారన్నారు. చంద్రబాబునాయుడు తన పాలనాకాలంలో ఎనిమిదిసార్లు విద్యుత్ చార్జీలు పెంచారని, వైఎస్ ఒక్క రూపాయి కూడా పెంచలేదని షర్మిల వివరించారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినపుడు ప్రతిపక్ష నేత అయి ఉండీ విప్ జారీ చేసి కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించిన ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు. కేంద్రంలో, రాష్ట్రంలో రెండు మార్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరునే ఎఫ్ఐఆర్లో చేర్చిన ఘనత కాంగ్రెస్‌దని మండిపడ్డారు. సీల్డ్ కవర్ సీఎం కొర్రీలు.. సీల్డ్ కవర్ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తన పాలనలో మహానేత ప్రవేశపెట్టిన జనరంజక పథకాలకు కొర్రీల మీద కొర్రీలు వేశారని, అన్ని చార్జీలు పెంచడమే అజెండాగా పెట్టుకొని పాలన చేశారని షర్మిల విమర్శించారు. ఓట్లడిగే హక్కు వారికి లేదు.. టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీలు ప్రజా సమస్యలపై ఏ ఒక్క పోరాటం చేయలేదని.. వారికి ఓట్లడిగే నైతిక హక్కు లేదని షర్మిల స్పష్టం చేశారు. పదేళ్లుగా ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఏరోజూ ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక పోరాటం చేయలేదని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సుదీర్ఘపోరాటం చేసిన ఘనత జగన్మోహన్రెడ్డిదేనని గుర్తుచేశారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగిపోవద్దని, ఓటు వేసే ముందు మహానేత వైఎస్సార్‌ను గుర్తుకు తెచ్చుకోవాలని ప్రజలకు షర్మిల విజ్ఞప్తి చేశారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాగా, మల్కాజ్గిరి లోక్‌సభ అభ్యర్థి దినేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. మల్కాజ్‌గిరిని నంబర్‌వన్ పార్లమెంట్ స్థానంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఎల్బీ నగర్ అభ్యర్థి పుత్తా ప్రతాప్‌రెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే అభ్యర్థి జి.సూర్యనారాయణ రెడ్డి, కుత్బుల్లాపూర్ అభ్యర్థి కొలన్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు సభల్లో మాట్లాడారు. -
12నుంచి షర్మిల సమైక్య శంఖారావం
ఏలూరు (ఆర్ఆర్ పేట), న్యూస్‌లైన్ :సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావం బస్సు యాత్ర ఈనెల 12న జిల్లాలోకి ప్రవేశించనుందని పార్టీ జిల్లా కన్వీనర్, పోల వరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తెలిపారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన నియోజకవర్గాల కన్వీనర్లు, పార్టీ ముఖ్య నాయకుల సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 12న మధ్యాహ్నం 3గంటలకు స్థానిక ఫైర్‌స్టేషన్ సెంట ర్లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తారని చెప్పారు. ఆ రోజు రాత్రి ఏలూరులో బస చేస్తారని వివరించారు. 13న ఉదయం ఏలూరు నుంచి బస్సు యాత్ర బయలుదేరుతుందన్నారు. అనంతరంతూర్పుగోదావరి జిల్లా రావులపాలెం చేరుకుంటారని వెల్లడించారు. బహిరంగ సభను, బస్సు యూత్రను జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఇంతకుముందు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నిర్వహిం చిన షర్మిల ప్రపంచ రాజకీయాల్లోనే సరి కొత్త చరిత్ర సృష్టించారని బాలరాజు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించే ప్రయత్నాలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతోందని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఇప్పటికే