ప్రచార వేగాన్ని పెంచిన హిల్లరీ.. | Clinton, Kaine begins bus tour | Sakshi
Sakshi News home page

ప్రచార వేగాన్ని పెంచిన హిల్లరీ..

Published Sat, Jul 30 2016 10:39 AM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM

ప్రచార వేగాన్ని పెంచిన హిల్లరీ..

ప్రచార వేగాన్ని పెంచిన హిల్లరీ..

వాషింగ్టన్: డెమోక్రటిక్ పార్టీ తరపున ప్రెసిడెన్షియల్ నామినీ హిల్లరీ క్లింటన్ ప్రచార వేగాన్ని పెంచారు. తన వైస్ ప్రెసిడెంట్ క్యాండెట్, వర్జీనియా సెనెటర్ టిమ్ కెయినీతో కలిసి ఆమె మూడు రోజుల బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్నటువంటి ఒహియో, పెన్సుల్వేనియాలోని పలు ప్రాంతాల్లో.. సుమారు 600 మైళ్ళు వారి బస్సు యాత్ర కొనసాగనుంది. రాయల్ బ్లూ పెయింటింగ్తో ఉన్న బస్సుపై 'స్ట్రాంగర్ టుగెదర్' అనే స్లోగన్ ఆకట్టుకుంటోంది.

వస్తుతయారీ పరిశ్రమకు సంబంధించిన ప్రజలను కలుసుకోబోతున్నామని హిల్లరీ ఈ సందర్భంగా వెల్లడించారు. ఉద్యోగాల కల్పనకు సంబంధించిన ప్రణాళికలతో పాటు.. మధ్యతరగతి ప్రజలను ఆకర్షించడం లక్ష్యంగా చేసుకొని ఈ పర్యటన జరుగుతోందని సీబీఎస్ మీడియా వెల్లడించింది. బస్సు యాత్రలో భాగంగా పిట్స్బర్గ్, ఓహియో, యంగ్స్టౌన్ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ర్యాలీలో హిల్లరీ పాల్గొంటారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement