kishtampeta
-
కిష్టంపేటలో ప్రబలుతున్న జ్వరాలు
చెన్నూర్ రూరల్ : గత వారం రోజులుగా మండలంలోని కిష్టంపేట గ్రామంలో జ్వరాలు ప్రబలుతున్నాయి. ఇప్పటికే చాలా మంది జ్వరాలు ప్రబలి మంచం పట్టారు. గ్రామానికి చెందిన భైరి శాంత, గజ్జెల లస్మాగౌడ్, సీతక్క, లక్ష్మి, రమ, దుర్గం శంకర్, కుంభం లక్ష్మి, ఎన్నం పుల్లయ్య, రామస్వామిలతో పాటు మరో కొంత మంది జ్వరాలతో బాధపడుతున్నారు. జ్వరాలు సోకిన వారు కొందరు చెన్నూర్, మంచిర్యాల ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్లి చికిత్సలు పొందినా తగ్గడం లేదని వాపోతున్నారు. కొంతరు స్థా«నిక ఆర్ఎంపీల వద్ద చికిత్సలు పొందుతున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకొని గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. -
అర్ధరాత్రి అగ్నిప్రమాదం
కిష్టంపేట(చెన్నూర్ రూరల్), న్యూస్‌లైన్ : అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదం మూడు కుటుంబాలను నిరాశ్రయుల్ని చేసింది. చెన్నూర్ మండలంలోని కిష్టంపేట గ్రామానికి చెందిన బండం లచ్చిరెడ్డి, రాజిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిల మూడు ఇళ్లు సోమవారం అర్ధరాత్రి షాట్ సర్క్యూట్‌తో కాలి బూడిదయ్యాయి. బాధితుల కథనం ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో షాట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా ఇంట్లో మంటలు లేచాయి. గమనించిన కుటుంబ సభ్యులు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. మంటలు ఎక్కువై గ్యాస్ సిలిండర్ కూడా పేలిపోయింది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడ్డాయి. ఇది గమనించిన గ్రామస్తులు హుటాహుటిన పరుగెత్తుకొని వచ్చి మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేశారు. కానీ మంటలు అదుపులోకి రాకపోవడంతో వెంటనే మంచిర్యాల ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. ఫైరింజన్ వచ్చి మంటలను ఆర్పేసింది. అయితే అప్పటికే ఇళ్లు పూర్తిగా కాలి బూడిదైంది. కాగా, వీరు అంతా రక్త సంధీకులే. ఒకే కుటుంబానికి చెందిన వారే అయినా ఒకే ఇంటిలో వేర్వేరుగా కాపురం ఉంటున్నారు. ఇళ్లు పూర్తిగా కాలిపోవడంతో వీరు నిరాశ్రయులయ్యారు. బంగారు, వెండి ఆభరణాలతో పాటు, ఇతర సామగ్రి కూడా పూర్తిగా కాలిపోయింది. తమకు సుమారు రూ.పది లక్షల నష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ సిబ్బంది పంచనామా సంఘటనా స్థలాన్ని మంగళవారం డిప్యూటీ తహశీల్దార్ శేఖర్ తమ సిబ్బందితో వచ్చి పరిశీలించారు. పంచనామా నిర్వహించారు. సుమారుగా రూ.పది లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. ఆయన వెంట ఆర్ఐ పరమేశ్వర్‌రెడ్డి, వీర్వోలు జమీర్‌అలీ, రాజన్న ఉన్నారు.