అనేక కార్యక్రమాలు నిర్వహించామని గుర్తుచేశారు. పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు విభజన ప్రకటన వెలువడిన వెంటనే రాజీనామా చేశారని తెలిపారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ 5 రోజులు, పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి 7 రోజులు నిరాహార దీక్ష చేసి సమైక్య వాదానికి కట్టుబడి ఉన్న విషయాన్ని స్పష్టం చేశారని చెప్పారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల వైఖరి కారణంగానే రాష్ట్రం అగ్నిగుండంగా మారిందని బాలరాజు విమర్శిం చారు. ఈ పరిస్థితుల్లోనూ చంద్రబాబునాయుడు ప్రజలను మోసం చేయడానికి ఆత్మగౌరవ యాత్ర చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సమైక్య వాదానికి కట్టుబడి ఉన్నప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ జగన్మోహన్రెడ్డిని చంద్రబాబు విమర్శించడం విడ్డూరంగా ఉందని పేర్కొ న్నారు. అసలు విధానమే లేని బాబు ఏ మొహం పెట్టుకుని ప్రజల ముందుకు వస్తున్నారని దుయ్యబట్టారు. సమైక్యవాదాన్ని, నాదాన్ని ఢిల్లీకి వినిపిస్తాం : నాని ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని మాట్లాడుతూ సమైక్య శంఖారావంలో భాగంగా షర్మిల నిర్వహించనున్న సభను విజ యవంతం చేయడానికి ఏలూరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. సమైక్య శంఖారావం బహిరంగ సభను జయప్రదం చేయడానికి సమైక్య వాదులు సైతం ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే వివిధ జిల్లాలో సమైక్య శంఖారావం యాత్రను సమైక్యవాదులు, ప్రజలు స్వాగతించడం శుభపరిణామమన్నారు. షర్మిల సభ సందర్భంగా సమైక్యవాదాన్ని, నాదాన్ని ఢిల్లీ వరకూ వినిపిస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడుతూ షర్మిల సభకు 15 నియోజకవర్గాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటు ప్రజలు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. సమైక్య వాణిని తమ పార్టీ నాయకులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదిలోనే పార్లమెంటులో వినిపించారని గుర్తు చేశారు. ఆత్మగౌరవ యాత్ర పేరిట చంద్రబాబు బస్సుయూత్ర చేయడాన్ని ప్రజలు నమ్మ టం లేదని పేర్కొన్నారు. చంద్రబాబు మాటల్లో పొంతన లేకపోవడమే ప్రజల అపనమ్మకానికి కారణమైందన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ నియోజకవర్గాల కన్వీనర్లు తోట గోపి, పాతపాటి సర్రాజు, తలారి వెంకటరావు, చలమోలు అశోక్‌గౌడ్, కొఠారు రామచంద్రరావు, కర్రా రాజారావు, చీర్ల రాధయ్య, గొట్టుముక్కల భాస్కరరాజు, పార్టీ జిల్లా మహిళా కన్వీనర్ గూడూరి ఉమాబాల పాల్గొన్నారు. -
13 నుంచి సమైక్య శంఖారావం
కాకినాడ, న్యూస్‌లైన్:వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావ యాత్ర ఈనెల 13న జిల్లాకు రానుంది. జిల్లాలో రెండు రోజుల పాటు సాగే ఈ యాత్రలో రావులపాలెం, అమలాపురం, కాకినాడల్లో సభలు నిర్వహించనున్నారు. షర్మిల పర్యటించే ప్రాంతాలు, షెడ్యూల్ ఖరారు, ఇతర అంశాలపై చర్చించేందుకు కాకినాడలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి అధ్యక్షతన శనివారం సాయంత్రం సీజీసీ సభ్యులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలు, నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు, అనుబంధ సంఘాల కన్వీనర్ల సమావేశం జరిగింది. సమావేశం అనంతరం చిట్టబ్బాయి షర్మిల బస్సుయాత్ర వివరాలను విలేకరులకు తెలియజేశారు. సమైక్య శంఖారావయాత్ర ఈనెల 13వ తేదీ ఉదయం 10.30 గంటలకు