ద్వారకాతిరుమలలో అంబికా మొబైల్స్‌లో మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో సెల్‌షాపులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మం గళవారం అర్ధరాత్రి సమయంలో జరిగిన ప్రమాదంలో షాపు పూర్తిగా దగ్ధమై, తీవ్ర నష్టం వాటిల్లింది. సుమారు రూ.10 లక్షల మేర ఆస్తినష్టం జరిగినట్టు బాధిత వ్యాపారి చెబుతున్నాడు. ఈ ఘటన ద్వారకాతిరుమలలోని గరుడాళ్వార్ సెం టర్‌లో ఉన్న అంబికా మొబైల్స్ దుకాణంలో చో టుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. గ్రా మానికి చెందిన యిమ్మడి సదానంద శ్రీనివాస్ తన భవనంలోని మెడికల్ షాపు పక్క గదిని పురోహిత్ జగదీష్ అనే వ్యాపారికి అద్దెకిచ్చాడు. సుమారు ఏడేళ్లుగా జగదీష్ అందులో సెల్‌ఫోన్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. అయితే రోజులానే జగదీష్ మంగళవారం రాత్రి షాపును మూసివేసి, ఇంటికి వెళ్లిపోయాడు. అర్ధరాత్రి వేళ ఉన్నట్టుండి షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు వ్యాపించాయి. సెల్‌ఫోన్లు, సెల్ బ్యాటరీలు, ఇన్వర్టర్ బ్యాటరీలకు నిప్పంటుకోవడంతో మంటలు అధికమయ్యాయి.
ఈ సమయంలో పక్క గదిలో ఉన్న సదానంద శ్రీనివాస్ తీవ్రమైన వేడి రావడాన్ని గమనించి బయటకొచ్చి చూశారు. షాపు షట్ట ర్ల నుంచి దట్టమైన పొగలు, శబ్దాలు రావడాన్ని గుర్తించిన ఆయన విషయాన్ని విద్యుత్ సిబ్బందికి తెలిపి, కరెంటు సరఫరాను నిలుపుదల చేయిం చారు. ఆ తరువాత ఆయన స్థానికుల సహాయంతో షట్టర్‌ను పైకెత్తే సరికి మంటలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. మంటలను అదుపు చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. విషయం తెలుసుకున్న భీమడోలు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని, రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో షాపులోని 50 ఆండ్రాయిడ్ ట చ్ ఫోన్లు, 200 సా ధారణ ఫోన్లతో పా టు విలువైన సామగ్రి పూర్తిగా కాలిపోయింది. దాదాపు రూ.10 లక్షల వరకు నష్టం సంభవించినట్లు వ్యాపారి జగదీష్ తెలిపాడు. సర్వం కోల్పోయామంటూ కన్నీరు మున్నీరయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment