కిష్టంపేట(చెన్నూర్ రూరల్), న్యూస్‌లైన్ : అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదం మూడు కుటుంబాలను నిరాశ్రయుల్ని చేసింది. చెన్నూర్ మండలంలోని కిష్టంపేట గ్రామానికి చెందిన బండం లచ్చిరెడ్డి, రాజిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిల మూడు ఇళ్లు సోమవారం అర్ధరాత్రి షాట్ సర్క్యూట్‌తో కాలి బూడిదయ్యాయి. బాధితుల కథనం ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో షాట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా ఇంట్లో మంటలు లేచాయి.
గమనించిన కుటుంబ సభ్యులు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. మంటలు ఎక్కువై గ్యాస్ సిలిండర్ కూడా పేలిపోయింది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడ్డాయి. ఇది గమనించిన గ్రామస్తులు హుటాహుటిన పరుగెత్తుకొని వచ్చి మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేశారు. కానీ మంటలు అదుపులోకి రాకపోవడంతో వెంటనే మంచిర్యాల ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. ఫైరింజన్ వచ్చి మంటలను ఆర్పేసింది.
అయితే అప్పటికే ఇళ్లు పూర్తిగా కాలి బూడిదైంది. కాగా, వీరు అంతా రక్త సంధీకులే. ఒకే కుటుంబానికి చెందిన వారే అయినా ఒకే ఇంటిలో వేర్వేరుగా కాపురం ఉంటున్నారు. ఇళ్లు పూర్తిగా కాలిపోవడంతో వీరు నిరాశ్రయులయ్యారు. బంగారు, వెండి ఆభరణాలతో పాటు, ఇతర సామగ్రి కూడా పూర్తిగా కాలిపోయింది. తమకు సుమారు రూ.పది లక్షల నష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
రెవెన్యూ సిబ్బంది పంచనామా
సంఘటనా స్థలాన్ని మంగళవారం డిప్యూటీ తహశీల్దార్ శేఖర్ తమ సిబ్బందితో వచ్చి పరిశీలించారు. పంచనామా నిర్వహించారు. సుమారుగా రూ.పది లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. ఆయన వెంట ఆర్‌ఐ పరమేశ్వర్‌రెడ్డి, వీర్వోలు జమీర్‌అలీ, రాజన్న ఉన్నారు.
అర్ధరాత్రి అగ్నిప్రమాదం
Published Wed, Feb 5 2014 5:00 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement
Advertisement