short circut
-
తొలి ఆడబిడ్డ వచ్చిందన్న ఆనందం.. అంతలోనే ఊహించని విషాదం!
సాక్షి, చెన్నై: తమ కుటుంబంలోకి తొలి ఆడబిడ్డ వచ్చిందన్న ఆనందంలో ఉన్న ఓ కుటుంబాన్ని ఏసీ రూపంలో మృత్యువు కబళించడంతో ఆ కుటుంబంలో విషాదం నింపింది. మనవరాలు పుట్టిన ఆనందంలో అతిగా మద్యం తాగి నిద్రకు ఉపక్రమించిన బిల్డర్ ఏసీలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్నిప్రమాదంలో సజీవ దహనం అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. చెన్నై చూలైమేడు ఇలంగో అడిగల్ వీధికి చెందిన సురేష్ కుమార్(52) భవన నిర్మాణ సంస్థ నడుపుతున్నాడు. ఆయనతో పాటు ఇంట్లో కుమారుడు స్టీఫెన్ రాజ్, కోడలు సుజిత ఉన్నారు. కోడలు సుజిత బుధవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వడపళణిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఉన్న తల్లీబిడ్డను కుటుంబసభ్యులందరూ వెళ్లి పరామర్శించారు. ఇక సురేష్‌కుమార్ ఆనందానికి అవధులు లేవు. మనవరాలు పుట్టిన ఆనందంతో మిత్రులు, సహచరులకు ఫోన్లు చేసి మరీ చెప్పేశాడు. కుటుంబ సభ్యులందరూ ఆస్పత్రిలో ఉండడంతో బుధవారం రాత్రి ఒంటరిగా సురేష్‌కుమార్ ఇంటికి వెళ్లాడు. మిత్రులకు ఫోన్లు చేస్తూ, మనవరాలు పుట్టిన ఆనందంలో అతిగా మద్యం సేవించాడు. తన గదిలో ఏసీ సైతం వేసుకుని నిద్రకు ఉపక్రమించినట్టుంది. గురువారం వేకువజామున సురేష్‌కుమార్ ఇంటి పై అంతస్తు నుంచి పొగ రావడాన్ని ఇరుగు పొరుగు వారు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టిలోనికి వెళ్లారు. అప్పటికే అక్కడ సురేష్‌కుమార్ సజీవదహనమై పడి ఉండడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఆ గదిలో మద్యం బాటిళ్లు, సిగరేట్ ముక్కలు ఉండటాన్ని గుర్తించారు. ఏసీలో షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్టు నిర్ధారించారు. మనవరాలు పుట్టిన ఆనందంలో అతిగా మద్యం సేవించడంతో విద్యుదాఘాతం నుంచి తప్పించుకోలేక ఆయన ఆహుతై ఉంటాడని పోలీసులు పేర్కొంటున్నారు. చదవండి: ధరలు పైపైకి.. ఆ ఇళ్లకు ఫుల్ డిమాండ్, అవే కావాలంటున్న ప్రజలు! -
సెల్‌షాపులో భారీ అగ్నిప్రమాదం
పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో సెల్‌షాపులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మం గళవారం అర్ధరాత్రి సమయంలో జరిగిన ప్రమాదంలో షాపు పూర్తిగా దగ్ధమై, తీవ్ర నష్టం వాటిల్లింది. సుమారు రూ.10 లక్షల మేర ఆస్తినష్టం జరిగినట్టు బాధిత వ్యాపారి చెబుతున్నాడు. ఈ ఘటన ద్వారకాతిరుమలలోని గరుడాళ్వార్ సెం టర్లో ఉన్న అంబికా మొబైల్స్ దుకాణంలో చో టుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. గ్రా మానికి చెందిన యిమ్మడి సదానంద శ్రీనివాస్ తన భవనంలోని మెడికల్ షాపు పక్క గదిని పురోహిత్ జగదీష్ అనే వ్యాపారికి అద్దెకిచ్చాడు. సుమారు ఏడేళ్లుగా జగదీష్ అందులో సెల్‌ఫోన్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. అయితే రోజులానే జగదీష్ మంగళవారం రాత్రి షాపును మూసివేసి, ఇంటికి వెళ్లిపోయాడు. అర్ధరాత్రి వేళ ఉన్నట్టుండి షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు వ్యాపించాయి. సెల్ఫోన్లు, సెల్ బ్యాటరీలు, ఇన్వర్టర్ బ్యాటరీలకు నిప్పంటుకోవడంతో మంటలు అధికమయ్యాయి. ఈ సమయంలో పక్క గదిలో ఉన్న సదానంద శ్రీనివాస్ తీవ్రమైన వేడి రావడాన్ని గమనించి బయటకొచ్చి చూశారు. షాపు షట్ట ర్ల నుంచి దట్టమైన పొగలు, శబ్దాలు రావడాన్ని గుర్తించిన ఆయన విషయాన్ని విద్యుత్ సిబ్బందికి తెలిపి, కరెంటు సరఫరాను నిలుపుదల చేయిం చారు. ఆ తరువాత ఆయన స్థానికుల సహాయంతో షట్టర్‌ను పైకెత్తే సరికి మంటలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. మంటలను అదుపు చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. విషయం తెలుసుకున్న భీమడోలు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని, రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో షాపులోని 50 ఆండ్రాయిడ్ ట చ్ ఫోన్లు, 200 సా ధారణ ఫోన్లతో పా టు విలువైన సామగ్రి పూర్తిగా కాలిపోయింది. దాదాపు రూ.10 లక్షల వరకు నష్టం సంభవించినట్లు వ్యాపారి జగదీష్ తెలిపాడు. సర్వం కోల్పోయామంటూ కన్నీరు మున్నీరయ్యాడు. -
