విశాఖ పోర్టులో నిలిచిన నౌక
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నుంచి పోర్టుబ్లెయిర్ బయల్దేరాల్సిన ప్యాసింజర్ నౌక విశాఖ పోర్టులో చిక్కుకుపోయింది. ఈ నౌకలో ప్రయాణిస్తున్న సుమారు 1149 మంది అన్నపానియాల్లేక రెండ్రోజులుగా అల్లాడిపోతున్నారు. ఈ నౌక బుధవారం సాయంత్రం బయల్దేరాల్సి ఉంది. రోను తుపాన్‌తో వాతావరణ శాఖ క్లియరెన్స్ ఇవ్వలేదు. విషయం తెలుసుకున్న మంత్రి అయ్యన్నపాత్రుడు కలెక్టర్ యువరాజ్ దృష్టికి తీసుకొచ్చారు. అధికారులు భోజన ఏర్పాట్లు చేశారు.