రావులపాలెం చేరుకుంటుందన్నారు. అక్కడ జరిగే సభలో షర్మిల ప్రసంగిస్తారని తెలిపారు. అనంతరం 4 గంటలకు అమలాపురంలో జరిగే సభలో ఆమె మాట్లాడతారన్నారు. రాత్రికి షర్మిల అమలాపురంలోనే బస చేస్తారని, 14వ తేదీ ఉదయం 10.30 గంటలకు కాకినాడలో జరిగే సభలో ప్రసంగిస్తారని పేర్కొన్నారు. పిఠాపురం, తుని మీదుగా విశాఖ జిల్లా వెళతారన్నారు. సమైక్య శంఖారావ బస్సుయాత్రను విజయవంతం చేయాలని చిట్టబ్బాయి పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. షర్మిల పర్యటనపై చర్చించేందుకు ఈ నెల 10వ తేదీన ఉదయం 10 గంటలకు ముమ్మిడివరంలో, 12 గంటలకు అమలాపురంలో, 3 గంటలకు పి.గన్నవరంలో, 5 గంటలకు రాజోలులో నియోజకవర్గాల నేతలు, పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్ గంపల వెంకటరమణ, ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కర రామారావు, ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పెండెం దొరబాబు, చిర్ల జగ్గిరెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి, మాజీ ఎంపీ ఏజేవీ బుచ్చిమహేశ్వరరావు, కాకినాడ నగర కన్వీనర్ ఆర్‌వీజేఆర్ కుమార్, వివిధ నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లు విప్పర్తి వేణుగోపాలరావు, దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన వేణు, కొండేటి చిట్టిబాబు, ఆకుల వీర్రాజు, గుత్తుల సాయి, జిల్లా అధికార ప్రతినిధి పి.కె.రావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళ, ఎస్సీ, వాణిజ్య, బీసీ, రైతు, మైనార్టీ, చేనేత, ఇండస్ట్రీయల్, సేవాదళ్, వికలాంగ, విభాగాల కన్వీనర్లు రొంగలి లక్ష్మి, శెట్టిబత్తుల రాజబాబు, కర్రి పాపారాయుడు, గుత్తుల రమణ, రెడ్డి రాధాకృష్ణ, నయీమ్, పంపన రామకృష్ణ, మంతెన రవిరాజు, మార్గాని గంగాధర్, నలమాటి లంకరాజు, రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి సుంకర చిన్ని, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కార్యదర్శి టీకే విశ్వేశ్వరరెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యురాలు ఎన్. వసుంధర, నాయకులు వరుపుల సూరిబాబు, కాలే రాజబాబు, ముత్యాల సతీష్, కుసునం దొరబాబు, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
11న షర్మిల సమైక్య శంఖారావం
సాక్షి, గుంటూరు: ఉద్యమాల పురిటిగడ్డ గుంటూరు జిల్లాలో మహానేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల ఈ నెల 11న సమైక్య శంఖం పూరించనున్నారు. ప్రజాభీష్టానికి పెద్ద పీట వేస్తూ, కాంగ్రెస్, టీడీపీ చీకటి ఒప్పందాలను బహిర్గతం చేస్తూ సమైక్యాంధ్ర కోసం బస్సుయాత్ర చేపట్టిన షర్మిల వినుకొండ, రేపల్లె బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. కేవలం ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్ ఏకపక్షంగా తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఎండగడుతూ షర్మిల జిల్లాలో యాత్ర చేయనున్నారు. అధికారం కోసం ఏకమైన కాంగ్రెస్, టీడీపీల కుట్రలను ప్రజలకు వివరిస్తూ షర్మిల చేస్తున్న యాత్రకు గుంటూరు జిల్లాలోని సమైక్యవాదులు సంఘీభావం ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. ఆమె రాక కోసం ఎదురు చూస్తున్నారు. ప్రజా కంటక పాలనను నిరసిస్తూ షర్మిల ఫిబ్రవరిలో జిల్లాలో 33 రోజులు పాదయాత్ర నిర్వహించారు. ఇప్పుడు ప్రజాభిప్రాయానికి పట్టం కడుతూ సమైక్యాంధ్ర కోసం శంఖారావం పూరిస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శుక్రవారం కేంద్ర హోం మంత్రి షిండేకు లేఖ రాసిన సంగతి తెలిసిందే.