
ఎస్‌కేఆర్ అండ్ ఎస్‌కేఆర్ మహిళా డిగ్రీ కళాశాల
వైవీయూ: కడప నగరంలోని ఎస్‌కేఆర్ అండ్ ఎస్‌కేఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో శనివారం నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది. కళాశాల నగర నడిబొడ్డులో ఉండటంతో పాటు జిల్లాలోని ఏకైక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కావడం, దీనికి అనుబంధంగా హాస్టల్ ఉండటంతో కళాశాలలో ప్రవేశాలకు విద్యార్థినుల నుంచి చక్కటి స్పందన లభిస్తోంది. ఇప్పటికే దాదాపు వెయ్యికి పైగా దరఖాస్తులు రాగా ఇందులో కేవలం బీకాం కంప్యూటర్స్‌లో 80 సీట్లు ఉండగా 230పైగా దరఖాస్తులు వచ్చాయంటే ఇక్కడ ఉన్న డిమాండ్ ఏస్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు.
ఇప్పటికే ప్రవేశాలకు అర్హత కలిగిన విద్యార్థినులకు ఇంట ర్వ్యూ కార్డులను పంపడంతో పాటు టెలిఫోన్‌ల ద్వారా తెలియజేసినట్లు కళాశాల వర్గాలు పేర్కొంటున్నాయి. ఇంటర్వ్యూలకు హాజరయ్యే విద్యార్థినులు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతా సర్టిఫికెట్, టీసీ, సీసీలతో పాటు కులధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డులు తీసుకురావాల్సి ఉంటుందని ప్రవేశాల ఇన్‌చార్జి, వైస్ ప్రిన్సిపల్ వి.శ్రీరాములరెడ్డి తెలిపారు. అదే విధంగా మెరిట్ జాబితాను, వెయిటింగ్ లిస్టును కళాశాల నోటిసుబోర్డులో ఉంచినట్లు ఆయన తెలిపారు.
ఇంటర్వ్యూ సబ్జెక్టు తేదీ
జూన్ 02 బీఏ (తెలుగు/ఇంగ్లీషు), టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్, కంప్యూటర్స్
జూన్ 04 మ్యాథమ్యాటిక్స్ (ఎం.ఎస్. కంప్యూటర్స్)
జూన్ 05 ఎంపీసీస్, ఎంపీసీ, ఎంఈసీఎస్
జూన్ 06 బయోలాజికల్ సైన్సెస్ (బీజెడ్‌సీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ)
జూన్ 06 కామర్స్ (కంప్యూటర్ అప్లికేషన్స్, జనరల్)
జూన్ 07 వెయిటింగ్ లిస్టు అభ్యర్థులకు
Comments
Please login to add a commentAdd a comment