సాక్షి, విశాఖపట్నం: ఓ వైపు ఎండాకాలం.. మరోవైపు ఎన్నికలు.. రాష్ట్రమంతా వేడిగా, వాడిగా ఉంది. ఎవరు కలిసినా ఎన్నికల గురించే మాట్లాడుకుంటున్నారు. మధ్యలో ఎండ గురించి కూడా చెప్పుకుంటున్నారు. ఆ విధంగానే ఓచోట పిచ్చాపాటీ మాటాడుకుంటున్నారు ఈ ముగ్గురు మహిళలు. డ్వాక్రా సభ్యులైన వీళ్లు తమకు సీఎం ఇస్తామన్న పసుపు– కుంకుమ చెక్కుల గురించి చర్చించుకుంటున్నారు. బ్యాంకోళ్లు నా డబ్బులివ్వలేదంటే ..నా డబ్బులివ్వలేదంటూ దుమ్మెత్తిపోశారు.
చంద్రబాబేమో వడ్డీ డబ్బులు ఇవ్వకుండా ఈ ఖాళీ చెక్కులు తమ మొగాన పడేశాడని, ఆ డబ్బులు కూడా బ్యాంకు అధికారులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. పనిలోపనిగా బాబు ఇస్తామన్న సెల్ ఫోన్ల గురించి కూడా ముచ్చట్లాడుకున్నారు. ఆ మాట అటెళ్లి, ఇటెళ్లి చివరికి ఎన్నికల వైపు నడిచింది. ఆ సంభాషణ ఇలా సాగింది.
సత్తెక్క: ఏమే.. మంగక్కా.. డ్వాక్రాలో పదేల్లుగా ఉన్నానే.. పోయినసారి ఎలచ్చన్లలో డ్వాక్రా లోన్లు కట్టొద్దని సెంద్రబాబు అన్నాడని ఇరవై వేలు అప్పు కట్టడం మానీసేను. రెండేల్ల తర్వాత సూస్తే, అసలు రెండింతలయింది. బ్యాంకోల్లు కట్టీమని గట్టిగ సెప్పినారు. దీంతో ఇరవై వేలు వడ్డీకి తెచ్చి కట్టినాను.
మంగక్క: అవునే సత్తెక్క .. నాపని కూడా అలాగే అయింది. బాబు మాటలు ఇని అసలుకంటే వొడ్డీ ఎక్కువగా బ్యాంకోళ్లకు కట్టినం. ఇప్పుడు ఎలచ్చన్లు వస్తున్నాయని మళ్లీ చంద్రబాబు పసుపు– కుంకుం సెక్కులు ఇచ్చినాడు. ఆ డబ్బులు కూడా బ్యాంకోల్లే పాత బాకీలకు జమ సేసుకుంటామన్నారు.
లచ్చిమక్క: ఇదేటమ్మా.. మనం లోన్లు తీసుకుంటే సెంద్రబాబు ఒక్క రూపాయి కూడా వొడ్డీ కట్టకపాయె. మొన్నటి వరకూ కూడా అదిగోఇదిగో అని వొడ్డీ ఎగ్గొట్టీసినాడు. వొడ్డీ డబ్బులు సేతిలో పెట్టకుండా అందులో నుంచి కొంత తీసి మొకాన కొడుతున్నాడు. ఆ డబ్బులు సూసి కొందరు మురిసిపోతన్నారు. అసలు ఇసయం ఏటంటే.. ఐదేళ్ల కిందట మన అప్పెంత.. దానికి వొడ్డీ ఎంత.. మళ్లీ మన లోనెంత.. వొడ్డీ ఎంత, కట్టిందెంత? ఇవన్నీ సూసుకుంటే పసుపు కుంకం మోసం తెలిసిపోద్ది.
సత్తెక్క: నిజమేనే లచ్చిమక్క..ఏమో అనుకున్నా.. సెంద్రబాబు మామోలోడు కాడు. మన డబ్బులోంచి కొంత తీసి మన ముకాన కొడతన్నాడు. మనకే సాలా బాకీ పడినాడు. మొన్ననే డ్వాక్రా వోల్లకు సెల్ ఫోన్‌లు ఇస్తామని సెప్పినాడు. సింగపూర్ బాబు సెల్‌పోన్లు ఎవురికీ ఇవ్వలేదు. ఇచ్చినా టెంపర్‌వొరీ పోన్లు ఇస్తాడేమో .. ఆ పోన్ల నుంచి మన ఇవరాలన్నీ లాగేస్తాడేమో. మరేటి.. మనం ఎవరికి వోటేత్తామే మంగక్కా..
మంగక్క: సత్తెక్కా.. ఆ మద్దిన రాజశేకర రెడ్డి కొడుకు జగన్ బాబు వొచ్చినాడు కదా. పేదోల్లకు ఏం సేసేదీ క్లీరుగా సెప్పాడు. సాలా పనులు, సాయం సేస్తానన్నాడు. పొదుపు సేస్తున్న ఆడోల్లకు మొత్తం లోను తీర్సేస్తానన్నాడు. ఆల్ల నాయన మాదిరి ఈయన కూడా మాటకు కట్టుబడే వోడు. నాకైతే ఆతడికి ఓసారి చాన్సు ఇయ్యాలని ఉందే.
లచ్చిమక్క: అవునే ఈ సారికి ఆ బాబుకే ఏద్దామే.
Comments
Please login to add a commentAdd a comment