భైంసా, న్యూస్‌లైన్ : పట్టణంలోని ధ్రువ జిన్నింగ్ ఫ్యాక్టరీలో ప్రెస్సింగ్ యూనిట్‌లోబుధవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రెస్సింగ్ యూనిట్‌లో జిన్నింగ్ యంత్రాలు పనిచేస్తున్నాయి. అదే సమయంలో షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం సంభవించింది. మంటలు బెల్టుకు అంటుకుని జిన్నింగ్ యంత్రాలు దగ్ధమయ్యాయి. జిన్నింగ్ యంత్రాల్లో బెల్టులు ఇతర సామగ్రి కాలిపోయూరుు.
జిన్నింగ్‌లో పనిచేసే సిబ్బంది ప్రమాదాన్ని గమనించి అగ్నిమాపకశాఖ అధికారులకు సమాచారం అందించారు. రెండు అగ్నిమాపక శకటాలతో ప్రమాద స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రెస్సింగ్ యూనిట్ ముందు నిల్వ ఉంచిన పత్తిని యాజమాన్యం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. యూనిట్‌ను ఆనుకుని ఉన్న పత్తి కొంత మేర దగ్ధమైంది. ఈ ప్రమాదంలో రూ.4 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లిందని యాజమాన్యం తెలిపింది.
జిన్నింగ్ మిల్లులో షార్ట్ సర్క్యూట్
Published Thu, Jan 30 2014 3:36 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement
Advertisement