షార్ట్‌సర్క్యూట్‌తో మెడికల్‌షాపు దగ్ధం
పెద్దపల్లిటౌన్: స్థానిక శివా లయం కూడలి వద్ద గల తె లంగాణ మెడికల్ షాపు సో మవారం తెల్లవారుజాము న విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో దగ్ధమైంది. ఫర్నీచర్, టీవీ, ఫ్రిజ్‌తోపాటు మం దులు కాలిపోయినట్లు బాధి తుడు కలీమ్ తెలిపారు. మాజీ ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, కాసిపేట లింగయ్య, మున్సిపల్ చైర్మన్ రాజయ్య సందర్శించారు. ఎస్సై జగదీశ్ సంఘటనస్థలంలో పంచనామా నిర్వహించి బాధితుడి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడిని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పరామర్శించారు. ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సంఘటన స్థలాన్ని ఏసీపీ హబీబ్‌ఖాన్ పరిశీలించారు. -
సిబ్బంది లేక ఇబ్బంది
సాక్షి, నెల్లూరు: రోజురోజుకూ ఎండలు తీవ్రమవుతున్నాయి. మరోవైపు వడగాలులు సైతం ప్రతాపం చూపుతున్నాయి. ప్రమాదవశాత్తు, నిర్లక్ష్యంగా వ్యవహరించడం, విద్యుత్తు షార్ట్‌సర్క్యూట్ .. ఇలా కారణాలేవైనప్పటికీ జిల్లాలో అగ్నిప్రమాదాలు అధికమౌతున్నాయి. గత ఏడాది ఇదే నెలలో 120 నుంచి 140 వరకు అగ్నిప్రమాదాలకు సంబంధించి అధికారులకు ఫోన్‌కాల్స్ రాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు 200 కాల్స్ నమోదు అయ్యాయంటే ప్రమాదాల సంఖ్య ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకే రోజు 25 ఘటనలకు సంబంధించిన ఫోన్ కాల్స్ వచ్చిన సందర్భం కూడా ఉంది. అయితే పరిస్థితికి తగినట్టుగా జిల్లాలోని అగ్నిమాపక కేంద్రాల్లో సిబ్బంది అందుబాటులో లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ప్రస్తుతం జిల్లాలో 13 అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 45 ఫైర్‌మన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయాలని జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపినా అవి ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలో ప్రమాదాలు జరిగిన సమయంలో ఉన్న సిబ్బందిపైనే అదనపు భారం పడుతోంది. కొన్ని అగ్నిమాపక కేంద్రాల్లో బోర్లు ఏర్పాటు చేసినా వాటిలో నీటి లభ్యత తక్కువగా ఉంది. దీంతో ప్రమాదాలు జరిగిన సమయంలో నీటి సేకరణ కోసం సిబ్బంది పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. మరిన్ని అగ్నిమాపక కేంద్రాలు అవసరం జిల్లాలో ప్రస్తుతం మర్రిపాడు, ఉదయగిరి, ఆత్మకూరు, వింజమూరు, కావలి, నెల్లూరు, గూడూరు, కోట, సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి, రాపూరు, పొదలకూరులో అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. ప్రమాదాల సంఖ్య పెరిగిన నేపథ్యంలో వీటిలోని అగ్నిమాపక వాహనాలు సకాలంలో వెళ్లి సేవలందించలే కపోతున్నాయి. చాలా చోట్ల ప్రమాదాలు జరిగిన సమయంలో ఫైరింజన్లు వెళ్లేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. మరోవైపు జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి జోరుగా సాగుతోంది. పలు పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో పలుచోట్ల అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం వెంకటాచలం, కొడవలూరు మండలం నార్త్‌రాజుపాళెం, నెల్లూరులోని టీబీ ఆస్పత్రి ప్రాంగణంలో అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అత్యాధునిక పరికరాల కొరత అగ్నిప్రమాదాలు సంభవించినపుడు మంటలను ఆర్పేందుకు, ప్రాణనష్టాన్ని నివారించేందుకు అవసరమయ్యే ఆధునిక యంత్ర పరికరాలు(రెస్క్యూ ఎక్విప్మెంట్) ప్రస్తుతం జిల్లాలో తగినన్ని లేవు. మరోవైపు అపార్టుమెంట్లు, భారీ షాపింగ్ కాంప్లెక్స్‌ల్లో ప్రమాదాలు జరిగినా స్కైలిఫ్ట్‌లు అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది ఏమీ చేయలేని పరిస్థితి. ఈ క్రమంలో రూ.3 కోట్ల విలువైన అత్యాధునిక పరికరాలు అవసరమని జిల్లా ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కనీసం 25 మీటర్ల ఎత్తులో మంటలను ఆర్పేందుకు అవసరమైన పరికరాలను సమకూర్చాలని కోరారు. ఇరుకు వీధుల్లో ప్రమాదాలు సంభవించినా త్వరితగతిన వెళ్లేందుకు క్విక్ రెస్పాన్స్ వాహనం మరో వారం రోజుల్లో అందుబాటులోకి రానుంది. సకాలంలో స్పందిస్తున్నాం అగ్నిమాపక శాఖ సిబ్బంది కేవలం మంటలను ఆర్పడానికే పరిమితం కావడం లేదు. ఎవరు ఎలాంటి ఆపదలో చిక్కుకున్నా మాకు సమాచారం అందిస్తే స్పందిస్తున్నాం. ఇటీవల వెంకటాచలం సమీపంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ వాహనంలోనే ఇరుక్కుపోయాడు. మా వద్ద ఉన్న ప్రత్యేకమైన పరికరాల సహాయంతో అతన్ని బయటకు తీసి ప్రాణాలు కాపాడగలిగాం. జి.శ్రీనివాస్, డీఎఫ్ఓ -
అర్ధరాత్రి అగ్నిప్రమాదం
కిష్టంపేట(చెన్నూర్ రూరల్), న్యూస్‌లైన్ : అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదం మూడు కుటుంబాలను నిరాశ్రయుల్ని చేసింది. చెన్నూర్ మండలంలోని కిష్టంపేట గ్రామానికి చెందిన బండం లచ్చిరెడ్డి, రాజిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిల మూడు ఇళ్లు సోమవారం అర్ధరాత్రి షాట్ సర్క్యూట్‌తో కాలి బూడిదయ్యాయి. బాధితుల కథనం ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో షాట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా ఇంట్లో మంటలు లేచాయి. గమనించిన కుటుంబ సభ్యులు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. మంటలు ఎక్కువై గ్యాస్ సిలిండర్ కూడా పేలిపోయింది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడ్డాయి. ఇది గమనించిన గ్రామస్తులు హుటాహుటిన పరుగెత్తుకొని వచ్చి మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేశారు. కానీ మంటలు అదుపులోకి రాకపోవడంతో వెంటనే మంచిర్యాల ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. ఫైరింజన్ వచ్చి మంటలను ఆర్పేసింది. అయితే అప్పటికే ఇళ్లు పూర్తిగా కాలి బూడిదైంది. కాగా, వీరు అంతా రక్త సంధీకులే. ఒకే కుటుంబానికి చెందిన వారే అయినా ఒకే ఇంటిలో వేర్వేరుగా కాపురం ఉంటున్నారు. ఇళ్లు పూర్తిగా కాలిపోవడంతో వీరు నిరాశ్రయులయ్యారు. బంగారు, వెండి ఆభరణాలతో పాటు, ఇతర సామగ్రి కూడా పూర్తిగా కాలిపోయింది. తమకు సుమారు రూ.పది లక్షల నష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ సిబ్బంది పంచనామా సంఘటనా స్థలాన్ని మంగళవారం డిప్యూటీ తహశీల్దార్ శేఖర్ తమ సిబ్బందితో వచ్చి పరిశీలించారు. పంచనామా నిర్వహించారు. సుమారుగా రూ.పది లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. ఆయన వెంట ఆర్ఐ పరమేశ్వర్‌రెడ్డి, వీర్వోలు జమీర్‌అలీ, రాజన్న ఉన్నారు. -
జిన్నింగ్ మిల్లులో షార్ట్ సర్క్యూట్
భైంసా, న్యూస్‌లైన్ : పట్టణంలోని ధ్రువ జిన్నింగ్ ఫ్యాక్టరీలో ప్రెస్సింగ్ యూనిట్లోబుధవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రెస్సింగ్ యూనిట్లో జిన్నింగ్ యంత్రాలు పనిచేస్తున్నాయి. అదే సమయంలో షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం సంభవించింది. మంటలు బెల్టుకు అంటుకుని జిన్నింగ్ యంత్రాలు దగ్ధమయ్యాయి. జిన్నింగ్ యంత్రాల్లో బెల్టులు ఇతర సామగ్రి కాలిపోయూరుు. జిన్నింగ్‌లో పనిచేసే సిబ్బంది ప్రమాదాన్ని గమనించి అగ్నిమాపకశాఖ అధికారులకు సమాచారం అందించారు. రెండు అగ్నిమాపక శకటాలతో ప్రమాద స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రెస్సింగ్ యూనిట్ ముందు నిల్వ ఉంచిన పత్తిని యాజమాన్యం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. యూనిట్‌ను ఆనుకుని ఉన్న పత్తి కొంత మేర దగ్ధమైంది. ఈ ప్రమాదంలో రూ.4 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లిందని యాజమాన్యం తెలిపింది.