
సుప్రీంతీర్పును వ్యతిరేకిస్తూ ఆందోళ చేస్తున్న మహిళలు
తిరువనంతపురం: అన్ని వయసుల మహిళలకు శబరిమల ఆలయ ప్రవేశానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయబోమని కేరళ సర్కారు స్పష్టం చేసింది. అక్టోబర్ 16న భక్తులందరికీ దర్శనాలకు అనుమతించనున్న నేపథ్యంలో మహిళా భక్తుల దర్శనం కోసం ఏర్పాట్లు చేయాలని ట్రావెన్‌కోర్ దేవస్థాన బోర్డు నిర్ణయించింది. సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తూ బుధవారం వందలాది మంది అయ్యప్ప భక్తులు (అందులో మహిళలూ ఉన్నారు) కేరళలోని జాతీయ రహదారులను నిర్భందించారు.