ఎమ్మెల్యేకి తమ్ముళ్ల షాక్‌ | Shock to TDP as MLA | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేకి తమ్ముళ్ల షాక్‌

Published Sun, Oct 22 2017 5:45 PM | Last Updated on Fri, Aug 10 2018 8:31 PM

Shock to TDP as MLA  - Sakshi

విజయనగరం జిల్లా : గ్రామ సమస్యలను పరిష్కరించకపోవడంపై తెలుగుదేశం కార్యకర్తలు సాక్షాత్తు తమ పార్టీ ఎమ్మెల్యేని నిలదీశారు. లక్ష్మీపురం, చెల్లంనాయుడువలస గ్రామాల్లో శనివారం మండల టీడీపీ అధ్యక్షుడు టి.వెంకటప్పలనాయుడు ఆధ్వర్యంలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే బి.చిరంజీవులు ప్రభుత్వ పథకాలను వివరిస్తుండగా తెలుగుదేశం కార్యకర్తలు కలుగజేసుకుని గ్రామంలో కాలనీకి రోడ్డు వేస్తామని, పాతూరులో కాలువలు నిర్మిస్తామని హామీ ఇచ్చినా కార్యరూపం దాల్చకపోవడంపై ప్రశ్నించారు. అప్పులు చేసి ఇళ్లు నిర్మించుకున్నా ఇంతవరకూ ఎందుకు బిల్లులు కాలేదని ప్రశ్నించారు. సమస్యలను దశల వారీగా పరిష్కర్తిస్తానని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సిహెచ్‌.సత్యవతి, ఎంపీపీ బి.రామలక్ష్మి, జెడ్పీటీసీ టి.సావిత్రమ్మ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement